తాజాగా విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ కలిసి వాళ్ళిద్దరి ప్రేమ సినిమా తో రాబోతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వి.ఎన్.ఆదిత్య అందించారు. అయితే ఈ చిత్రాన్ని వేద క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్ నిర్మించనున్నారు.
సినిమా విషయాని కొస్తే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అంతా ముగిసి పోయింది. ఈ చిత్రానికి లత్కోరు లవ్విన్తే పాటతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాటలు లిరికల్ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.
ఆయన ఈ పాటను విడుదల చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా సిద్ధం అయిపోయాయి.
అయితే ఈ చిత్రానికి నిర్మాత అయిన అర్జున్ గారు ఎంతో అభిరుచి తో ఈ సినిమాని నిర్మించారట. అయితే ఈ చిత్రానికి మొత్తం ఐదు కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమాని నిర్మించడం జరిగింది.
అయితే అందరూ కొత్త ఆర్టిస్ట్స్ అయినా ఇంత బడ్జెట్ పెట్టడం విశేషం. రామ్ గోపాల్ వర్మ చేతుల మీదగా ఈ పాట విడుదల కావడం సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.
అర్జున్ రూపొందించిన చిత్రం నిజంగా ట్రెండ్ కి తగ్గ చిత్రం అంటూ చెప్పారు. మధు శ్రవంతి ఈ సినిమాకి సంగీతం అందించారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments