డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్ని కోణాల్లో ఈ షో చూపరులను అమితంగా ఆకట్టుకుంది.. ఈ సిరీస్ తాజాగా ఎమ్మీ అవార్డ్ ని గెలుచుకోవడం తో దేశమంతటా ఈ సిరీస్ పై మరింత ఆశక్తి కలిగింది.. ఇంతకీ ఏంటా స్టోరీ, దీని వెనుకున్న అసలు కధ ఏంటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
2012 లో కొందరు రాక్షసులు కదులుతున్న బస్సులో ఇద్దరు స్నేహితులను చితకబాది, ఆడపిల్లను దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన సంఘటణ ప్రపంచ వ్యాప్తంగా అగ్గి రగిల్చింది.. ప్రపంచం ముందు ఈ సంఘటణ భారత దేశ గొప్పదనాన్ని దిగజార్చింది.. అయితే ఆ సంఘటణలో ఆ బాలిక తల్లిదండ్రులకు అనేక ఏళ్ళపాటూ న్యాయం దొరకలేదు.. అయితే ఢిల్లీ క్రైం షో లో అలా కాకుండా సంఘటణ జరిగిన క్షణం నుండి పోలీసులు, ఇన్వెస్టిగేషన్ టీం ఎంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని శిక్షించారనే కధనం అత్యంత ఆశక్తిగా తెరకెక్కించారు దర్శకులు.
ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది ప్రసారమయింది. 7 భాగాలుగా విభజించి దర్శకులు ఈ కధను రూపొందించారు.. దీనికి పెరిగిన ఆదరణ ద్రుష్టిలో పెట్టుకుని రెండవ సిరీస్ ని స్టార్ట్ చెయ్యాలని టీం సన్నాహాలు చేస్తోంది..
రిచీ మెహతా దర్శకత్వం లో భాగంగా పోలీసులు నిందితులను పట్టుకునే క్రమం లో ఎంత ఓపికగా, తెలివిగా కాపు కాచి పట్టుకుంటారు అనే అంశాలను ఊపిరి సలపని ఉత్కంఠ కలిగించేలా జాగ్రత్త పడ్డాడు..
ముఖ్య పాత్రలో షెఫాలి షా అనే లేడీ యాక్టర్ తో పాటూ తన టీం లోని అనేక ఆఫీసర్లు ఈ క్రైం ఇన్వెస్టిగేషన్ ని చేదిస్తారు..
దేశ వ్యాప్తంగా అత్యాచారాలు రోజుకి 90 జరుగుతుండగా ఎవరికీ చీమ కుట్టినట్టైనా ఉండకపోవడం సిగ్గుపడాల్సిన విషయం.. ఈ భరత మాత ఒడిలో పుట్టిన పాపానికి మన చుట్టూ తిరుగుతున్న ఆడ పిల్ల ఇలా అఘాయిత్యానికి గురికావాల్సిందేనా? మనం ఏమీ చేయలేమా? దేశ భక్తి అనగానే అంతెత్తున ఎగిరిపడే యువత, దేశ నాయకత్వం, ఇలా ఆడపిల్లలు అన్యాయానికి గురవుతుంటే మాత్రం పట్టనట్టు ఉండడం అత్యాచారాన్ని ప్రోత్సహించినట్టు కాదా? మనం ఆలోచించాలి..
సో, ఏది ఏమైనా నెట్ ఫ్లిక్స్ అందుబాటులో ఉంటేగనక వెంటనే ఈ వెబ్ సిరీస్ చూసేయండి..
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
నందమూరి నటసింహం బాలక్రిష్ణ, తెలంగాణా పోరాట యోధుడు "గోన గన్నా రెడ్డి" పాత్రలో ఒక మూవీ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. దాన వీర సూర కర్ణ సినిమా లో అభిమన్యు పాత్ర వేసినా, అక్బర్ సలీం అనార్కలి లో...
0 Comments