తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కూడా జాయిన్ అయ్యాడు. తానూ కూడా అనేక పోస్ట్లు పెట్టి తన వైపుకి చూపుని మళ్ళించు కున్నాడు మెగాస్టార్. లాక్ డౌన్ కారణం వల్ల సోషల్ మీడియా లో మరెంతో యాక్టివ్ అయ్యారు సెలబ్రెటీస్. ఇంకేం ఉంది కొత్త హెయిర్ స్టైల్స్ తో కొందరు వస్తుంటే, వంటలతో మరొకరు ఆశ్చర్య పరుస్తున్నారు. ఒక బాలీవుడ్ నటి అయితే ఏకంగా ఆన్ లైన్ కోర్స్ చేస్తోందిట. ఇలా ఎవరి ఆసక్తి తో వాళ్ళు ఈ లాక్ డౌన్ ని వినియోగించుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే చేరిన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ ని కూడా పవన్ ఫాలో అవుతున్నాడట. ఇలా పవన్ కళ్యాణ్ కొంత మందినే అంటే సుమారు ౩౦ మందినే తన ట్వీట్టర్ లో ఫాలో చేస్తున్నాడు. అలానే తాను ఫాలో అయ్యే వాళ్ళల్లో అధిక శాతం మంది రాజకీయ నాయకులే.
పవన్ కళ్యాణ్ మన భారత ప్రధాని మోదీ, మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింత్, అమిత్ షా , నిర్మల సీతారామన్ వంటి రాజకీయ ప్రముఖుల్ని మాత్రమే తన ట్వీట్టర్ నుండి ఫాలో అవుతాడట. అలాంటిది ఈరోజు మ్యూజిక్ డైరక్టర్ తమన్ ని ఫాలో అవుతున్న వార్తా షికార్లు కొడుతోంది .
ఈ సంతోష సమయంలో తమన్ పవన్ కి చాలా కృతజ్ఞతలు లవ్ యూ సార్’ అంటూ మ్యూజిక్ డైరక్టర్ ఎస్.ఎస్ తమన్ ట్వీట్ చేశాడు. ఈరోజుని పవన్ అనుసరిస్తున్న శుభా వార్తతో మొదలవుతున్నందుకు ఆనందం అని కూడా తమన్ చెప్పాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments