మృత్యు ర‌హ‌స్యం శాస్త్రవేత్త‌లు ఏం క‌నిపెట్టారు?

img

మృత్యు ర‌హ‌స్యం

శాస్త్రవేత్త‌లు ఏం క‌నిపెట్టారు?

శ‌రీరంలో ఎటువంటి మార్పులొస్తాయి?

న్యూరాన్లు ఏం చేస్తాయి?

మృత్యుభ‌యం అన్ని జీవుల‌కు స‌హ‌జం. మిగిలిన జీవుల సంగ‌తి అలా ఉంచితే... మ‌నిషిని మృత్యుభ‌యం నిరంత‌రం వెంటాడుతుంటుంది. అటువంటి మృత్యువుకు సంబంధించిన విష‌యాలు తెలుసుకునేందుకు శాస్త్ర‌వేత్త‌లు నిరంత‌రం ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు. ఆ విష‌యాల‌ను ఈ వీడియోలో తెలుసుకుందాం....

చనిపోయేముందు మెదడు పోరాడుతుందా.. అనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అయితే పరిశోధనల ద్వారా శాస్తవ్రేత్తలు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ చారిటీ, అమెరికాలోని సిన్సినాటి యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించారు. నాడీవ్యవస్థకు సంబంధించిన కొత్త విషయాలను కనిపెట్టారు. ఈ పరిశోధనకు జెన్స్ డ్రీర్ నాయకత్వం వహించారు. నాడీవ్యవస్థ దెబ్బతిని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి మెదడుపై ఈ బృందం పరిశోధనలు చేసింది. వారందరూ వేర్వేరు కారణాలతో చనిపోయారు. కొందరికి గుండెనొప్పి వచ్చింది. మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. వీటిని ఒక క్రమపద్ధతిలో చెప్పడానికి వీలులేదు. ఈ రోగులపై అధ్యయనం సమయంలో సైంటిస్టులు ఒక కీల‌క విషయం గుర్తించారు. 

మనుషుల మెదడు, పశువుల మెదడు ఒకేరకంగా నశించడాన్ని కనిపెట్టారు. అంతేకాదు సరైన సమయంలో ప్రయత్నిస్తే మెదడును మళ్లీ పనిచేసేలా చేయవచ్చని ఊహిస్తున్నారు. వీళ్ల పరిశోధన ప్రధాన లక్ష్యం కూడా ఇదే.. మరణానికి ముందు మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడమే కాదు.. ఆ ప్రమాదం నుంచి, మరణం నుంచి మనుషుల్ని ఎలా కాపాడాలో తెలుసుకోవడమే ఈ పరిశోధనల ఉద్దేశం. 20వ శతాబ్దంలో జంతువులపై చేసిన పరిశోధనల ఫలితంగా మెదడు మరణానికి సంబంధించి పలు విషయాలు శాస్తవ్రేత్తలకు తెలిశాయి. శాస్తవ్రేత్తలు చెప్పిన వివరాల ప్రకారం.. గుండె పనిచేయడం ఆగిపోవడంతోనే మెదడుకు ఆక్సిజన్ అందదు. ఆ తర్వాత మెదడుకు రక్తసరఫరా ఆగిపోతుంది. అంటే మెదడు పరిచేయడానికి అవసరమైన రక్తం గుండె నుంచి సరఫరా కాదన్నమాట. ఈ స్థితిని వైద్య పరిభాషలో సెరెబ్రల్ ఇస్కీమియా అని అంటారు. క్రమంగా మెదడు అచేతనంగా మారిపోతుంది. ఆ స్థితిలో మెదడులోని న్యూరాన్లు తమ శక్తిని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాయి. కానీ మరణానికి కొన్ని క్షణాల ముందు వాటి ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించవు. అడెనోసిన్ ట్రిఫాస్పేట్ క్షీణించడంతో మెదడు నుంచి ముఖ్యమైన ఆయాన్లు అన్నీ వెళ్లిపోతాయి. శక్తిని నిల్వ చేయడంతోపాటు దాన్ని శరీరం మొత్తం పంపిణీ చేయడానికి అడెనోసిన్ ట్రైఫాస్పేట్ సహకరిస్తుంది. మెదడులో అడెనోసిన్ ట్రై ఫాస్పేట్ క్షీణించడంతో కణాల రికవరీ అసాధ్యంగా మారుతుంది. ఇదంతా కేవలం 10 నిముషాల్లోనే జరిగిపోతుంది. ఆక్సిజన్, రక్తసరఫరా నిలిచిపోయిన పది నిముషాల్లో మెదడులోని కణాలు పూర్తిగా చనిపోతాయి.

మనుషుల్లో చనిపోవడానికి ముందు మనుషుల మెదడు ఎలా స్పందిస్తుంది? అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ శాస్తవ్రేత్తల బృందం ప్రయత్నించింది. ఇందుకోసం చావు బతుకుల్లో ఉన్న తొమ్మిదిమంది రోగులపై శాస్తవ్రేత్త జెన్స్ డ్రీర్ పరిశోధన చేశారు. ఎలక్రోడ్ స్ట్రిప్‌ల సహాయంతో వారి నరాల పనితీరును అధ్యయనం చేశారు. తొమ్మిది మందిలో ఎనిమిది మంది రోగుల మెదడు కణాలు జరుగుతున్న పరిణామాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. మృత్యువు కబళించకుండా మెదడు కణాలు ప్రయత్నం చేసినట్లుగా తేల్చారు. సాధారణంగా న్యూరాన్లు ఆయాన్ల శక్తిని సంగ్రహించి పనిచేస్తాయి. తమలో, పరిసరాల్లో ఎలక్ట్రానిక్ అసమతౌల్య స్థితిని సృష్టించి జీవిస్తాయి. ఈ క్రమంలో అవి చిన్న చిన్న షాక్‌ల రూపంలో ఒక చోటు నుంచి మరోచోటికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ అసమతౌల్య స్థితిని న్యూరాన్లు నిరంతరం కొనసాగిస్తాయి. కణాలు రక్తం నుంచి శక్తిని, ఆక్సిజన్‌ను గ్రహించి న్యూరాన్లకు కావలసిన శక్తిని అందిస్తాయి. అయితే చనిపోయిన తర్వాత మెదడుకు రక్తసరఫరా ఆగిపోతుంది. ఫలితంగా న్యూరాన్లకు ఆక్సిజన్ అందదు. ఆ పరిస్థితిలో తమలో మిగిలిపోయిన శక్తిని న్యూరాన్లు సమీకరించుకుంటాయని పరిశోధకులు చెప్పారు. 

చివరి క్షణాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకి సిగ్నల్స్ పంపించడం వృథా ప్రయాస. అందుకే న్యూరాన్లు నిశ్శబ్దంగా ఉంటాయి. తిరిగి రక్తప్రసరణ కోసం న్యూరాన్లు ఎదురుచూస్తూ ఉంటాయి. కానీ అది జరగదు. ఇలాంటి పరిస్థితి మెదడు జీవితంలో ఒకేసారి ఎదురవుతుంది. దీనినే వైద్య పరిభాషలో అన్‌డిస్పర్స్‌డ్ డిప్రెషన్ అంటారు. ఆ తర్వాత మెదడులో ఉష్ణ సునామీ వస్తుంది. దీన్ని డీపోలరైజేషన్ ఆఫ్ డిఫ్యూజన్ అంటారు. మెదడు కణాలను సజీవంగా ఉంచే ఎలక్ట్రో-కెమికల్ సమతౌల్యం దెబ్బతినడం వల్ల ఈ అసాధారణ ఉష్ణశక్తి వెలువడుతుంది. మెదడు కణాలు మొద్దుబారడానికి, ధ్వంసం కావడానికి ఇది కారణం అవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా పూర్తిగా తగ్గిపోవడంతో మెదడు మొత్తం మొద్దుబారిపోయింది. పరిశోధకులు అధ్యయనం చేసిన అందరు రోగుల్లోనూ ఇలాగే జరిగింది. అయితే మరణానికి ఇదొక్కటే కారణం కాదని.... ఎన్నో అంశాలు దీనితో ముడిపడి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు మరణాన్ని ఆపడం ప్రస్తుతం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ రోజు మాత్రం ఎంతో దూరంలో లేదని శాస్తవ్రేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. కొందరు అకస్మికంగా మరణిస్తుంటారు. మరికొందరు వృద్దాప్యం వరకు జీవించగలుగుతారు. అయితే వృద్దాప్యంలోకి వెళ్లిన తర్వాత చావు దగ్గరపడుతుంది అని ప్రతి మనిషికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు కొన్ని రకాల సూచనలను కూడా అవతలి వ్యక్తులకు అందిస్తుంటారు. వారి ప్రవర్తన తీరును బట్టి వారు మరణానికి దగ్గరకు ఉన్నారని కూడా మనం తెలుసుకోవొచ్చు. మరణం దగ్గరపడే కొద్దీ మీ శరీరం ఆకారం తీరు కూడా మారుతుంది. రక్తపోటు పెరిగిపోతుంది. చర్మం పాలిపోతుంది. నీలం...ఊదా రంగులోకి మారిపోతుంది. ఇక మూత్రం రంగు కూడా మారిపోతుంది. బ్రౌన్, రస్ట్ కలర్ లోకి మారతుంది. జుట్టు, దంతాలు చాలా బలహీనంగా మారుతాయి. వాటి రంగు మొత్తం మారిపోతుంది. వృద్దాప్యంలో , చావు చివరి రోజుల్లో దేనిపై ఆసక్తి ఉండదు. అన్నం తినాలనే ధ్యాసే ఉండదు. మంచి భోజనం తీసుకొచ్చి ముందుపెట్టినా తినబుద్ది కాదు. ఏదీ తాగాలనిపించదు.

దీంతో శరీరం మొత్తం నీరసంగా మారుతుంది. మీపై ప్రేమతో గోరు ముద్దులు తినిపించాలనుకునే వారిపై కూడా కోప్పడుతారు. అలా అన్నం సరిగ్గా తినకపోవడంతో పోషణ తక్కువై బాగా చిక్కిపోతారు. ఒకవైపు శరీరం నీరసంగా మారినా కూడా మరోవైపు గంటల తరబడి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. బాగా నిరుత్సాహంగా మారుతారు. మరణ సమయం దగ్గరపడే కొద్దీ శరీరంలో జీవక్రియ తగ్గుతుంది. అలాగే ఎప్పుడూ అలసటకు గురవుతూ ఉంటారు. మరణం దగ్గరపడే కొద్దీ శ్వాస సమస్యలు కూడా ఎక్కువైపోతాయి. ఒక్కోసారి శ్వాస వేగంగా తీసుకోవడం, మరోసారి శ్వాస చాలా నెమ్మదిగా తీసుకోవడం జరుగుతాయి. శ్వాస తీసుకునే ప్రతిసారి ఇబ్బందిపడాల్సి వస్తుంది. చావు దగ్గర పడిందనడానికి ఇది ఒక హెచ్చరిక. జీవితం చివరి దశలో ప్రతి వ్యక్తి అసహనం పెరిగిపోతుంది. తాను నిరాశ్రయుడని ఆందోళన చెందుతూ ఉంటాడు. మనస్సు అంతా గందరగోళంగా ఉంటుంది. కట్టుకున్న వస్త్రాల్లోనే అవి చేసుకుంటూ ఉంటారు.

చావు దగ్గర పడే కొద్దీ మనుషులకు దూరం అవుతూ ఉంటారు. ఎప్పటికైనా తాను ఒంటిరిగానే మట్టిలో కలిసిపోవాలని బోధపడుతుంది. తాము బాగా ఇష్టపడే వ్యక్తులకు కూడా దూరంగా ఉంటారు. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. మరణం సమీపించే సమయంలో కొందరు ఎదుట ఒక వ్యక్తి ఉన్నట్లు ఊహించుకుని అతనితో తన గోడు మొత్తం చెప్పుకుంటూ ఉంటారు. తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే చిత్రవిచిత్రమైన కలలు వారికి వస్తుంటాయి. చావు చివరి రోజుల్లో ప్రతి వ్యక్తి తనను చూడడానికి వచ్చిన వారికి గుడ్ బై చెబుతూ ఉంటాడు. మీరందరూ బాగుండండి అని సూచనలు ఇస్తారు. త్వరలో నేను ఎలాగో చనిపోతాను అని మనస్సులో అనుకుంటూ ఉంటారు. అందరికీ జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ చావు చివరి రోజుల్లో వ్యక్తుల్లో ఎక్కువగా కనపడుతుంటాయి. ఏమంటారు? 

మరిన్ని

Comments

0 Comments

వైరల్

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()