నటి శృతి హాసన్ తనదైన శైలి తో అనేక సినిమాల్లో నటించారు. ఈమె ఫాలోయింగ్, క్రియేటివిటీ క్రేజ్ కూడా బాగా ఎక్కువ. కేవలం నటిగానే కాకుండా గాయనిగా కూడా దక్షిణాది లోనే కాక బాలీవుడ్ లోను తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతిహాసన్.
అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరవుతారు. లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు.
అయితే శృతి హాసన్ కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. అయితే ఆమె ఫాలోవర్స్ అంతా ఇంతా కాదు. ఏకంగా కోటి నలభై లక్షల మంది ఫాలో అవుతున్నారు ఆమెని. ఈ మేరకు ఎంతో కృతజ్ఞతల తో అభిమానులకి మెసేజ్ ఇచ్చారు.
నన్ను ఇంతగా ఆదరిస్తున్న కుటుంబానికి కృతజ్ఞతలు అంటూ ఆమె చెప్పింది. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను అంటూ ఆమె అభిమానులకి ఎంతో ప్రేమగా కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా చరిత్రలో ఇదో వింత సమయం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ విచిత్రమైన భావోద్వేగాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అయితే ఇలా లాక్ డౌన్ కారణంగా ఇంస్టాగ్రామ్ లో శృతిహాసన్ అభిమానుల తో బాగా కనెక్ట్ అయిపోయారు. ఆమె చేస్తున్న ప్రతి పనిని కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాన్స్ తో పంచుకుంటున్నారు. అలానే నెగిటివిటీని అనుమతించే మానసిక స్థితి లో ఇప్పుడు నేను లేనని మంచిని మాత్రమే కోరుకుంటున్నా అని చెప్పారు.
నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎంత పాజిటివ్ గా ఉంటే అంత మంచిది కదా...! అలాగే చెడు చూడకు చెడు వినవద్దు చెడు మాట్లాడవద్దు అని ఆమె ఎమోజిలతో తమ అభిమానులకి చెప్పారు నిజమే ఈ కరోనా లో నెగిటివిటీని అనుమతించవద్దు. పాజిటివ్ గా ఉంటూ ఆనందంగా ఉండడమే మంచిది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments