ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదితర అనేక దేశాలలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. జగ్గీ వాసుదేవ్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. సద్గురు జగ్జీ వాసుదేవ్ అనేక చోట్ల ప్రసంగాలు చేశారు. మానవాళికి అందించిన ఆయన బోధనలు ఆణిముత్యాలు..... వాటిలో కొన్నింటిని ఇప్పుడు ఆలకిద్దాం...
ఆశలు పెంచుకోండి, వాటిని నెరవేర్చుకునేందుకు కృషి చేయండి. అల్పత్వాన్ని పెంచుకుని, ఆశలు చంపుకుంటే జీవితంలో మీరు దేన్నీ సాధించలేరు.
కోరికలకు హద్దు ఉంటే సంతోషంగా జీవిస్తారు. ఆశ ఉండాలి... కానీ అది అత్యాశగా మారకూడదు.
మీ పిల్లలకు కోపం, అహంకారం లేని ఆనందమయ జీవితాన్ని ఇవ్వండి. అభిమానం, జాగ్రత్త వహించడం నేర్పించండి.
మీ జీవితాన్ని మీరే అందంగా తీర్చిదిద్దుకోవాలి. మీ తప్పులను ఎదుటివారు ఎత్తిచూపితే సంతోషంగా స్వీకరించండి.
మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకోండి. దేవుడి చేతికి ఇవ్వకండి. అన్నీ దేవుడే చేయాలని ఆశించడం మంచిది కాదు. మనవంతు ప్రయత్నం మనం చేయాలి. గాలిలో దీపం పెట్టి ‘దేవుడా రక్షించు..!’ అంటే వీలుకాదు కదా!
మీ ప్రవర్తన, మీ నిర్ణయాలపై ఆధారపడి జయాపజయాలు ఉంటాయి. ఎవరో సాయం చేయాలని ఎదురు చూస్తూ కూర్చోకూడదు.
ఎదుటివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయవద్దు. కించపరిచే విధంగా మాట్లాడవద్దు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం సంస్కారం అవుతుంది.
ఎదుటివారు మీ ఇష్టప్రకారం ఉండకపోయినా, మీ జీవితం మీ ఇష్టప్రకారమే ఉంటుంది.
ఎదుటివారి జీవితంతో మీ జీవితాన్ని పోల్చుకోవద్దు. వివేచనతో వ్యూహరచన చేస్తే విజయం సాధ్యమవుతుంది. ఏ పనైనా గొప్పగా ఆలోచించి చేయాలి.
మనిషి అన్నాక ఒక్కోసారి, ఒక్కోచోట, ఒక్కో విధంగా నడచుకోవాల్సి ఉంటుంది. మీలోని మంచితనాన్ని, అభిమానాన్ని మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఏ పరిస్థితిలోనూ కోపం, ఈర్ష్య చూపించకండి. అప్పుడు ఎవరికీ భాధ కలగదు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుతారు.
ఎలాంటి పరిస్థితిలోనైనా మీపై మీకు పూర్తి నమ్మకం కలిగి ఉండండి. మీ సాయశక్తులా పనిచేయండి. అప్పుడే ఉన్నత స్థానానికి చేరుకోగలుతారు. మీ ఎదుగుదలను అప్పుడు ఎవరూ ఆపలేరు.
యవ్వనంగా ఉండాలంటే బలమైన శరీరంతో పాటు దృఢమైన మనస్సు కలిగి ఉండాలి. ఎలాంటి స్థితినైనా ధైర్యంగా ఎదుర్కొండి. యోగ సాధనతో ధైర్యం వస్తుంది.
భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవిస్తే జీవితం సవ్యంగా, సంతోషంగా ఉంటుంది. పట్టింపులకు పోకుండా, సర్దుకుపోతూ ఉండాలి.
ఏ పనైనా సగం సగం చేయవద్దు. మీ అభివృద్ధి, సమాజ సంక్షేమం దృష్టిలో ఉంచుకుని పూర్తి చేయండి. ఆటలో ప్రవేశించకుండానే ముగింపు కావాలని ఆశపడవద్దు.
అసూయకు, భయానికి చోటివ్వకండి. ఎదుటివారిలో చెడు చూడవద్దు. మీ మనస్సును, శరీరాన్ని పూర్తిగా ఉపయోగిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది.
మీ కోరికలను తీర్చాలంటూ వేడుకున్న తర్వాత దైవంపై నమ్మకం ఉంచండి. దైవంపై అనుమానాలు వద్దు.
మీ మనస్సును ఎవ్వరూ చలింపచేయలేని స్థిరనిశ్చయ చిత్తులై ఉండండి. అప్పుడే కోరుకున్నదాన్ని సాధించగలుగుతారు.
సంతోషంగా ఉండే మనుషులు మాత్రమే ఏ పనైనా హాయిగా, చక్కగా చేయగలుగుతారు. చిత్తశుద్ధితో పనిచేస్తేనే వృత్తిలో ఎదిగేందుకు వీలుంటుంది.
బతికి ఉండటం వేరు. జీవించడం వేరు. ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం పరిపూర్ణంగా జీవించినా చాలు. గులాబీ ఒక రోజు జీవించినా అందరూ దానినే ఇష్టపడతారు. అలాంటి జీవితాన్ని కోరుకుంటే ప్రతిక్షణం ఆనందంగా గడపవచ్చు.
కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితులు, బంధువుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉండాలి. ఇవే ప్రతి ఒక్కరికి శాశ్వతమైనవి. ముఖ్యమైనవి. ఆస్తులు, అంతస్తులు, హోదాలు శాశ్వతం కాదు.
ఎదుటివారిని గౌరవంగా, అభిమానంతో చూడటం కన్నా గొప్పతనం ఏమీ ఉండదు. నాది.. అన్న పదం విడనాడి, మనది.. అన్న పదం పలికితే జీవితం పరిపూర్ణమవుతుంది.
శాస్త్రాలు జీవితాలకు దారి చూపడానికి ఏర్పడ్డాయి. జీవితాన్ని శాస్త్రాలకు అర్పించడం సముచితం కాదు. మీరు పవిత్రంగా, ప్రశాంతంగా ఉండటం ముందు అలవరచుకోవాలి.
అన్నీ కోల్పోయిన వాళ్లకు చేయూత ఇవ్వండి. మానవత్వం నుండి దైవత్వానికి ఎదగడానికి అది ఒక అవకాశంగా భావించండి.
ప్రేమించడం తెలివైన విషయమని మీరు గుర్తించగలిగితే అంతకన్నా మేలైనది ఏదీ ఉండదు.
భగవంతుడి పట్ల భక్తి ఉంటే చాలు. భయం అక్కర్లేదు.
తెలివిగా బతకడం తెలిస్తే, దైవ సహాయం లేకుండా కూడా మీరు సుఖంగా బతకవచ్చు. బతుకు అంటే అర్థం చేసుకోకుండా, మూర్ఖంగా జీవిస్తే, పూజాగదిలో ఎన్ని దేవుళ్ల ఫొటోలు పెట్టుకున్నా లాభం లేదు.
ప్రపంచాన్ని ఏలాలని కోరిక ఉండటం తప్పు కాదు. అందుకోసం శక్తివంచన లేకుండా పనిచేయాలి.
ఆనందంగా జీవించడం మీ చేతుల్లోనే ఉంది. ఆనందం పోగొట్టుకోవడానికి మన ప్రవర్తనే కారణం అవుతుంది.
మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే చురుకుగా ఉండగలుగుతారు. యోగ, ధ్యానం వల్లనే ఇది సాధ్యమవుతుంది.
మతగ్రంథాలు చదివినంత మాత్రాన జ్ఞానులు కాలేరు. వాటిలోని మంచిని అమలు చేయడమే జ్ఞానులు చేయాల్సింది.
ఓడిపోతే కుంగిపోవద్దు. ధైర్యంగా మళ్లీ ప్రయత్నించండి.
తప్పు చేస్తే నిజాయితీగా అంగీకరించి, తప్పును సరిదిద్దుకోండి. వాదించడం మూర్ఖత్వం అవుతుంది.
గెలుపుకోసం అడ్డదారులు తొక్కవద్దు.
మానసిక వత్తిడికి లొంగకుండా పనిచేస్తే ఆనందం మీ వెంటే ఉంటుంది.
స్త్రీ, పురుషుల్లో ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ కాదు. ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటే సజావుగా జీవితం సాగుతుంది.
అత్యున్నత స్థాయికి చేరాలంటే మెట్లెక్కే వెళ్లాలి. తొలుత కష్టమైనా విజయం సాధించిన తర్వాత సంతృప్తి మిగులుతుంది.
ప్రపంచంలోని సొమ్మంతా మీ భోషాణంలో నింపినా కూడా, మీ భోషాణంలోకి రాని సొమ్ముంటుంది. ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల్లోని విషయాలన్నీ మీ బుర్రలో నింపినా, మీ బుర్రలో లేని విషయాలు రోజూ తోస్తూనే ఉంటాయి.
ఆ భావన మీకు ఉందా? కానీ మీకు కొన్నిసార్లు కోపం, విసుగు, అయిష్టం, ఏమారడం ఇవన్నీ ఉన్నాయి కదా..? అవేకదా దొరికిన బహుమానం. ఇవి విషం లక్షణమా..? అమృత లక్షణమా?
ఈ భూమ్మీద అమృతం అనుకునేవన్నిటి వెనకా తిరిగే చాలామంది జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ రాజ్యం, రాజ్యాంగం, సైన్యం అన్నిటినీ వద్దని వెళ్లిన బుద్ధుడు ఖాళీతనంలోనే జ్ఞానాన్ని పొందాడు. ఆ జ్ఞానం లోనేకదా అతనికి పూర్తి ఆనందం లభించింది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
జీవితానికి కొత్త అర్థాన్నిచ్చే ఐన్స్టీన్ ఐడియాలజీ దేవుడు ఉన్నాడా? అతీంద్రియశక్తుల సంగతేంటి? ఆలోచనా విధానం ఎలా ఉండాలి? మానవుని సనాతన ఆలోచనా విధానాన్ని పునాదులతో...
0 Comments