భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది, బుద్ధుడు

img

భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. 

నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి.

ఆరు స‌మాధానాల్లో

క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు

భ‌విష్య‌త్ చూపించిన బుద్ధుడు

బుద్ధుడు లోకానికి శాంతిని ప్ర‌బోధించాడు. అశాంతి అంత‌మ‌య్యే మార్గాల‌ను సూచించాడు. త‌న బోధ‌న‌ల ద్వారా త‌న‌ను ఆశ్ర‌యించిన‌వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాడు. ఒకరోజు కోస‌ల‌రాజు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చ‌క్క‌ని స‌మాధానాలిచ్చి భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతున్న‌దో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెప్పాడు బుద్ధుడు.... ఎంతో ఆస‌క్తిక‌ర‌మైన ఆ వివ‌రాలు ఈ వీడియోలో చూద్దాం.

ఒకరోజున కోసలరాజు ప్రసేనజిత్తు నిద్రలో తెల్లవారు ఝామున పదహారు కలలు కన్నాడు. తర్వాత నిద్రలో నుండి లేచి, ‘ఈ కలల వల్ల నేను ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాలో కదా!’ అని భయపడ్డాడు. తెల్లారాక, ఆస్ధాన పురోహితుల్ని పిలిపించి, విషయం చెప్పాడు. ... ఆస్థాన బ్రాహ్మణులు “మహారాజా! మీ కొచ్చిన కలలు మంచివికావు.. అవి దుస్వప్నాలు.... రాజ్య నాశనం, ప్రాణాపాయం, భోగభాగ్యాల వినాశనం వీటిలో ఏదో ఒకటి తప్పదు” అన్నారు...“అయితే ఆ వినాశనానికి విరుగుడు ఉందా? ” అని అడిగాడు. “ఉంది మహారాజా! మహాయజ్ఞమే దానికి నివారణ” అన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాణి “ మహారాజా! భయపడకండి. బుద్ధభగవానుని దగ్గరకు వెళ్ళండి. మీ స్వప్నాల గురించి చెప్పండి”అని చెప్పి పంపించింది.

రాజు... బుద్దుని ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న కలల‌ గురించి చెబుతాడు. బుద్దుడు ప్రతి కలకి ఒక వివరణ ఇస్తాడు. ఆ వివరణల్లో బుద్దుని భవిష్యత్ దర్శనం, సామాజిక అవగాహన వెల్ల‌డ‌వుతుంది. ఆ కలలను... వాటికి బుద్ధుడు ఇచ్చిన‌ వివరణలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

అయ్యా... రాజభవనం ముందరి ఖాళీస్థలంలోకి నాలుగు దిక్కుల నుండి నాలుగు నల్లని ఎద్దులు ఆవేశంతో, ఉన్మాదంతో వచ్చి దూకాయి. ఒకదానితో ఒకటి కలబడి యుద్ధానికి సిద్ధమైనట్లుగా విజృంభించాయి. రంకెలు వేశాయి. బుసలు కొట్టాయి. ఆ ఎద్దుల పోరాటాన్ని చూడ్డానికి అన్నివైపుల నుండి జనం ఎగబడ్డారు. తీరా…అవి పోట్లాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కన్పించి, చివరకు పోట్లాడుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాయి.

అందుకు బుద్దుడు సమాధానమిస్తూ ..మహారాజా... భయపడకు. ఈ స్వప్నం వల్ల ఇప్పటి కిప్పుడు నీకు జరిగే కీడేమీ లేదు. దీనివల్ల ఎవరి జీవితాల్లో కూడా ఎలాంటి దుర్ఘటనలూ జరగవు.ఈ స్వప్నం భవిష్యత్తు కు సంబంధించింది. రాబోయే కాలంలో పాలకులు, పాలితులు తప్పుదోవ పడతారు. ప్రపంచంలో చెడు నడత పెరిగిపోతుంది. నైతిక మార్గం నుండి ఈ లోకం వెనక్కు మళ్ళినప్పుడు, ప్రకృతి వినాశనానికి పాల్పడతారు. అప్పుడు దివి నుండి వర్షాలు దిగిరావు. మేఘాలు ముసురుకొస్తాయి. కానీ, ఒక్క వాన చినుకు కూడా రాల్చకుండా వెళ్ళిపోతాయి. అప్పుడు తీవ్ర అనావృష్టి కలుగుతుంది. పంటలు ఎండి పోతాయి. దుర్భిక్షం నెలకొంటుంది. మహారాజా! ఇదీ ఆ స్వప్నం తెలిపే సందేశం. అంతేగానీ, ఇప్పటికిప్పుడు మీ కొచ్చే ముప్పేమీ లేదు. బ్రాహ్మణులు తమ జీవనోపాధికోసం, యజ్ఞాలు చేయించడం కోసం, మీకు అలా చెప్పారు. అంతే. ఇక, మీ రెండో కల గురించి చెప్పండి..” అన్నారు..

అయ్యా... భూమిని చీల్చుకుని చిన్న చిన్న చెట్లు, పొదలు పుట్టుకొచ్చాయి. ఇలా పుట్టుకొచ్చిన వృక్షాలు పెరిగి పెద్దవ‌లేదు. చిన్నగా ఉన్నప్పుడే పూలు పూశాయి. కాయలు కాశాయి. పూలన్నీ కాయలుగా మారలేదు. భగవాన్! ఇదీ! నా రెండో కల”.

మహారాజా... ఈ కల కూడా ఇప్పుడు మీకేమీ కీడు కలిగించదు. ప్రపంచం నైతిక పతనానికి చేరినప్పుడు, మానవ జీవితకాలం కుంచించుకుపోతుంది. ఆయుః ప్రమాణం తగ్గిపోతుంది. ఆ కాలంలో కోరికలు పెరిగి పోతాయి. బలీయమవుతాయి. చిన్నచిన్న ఆడ పిల్లలతోనే మగవాళ్ళు జీవించాలనుకుంటారు. పిన్న వయసులోనే ఆడపిల్లకు పెళ్ళవుతుంది. అతి పిన్నవయసులోనే గర్భవతులవుతారు. బిడ్డల్ని కంటారు. ” అన్నారు..

అయ్యా... ఇది చాలా ఆశ్చర్యకరమైన కల. అప్పుడే పుట్టిన లేగ దూడల పొదుగుల నుండి ఆవులు పాలు తాగుతున్నాయి.”

బుద్దుడు సమాధానమిస్తూ ..మహారాజా... ఈ కల అంతరార్థం ఇదే... రాబోయే కాలంలో వయసుకు, అనుభవానికి గౌరవం లేకుండా పోతుంది. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల గౌరవం నశిస్తుంది. ఆస్తిపాస్తుల విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో పిల్లలే పెత్తనం సాగిస్తారు. అలా చేయడం వల్లే వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. పిల్లల ఇష్టాఇష్టాలమీద ఆధారపడి మాత్రమే పెద్దల పోషణ వుంటుంది. పెద్దలు, వృద్ధులు, ఇతర కుటుంబ సభ్యులు మొత్తం పిల్లల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తారు. ఇదే...దూడల పాలు ఆవులు తాగాయ‌నడానికి అర్థం.”

“భగవాన్! బండి 'కాడి' కి కట్టేసివున్న బలిసిన ఎద్దుల్ని పక్కకుతప్పించి, వాటి స్థానంలో పసి కోడెదూడల్ని కట్టి బరువుల్ని లాగిస్తున్నారు. బరువుల్ని లాగలేని ఆ దూడలు కదలక మెదలక నిలబడి చూస్తున్నాయి.”

దీనికి కూడా బుద్దుడు వివరణ ఇస్తూ .. భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. చట్టం, న్యాయం తెలిసినవారిని, అనుభవజ్ఞులైన పెద్దల్ని సలహాదారులుగా పెట్టుకోరు. వారిని పక్కనపెట్టి అసమర్థులు, తెలివి హీనులు, బుద్ధిహీనులైన అజ్ఞానుల్ని, ఉన్నత పదవుల్లో కూర్చోబెడతారు. వీళ్లకి పరిపాలన రాకపోయినా తమకి కావలసిన వారు కాబట్టి రాజులు వీరినే అగ్రగణ్యుల్ని చేస్తారు. అందుకని, నిజమైన విజ్ఞులు, జ్ఞానులు కినుక వహిస్తారు. అత్యవసర సమయాల్లో సహాయం చేయడానికి ముందుకు రారు. ఇలా తెలివి తక్కువ వాళ్ళని, చేతగానివాళ్ళని పదవుల్లో ఉంచడం వల్ల రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయి, క్రమేపీ తెరమరుగువుతారు. రాచరికాలు అంతరిస్తాయి” అన్నారు..

అయ్యా... ఈ కలలో ఒక గుర్రం వచ్చింది. దానికి ముందూ వెనుకా రెండు వైపులా నోళ్ళున్నాయి. అది ఆ రెండు నోళ్ళతో ఒకేసారి దాణా తెగ తింటోంది.. దీనర్ధమేమిటి? అని అడిగారు..

భ్రష్టులైన రాజులు అనైతిక వాదుల్ని, న్యాయా న్యాయాలు తెలియని వ్యక్తుల్ని న్యాయాధికారులుగా నియ మిస్తారు. న్యాయాన్ని అవివేకుల చేతుల్లో పెడతారు. ఇలా నియమితులైన నీతి భ్రష్టులైన న్యాయాధికారులు ఇరుపక్షాల వారి నుండి లంచాలు తీసుకుంటారు. ఇలా రెండు వైపుల నుండీ లంచాలు మేసి అవినీతికరమైన తీర్పులు ఇస్తారు.

అయ్యా... ఇది మరీ విచిత్రం. చిన్న చిన్న పూలకంటే చిన్నగా వున్న చిరుకప్పలు పెద్ద పెద్ద కాలసర్పాల్ని, తామర తూటి కాడల్ని తిన్నంత తేలిగ్గా నమిలి మింగుుతున్నాయి.”

మహారాజా... ఈనాడు కుటుంబంలో, సమాజంలో అన్నిరంగాల్లో అధికారం చెలాయిస్తున్న మగవారి అధికారం భవిష్యత్తులో అడుగుంటిపోతుంది. మగవాడు కోర్కెల గుండంలో పడి కాలిపోతాడు. ఈనాడు భర్తల అధీనంలో వుండే బానిసలు, సేవకులు, గోవులు, ఎడ్లు, పశు వులు, బంగారం, ధనం- ఇలా సర్వసంపదలూ, ఆనాడు భార్యల అధీనంలోకి వస్తాయి. ‘ఇదేమిటి? అదేమిటి? అని ప్రశ్నించే హక్కును కూడా మగువారు కోల్పోతారు. స్త్రీలు అధికారులవుతారు. ఈ నాడు చిరుకప్పలా చూడబడుతున్న ఆడవారు భవిష్యత్తులో కాలనాగుల్లాంటి మగవారి అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఈ కల సారాంశం.

అయ్యా... బంగారు రాజ హంసలు సేవకుల్లా వెంట నడుస్తూ వుంటే, వారిమధ్య ఒక ఊరకాకి ఊరేగుతూ వస్తుంది.”

మహారాజా... దీనర్థం ఏమిటంటే... పిరికిపందలు రాబోయే కాలంలో పాలకులవుతారు. వీరు ధైర్యస్తులు కారు. నిరంతరం తమ గురించి భయపడుతూనే వుంటారు. తమ అధికారపీఠం ఎవరు లాక్కుంటారో అనే భయంతోనే బతికే స్తారు. అందుకే తన చుట్టూ వుండే పదవుల్ని అర్హులైన వారికి గానీ, ధైర్యశాలురకు గానీ ఇవ్వకుండా పిరికివారినీ, యోగ్యతలేనివారిని ఎంచుకొని మరీ ఇస్తారు. నిజమైన వీరుల్ని, అర్హుల్ని మాత్రం కేవలం సేవకులుగా మాత్రమే వాడుకుంటారు. ఇదే ఆ స్వప్న సందేశం.

అయ్యా....మామూలుగా చిరుతపులులు మేకల్ని ఆహారంగా తింటాయి కదా! కానీ, నా కలలో మేకలు చిరుతపులిని వెంటపడి తరుముతున్నాయి. మేకలు భీకరంగా అరుస్తున్నాయి. చిరుతలు ఆర్తనాదాలు చేస్తూ పరుగెడుతున్నాయి. చిరుతలే కాదు, తోడేళ్ళు కూడా తోకముడిచి మేకలకు అందకుండా పరుగో పరుగు… అలా ఒక దట్టమైన అడవిలోకి పరుగులు తీస్తున్నాయి.

మహారాజా... భవిష్యత్తులో నిమ్నకుల సంజాతులు అధికారంలోకి రావడాన్ని ఈ కల సూచిస్తుంది. ఈనాడు అధికారంలో ఉన్నవారు ఆనాడు అయోమయంలో పడిపోతారు. రాజ్యం, ఐశ్వర్యం, ఆస్తిపాస్తులు అన్నీనిమ్న కుల సంజాతుల వశం అవుతాయి. అప్పుడు ఈ కులీనులు తమ హక్కుల కోసం నిమ్నకుల సంజాతులతో పోరాడతారు. ఈనాడు నిమ్నకులాలు అనుభవించే శిక్షలన్నీ ఆనాడు కులీనులు అనుభవిస్తారు. చివరికి వారు ఈ రాజ్యం మనది కాదు, మనం చేసేదేమీలేదు, అనుకొని భయంతో బైటకు రారు. మేకలు చిరుతల్ని, తోడేళ్ళని తరమడమంటే నిమ్న కులాలు రాబోయే రోజుల్లో కులీనుల నుండి అధికారాన్ని పొందడమే. రాజా! ఇదీ మీ కల సారాంశం అని చెప్పాడు బుద్ధుడు. 

మరిన్ని

Comments

0 Comments

భక్తి

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()