గుండెపోటుతో ఆదివారం కన్నుమూసాడు కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా. అతని అంత్యక్రియలు కనకపుర రోడ్ లోని నెల గోడి గ్రామంలో ఫార్మ్ హౌస్ లో జరిగాయి. ఆదివారం రాత్రి నుంచి నగరం లోని బసవనగుడి లోని చిరంజీవి నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.
అలానే పెద్ద సంఖ్య లో బంధువులు రాజకీయ నాయకులు అభిమానులు అంతిమ దర్శనం చేసుకున్నారు. అయితే పురోహితులు సంస్కార పూజ లను పూర్తిచేసి మధ్యాహ్నం రెండు గంటలకి పూలతో అలంకరించిన వాహనంలో కనకపుర రోడ్ లోని సొంత ప్రాంతానికి తరలించారు.
అభిమానులు అధిక సంఖ్యలో వస్తారు అని భావించి రాంనగర్ జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అశ్రు నివాళులు మధ్య పార్థివ దేహాన్ని ఖననం చేశారు.
చిరంజీవి సర్జా మామ బహుభాషా నటుడు అర్జున్ కుటుంబం ఆదివారం రాత్రి నుంచి కారులో 11:30 కి బెంగళూరు చేరుకున్నారు. నేను మీ మామ వచ్చాను లేవరా అని బిగ్గరగా విలపించాడు అది చూసిన అందరూ కన్నీళ్లు ఆపుకోలేక పోయారు.
నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మృతి పట్ల శాండిల్వుడ్ నటులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు, మిత్రుని కోల్పోయాం అంటూ నటి రాధిక పండిత్ సంతాపం వ్యక్తం చేసింది.
చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటు తో కన్నుమూసాడు. అయితే చిరంజీవి సర్జా అన్న కిషోర్ 50 ఏళ్లకే 2009లో గుండెపోటుతో మృతి చెందాడు అయితే ఈ జూన్ నెల సత్య కుటుంబానికి కలిసి రావడం లేదని వ్యాఖ్యలు వినిపించాయి
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments