కరోనా మనందరినీ గట్టిగా కొట్టింది. ప్రస్తుత పరిస్థితులకు కారణం కరోనా వైరస్ అని విజయ్ దేవరకొండ అన్నాడు. అయితే ఈ కరోనా పేరు విని విని చిరాకు వచ్చింది. కానీ మన అందరిని గట్టిగా కొట్టింది నన్ను కూడా అని అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ పరిస్థితుల్లో తాను మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేను అని అతను అన్నాడు. ఒక పక్క చూస్తే బ్యాంక్ ఖాతాలో డబ్బులు లేవు మరో పక్క కుటుంబంతో పాటు సంస్థల్లో పనిచేస్తున్న 35 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. ఆ బాధ్యత నాపై ఉంది అని ఆయన అన్నారు.
డబ్బు లేకపోవడం కొత్త కాదు కానీ 35 మందికి జీతాలు ఇవ్వడం నాకు బాగా కొత్త. ఆర్థికంగా నేను సిద్ధంగా లేను అని బాధ పడుతున్నాడు విజయ్. ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ అయితే ఏది ఏమైనా సరే తాను మళ్లీ రెండు మంచి పనులకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు ఆర్ధిక సాయం తో పాటు లాక్ డౌన్ ముగించిన తర్వాత లక్ష మందికి ఉపాధి కల్పించాలని వాళ్లకి ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం అని ఆయన అన్నారు.
తర్వాత సామాన్యులకు ఉద్యోగ సమస్య ప్రారంభమవుతుంది, అందుకని తన ఫౌండేషన్ తరపున తన టీంతో కలిసి ఉద్యోగాలకు సంబంధించి కొన్ని వ్యూహాలుతో సాగుతున్నాం అని చెప్పాడు విజయ్ దేవరకొండ.
ఇప్పటికి 50 మందిని హైదరాబాద్ పిలిచి వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చారట. ఈ విషయం చెప్పొద్దని అనుకున్న విజయ్ ఉద్యోగాలు పోతాయని చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో తాను భరోసా ఇవ్వడం కోసం ఈ విషయాన్ని చెబుతున్నానని విజయ్ దేవరకొండ అన్నాడు. అయితే ఆ ఫండ్స్ కోసం రూ.ఇరవై లక్షలు ఇస్తున్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు. అందుకోసం తన స్నేహితులు వద్ద అప్పు చేసాడట. సినిమా షూటింగ్స్ ప్రారంభం అయ్యాక తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాడట.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments