నందమూరి నటసింహం బాలక్రిష్ణ, తెలంగాణా పోరాట యోధుడు "గోన గన్నా రెడ్డి" పాత్రలో ఒక మూవీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి..
దాన వీర సూర కర్ణ సినిమా లో అభిమన్యు పాత్ర వేసినా, అక్బర్ సలీం అనార్కలి లో జహంగిర్ పాత్ర వేసినా, ఆదిత్య 369, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి చిత్రాల్లో మెరిసినా బాలక్రిష్ణ పూర్తిగా ఒదిగిపోయి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు..
13 వ శతాబ్దం లో తెలంగాణా ప్రాంతం లో రుద్రమ దేవీ డైనాస్టీ నడుస్తున్న కాలం లో గోన గన్నారెడ్డి అనే ఒక వీరుడు తన ప్రభావాన్ని చూపించగలిగాడు..
అయితే బాలక్రిష్ణ కొన్నేళ్ళుగా ఈ పాత్రపై మక్కువ పెంచుకున్నారు.. ఎలాగైనా ఈ మూవీ చెయ్యాలనుకుంటున్న తరుణం లో గోన గన్నారెడ్డి చరిత్ర పై ఎక్కడా పూర్తి సమాచారం దొరకలేదు.. అయినప్పటికీ రుద్రమదేవి కి చెందిన చరిత్ర లో గోన గన్నారెడ్డి పేరు విస్త్రుతంగా వినబడుతుంది.. అందుకే కొంత భాగాన్ని కల్పించి రాసి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రచయితలు ప్రయత్నం చేయాలని బాలక్రిష్ణ సూచించినట్టు సమాచారం..
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వం లో ఒక సినిమా పూర్తయ్యే దశలో ఉండగా అది కాగానే జనవరి, ఫిబ్రవరి 2021 నాటికి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కించాలనే ఉద్దేశ్యం తో బాలయ్య ఉన్నట్టు తెలుస్తోంది.. స్టోరీ రాయడం పూర్తయ్యాక దర్శకుడిని ఫైనల్ చెయ్యాలని అనుకుంటున్నారు.. అయితే కొన్నేళ్ళ క్రితం అనుష్క నటించిన రుద్రమదేవి సినిమా లో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించి మెప్పించాడు.. అయితే బాలయ్య అదే పాత్రలో నటిస్తే ఎలా ఉంటుంది? అనేది ఆశక్తికరంగా మారింది.. మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments