ఆమె అసలు పేరు మేరీ మాగ్దలిన్ డీట్రిచ్. 1901 డిసెంబర్ 27 న ఆమె జన్మించింది.. జర్మన్-అమెరికన్ సినీ నటి, గాయని గా దశాబ్దాలపాటూ లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందింది.. 1910 నుంచి 1980 ల వరకూ సాగిన ఆమె సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పటికప్పుడు తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..
1920 ల కాలం లో మార్లిన్, బెర్లిన్ లో రంగస్థలం తో పాటూ పలు మూకీ చిత్రాల్లో నటించింది. 1930 లో విడుదలైన "ద బ్లూ ఏంజెల్" లో లోలా-లోలా పాత్రలో ఆమె నటనకు అంతర్జాతీయ ప్రాచుర్యం లభించడం తో పాటూ "పారామౌంట్ పిక్చర్స్" తో కొన్ని సినిమాలకు ఒప్పందం చేసుకునే అవకాశం కొట్టేసింది. మొరాక్, షాంఘై ఎక్స్‌ప్రెస్, డిజైర్ వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తన ఆకర్షణీయమైన రూపాన్ని, నటనను వినియోగించుకుని ఆ సమయం లో అతిఎక్కువ సంపాదన కలిగిన నటిగా ఎదిగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినన్నాళ్ళూ అమెరికా వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన తారగా ఆమె అత్యున్నత స్థానంలో మన్ననలను పొందుతూ వచ్చింది. సినిమాల్లో నటిస్తూనే 1950 ల నుంచి 1970 ల వరకూ డీట్రిచ్ తన ఖాళీ సమయాల్లో ప్రపంచం అంతా తిరుగుతూ లైవ్-షోల్లో ప్రదర్శనలు చేయడంలో గడిపేసింది.
యుద్ధ సమయంలో జర్మన్, ఫ్రెంచ్ ప్రవాసులకు ఇళ్ళు నిర్మించడం, ఆర్థిక సహకారాన్ని అందించడం తో పాటూ వారికి అమెరికన్ పౌరసత్వం ఇవ్వాలని ప్రచారం చేయడం వంటి పనులతో డీట్రిచ్ మానవతావాదిగా కూడా పేరొందింది. యుద్ధసమయంలో సైనికులు, ప్రజలు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుండి ఆమె చేసిన కృషికి అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, ఇజ్రాయెల్ దేశాల్లో ఎక్కడలేని గౌరవాన్ని దక్కించుకుంది. 1999 లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్.. "క్లాసిక్ హాలీవుడ్" సినిమాలకు చెందిన అత్యంత గొప్ప నటీమనుల జాబితాలో ఆమెకు 9 వ స్థానం కల్పించింది.
డీట్రిచ్ 1901 డిసెంబరు 27న ప్రస్తుతం బెర్లిన్‌లోని లాబెర్ అనే ప్రాంతంలో జన్మిచింది. ఆమె తల్లి విల్‌హెల్మినా సంపన్న బెర్లిన్ కుటుంబానికి చెందినది.. ఆమెకు జువెలరీ దుకాణం, గడియారాలు తయారుచేసే సంస్థలు ఉండేవి. ఆమె తండ్రి లూయీస్ ఎరిక్ ఒక పోలీసు లెఫ్టినెంట్. డీట్రిచ్ కు తన కన్నా ఏడాది పెద్ద అయిన "ఎలిజబెత్" అనే సోదరి ఉండేది. డీట్రిచ్ తండ్రి 1907 లో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అతని ప్రాణమిత్రుడు వాన్ లోస్క్ "విల్‌హెల్మినా" ను పెళ్ళిచేసుకున్నాడు. కానీ కొద్దికాలానికే మొదటి ప్రపంచ యుద్ధం సమయం లో అతడూ మరణించాడు. వాన్ లోస్క్ ఎప్పుడూ అధికారికంగా విల్‌హెల్మినా కుమార్తెలను దత్తత తీసుకోలేదు..
11 ఏళ్ళ వయసులో ఆమె మేరీ మాగ్డలీన్ అన్న రెండు పేర్లు కలిపేసి "మార్లిన్" గా మార్చుకుంది. డీట్రిచ్ 1918 లో విక్టోరియా-లూయిస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఆమె వయొలిన్, కవిత్వం, రంగస్థల కళల పట్ల ఆసక్తి కలిగి వుండేది. వయొలినిస్టుగా కచేరీలు చేయాలన్న ఆమె ఆశలకు మణికట్టు గాయం అడ్డంకిగా మారింది. అయినా 1922 లో ఈమె తొలి ఉద్యోగం బెర్లిన్ సినిమా రంగంలోని ఒక "మూకీ", అంటే "మాటలు లేని" చిత్రానికి వయొలిన్ వాయించడమే. అయితే కేవలం నాలుగు వారాల్లోనే ఆ ఉద్యోగం పోగొట్టుకుంది.
1923 నాటి "ద లిటిల్ నెపోలియన్" సినిమాలో చిరుపాత్రతో సినిమా రంగంలో అడుగుపెట్టింది.
తర్వాతి కాలంలో తాను వివాహమాడిన "రూడాల్ఫ్ సీబెర్" ను 1923 లో "ట్రాజెడీ ఆఫ్ లవ్" సినిమా సెట్‌లో కలిసింది. 1923 లో డీట్రిచ్, సీబెర్ ను పెళ్ళి చేసుకుంది..
పెళ్ళి తర్వాత 1920 దశకమంతా డీట్రిచ్ రంగస్థలంపైనా, సినిమాల్లోనూ బెర్లిన్, వియన్నా నగరాల్లో పనిచేసింది. రంగస్థలంపై విలియం షేక్‌స్పియర్ రాసిన "ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ" నాటకంలో నటించింది.. సినిమాల్లో "కెఫె ఎలెక్ట్రిక్, ఐ కిస్ యువర్ హ్యాండ్, మేడమ్ వంటి జర్మన్ చిత్రాలు చేసి మెప్పించింది.
ద బ్లూ ఏంజెల్ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పింది..
షాంఘై ఎక్స్‌ప్రెస్ లో డీట్రెచ్ సౌందర్యానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు..
1930లో ద బ్లూ ఏంజెల్ అంతర్జాతీయంగా విజయం సాధించడం తో, ఈ సినిమాను అమెరికా కు చెందిన "పారామౌంట్ పిక్చర్" వారు అమెరికాలో విడుదల చేశారు.
1930 నుంచి 1935 వరకూ పారామౌంట్ స్టూడియో నిర్మాణంలో వాన్ దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో డీట్రెచ్ నటించింది. వాన్ ప్రోత్సాహం తో ఆమె మరింత అందంగా కనిపించడమే గాక శిక్షణలో మరిన్ని మెలకువలు నేర్చుకుంది.
"మొరాకో" సినిమా లో డీట్రెచ్ "కేబరే సింగర్" పాత్రలో నటించింది. సినిమాలో ఓ రెండు విషయాలు మాత్రం జనానికి చాలాకాలం పాటు గుర్తుండిపోయాయి: ఒక పాటలో ఓ మగవాడి తెల్ల టై కట్టుకుని డ్యాన్స్ చేయడం, మరో స్త్రీని ముద్దుపెట్టుకోవడం. ఆకాలానికి ఈ రెండూ ప్రేక్షకులను రెచ్చగొట్టే సన్నివేశాలుగా ప్రసిద్ది చెందాయి.. ఈ సినిమాతో డీట్రిచ్ ఆస్కార్ నామినేషన్ కు సెలెక్ట్ అయ్యింది.
ఆ తర్వాత డీట్రిచ్ షాంఘై ఎక్స్‌ప్రెస్ లో నటించి అత్యధిక వసూళ్ళు సాధించడంతో పాటూ అతిపెద్ద కమర్షియల్ విజయం సాధించింది.
"వాన్" లైటింగ్, ఫోటోగ్రఫీని బాగా ఉపయోగించుకుని, డీట్రిచ్‌ని మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపించేవాడు. విభిన్న షేడ్స్ తో ఒక స్వంత మేకింగ్ ని సృష్టించుకున్నాడు. సినిమా చరిత్రలోనే దృశ్యపరంగా అత్యంత స్టైలిష్ సినిమాలు చిత్రీకరించాడు.
ఆ తర్వాత ఆమె కొన్ని రొమాంటిక్ కామెడీలు చేసింది. డీట్రిచ్‌కు ఆ సమయం లో మితిమీరిన ఆఫర్లు వచ్చాయి.. ద గార్డెన్ ఆఫ్ అల్లా సినిమా నిర్మాత వద్ద ఆ సినిమాకు గాను రెండు లక్షల డాలర్లు తీసుకుంది. నైట్ వితవుట్ ఆర్మర్ సినిమాకి 4 లక్షల 50 వేల డాలర్ల రెమ్యునరేషన్ తీసుకుంది. ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద యావెరేజ్ టాక్ తెచ్చుకోవడం తో ఆమెకు డిమ్యాండ్ తగ్గింది.
ఈమె లండన్‌లో ఉండగా నాజీ పార్టీ అధికారులు డీట్రిచ్‌ని కలిసి జర్మనీ తిరిగి రావాలని ఆఫర్ చేశారు.. కానీ ఆమె నిరాకరించి అమెరికాలోనే స్థిరపడేందుకు ప్రయత్నించింది.. కానీ ఆ తరువాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.. ఇక కొన్నేళ్ళపాటూ గాయనిగా పని చేసిన ఆమె చివరకు ఫ్రాన్స్ లో 1992 న తన 90 ఏళ్ళ వయసులో మరణించింది..
ఇదీ మార్లిన్ డీట్రిచ్ లైఫ్ స్టోరీ..
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments