ప్రముఖ యాంకర్ మరియు సినీ నటి అనసూయ భరద్వాజ్ కు ట్విట్టర్ లో చేదు అనుభవం ఎదురు అయ్యింది. అనసూయ మరియు సినీ నటి అనుష్క పైన Actress masala అనే ఓకే ట్విట్టర్ పేజ్ లో ఇరువురుపై వల్గర్ ట్వీట్స్ చేసారు. దీనితో అ పోస్ట్ వివాదానికి తెర తీసింది. చివరికి ఈ ట్వీట్స్ పై స్పందించిన అనసూయ అగ్రహం వ్యక్తం చేస్తూ సదురు పేజ్ పై చర్యలు తీసుకోవాలని ట్వీటర్ టీంకు ఫిర్యాదు చేసింది.
అనసూయకు షాక్ :
సదురు పేజీ పై తక్షణమే చర్యలు తీసుకుపోవాలి అని అ పేజ్ పై ట్విట్టర్ టీంకు అనసూయ ఫిర్యాదు చేసారు. అసలు కథ అప్పుడే స్టార్ట్ అయ్యింది.ఈ ఫిర్యాదు పై స్పందించిన ట్విట్టర్ అనసూయకు అనుకోని షాక్ ఇచ్చారు. ట్విట్టర్ టీం అ ట్వీట్ మా కమ్యూనిటీ గైడ్లైన్స్ పరిధిలోనే ఉంది అని తేల్చేసారు.ట్విట్టర్ మరో ముందు అడుగువేసి ఇందులో ఎం తప్పు వుంది అని పేజ్ ని సమర్ధించింది. దీనితో కంగుతున్నఅనసూయ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో సదురు పేజ్ చేసిన కామెంట్స్ మరియు ట్విట్టర్ రిప్లై ఇచ్చిన మెయిల్ ను స్క్రీన్ షాట్ తీసి సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించారు.
కోపంతో ఊగిపోయిన అనసూయ :
ఈ సమయంలో అనసూయ మాట్లాడుతూ " డియర్ ట్విటర్ సపోర్ట్.. దయచేసి మీ రూల్స్లో కొన్ని మార్పులు చేసుకోండి. ఇది ట్విటర్ వైలేషన్ కాకపోతే మరేంటి? దీనిని సైబర్ క్రైంగా పరిగణించకపోతే మీదే తప్పు అని చెప్పడానికి కూడా నేను వెనుకాడను. దయచేసి ఈ ట్వీట్స్పై చర్యలు తీసుకోవడానికి సరైన అధికారులను ట్యాగ్ చేయాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులను కోరుకుంటున్నాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నా ఇమేజ్స్ ని మార్ఫ్ చేస్తున్నారు :
కొద్ది రోజులు క్రితం తన వ్యక్తిగత ఫొటోస్ ను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి " ఇటువంటి ఫొటోస్ ఎక్కడైనా కనిపిస్తే తనకి తెలియజేయాలి " అని అభిమానులకు తెలిపారు .
అసలు ఎం జరిగింది అంటే :
Actress masala మసాలా అనే పేజ్ టాలీవుడ్ మరియు బాలీవుడ్ యాక్టర్స్ పైన గత కొద్దీ రోజులుగా అనుచిత వ్యాఖ్యాలు పోస్ట్ చేస్తున్నారు. మార్చ్ 2019లో స్టార్ట్ చేసిన ఈ పేజ్ మార్ఫింగ్ ఇమేజ్స్ తో పటు అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments