తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది నాడు సరికొత్త ట్రెండ్ సృష్టించడానికి మన ముందుకు వచ్చింది ఆహా యాప్ .ఈ యాప్ ని భారీగా విడుదల చేయాలనీ పెద్ద ప్రణాళికనే వేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఇది కుదరలేదు .ఈ యాప్ ని ఇప్పటికే సుమారు పది లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం విశేషం.ఈ యాప్ తెలుగు సినిమాలకి ,వెబ్ సిరీస్ కి అడ్డా గా మారింది .అల్లు అర్జున్ కూతురు అర్హ పేరు మీద అల్లూ వారి కుటుంబం ఈ యాప్ ని తీసుకొచ్చారు.
అల్లు అరవింద్, రాము రావు జూపల్లి కలిసి ఈ ఆప్ ను నిర్మించారు.నిజంగా ఈ ఆప్ తెలుగులో నయా ట్రెండ్ ని సృష్టిస్తోంది. హిందీ,మరాఠీ,తమిళ్ బాషలలో ఇటువంటి యాప్ లు ముందే వచ్చాయి .అయితే తెలుగులో ఈ తరహా యాప్ ని లాంచ్ చేయడం ఇదే మొదటిసారి .ఈ యాప్ ని యువ తరానికి తగ్గట్టు రూపొందించడం తో బాగా ప్రసిద్ధి చెందింది.ఈ యాప్ లో తెలుగు వెబ్ సిరీస్ అరుదైన స్థానం దక్కించుకున్నాయి.సిన్, లాక్డ్ అనే రెండు వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకున్నాయి.
సిన్ అనే వెబ్ సిరీస్ కొత్తగా పెళ్ళైన జంట మధ్య కథ సాగుతుంది.ఈ వెబ్ సిరీస్ కి నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు.శరత్ మారార్ నిర్మాత.బోల్డు కంటెంట్ తో డొమెస్టిక్ వయలెన్స్ కి వ్యతిరేఖంగా ఈ కధని చూపించి మంచి సమాచారాన్ని అందించాడు.అలానే లాక్డ్ వెబ్ సిరీస్ మొత్తం థిల్లర్ లో సాగుతుంది. ఈ సిరీస్ ని కృష్ణ కులశేఖరన్ రూపొందించాడు.
సత్యదేవ్ కంచరానా ముఖ్య పాత్రలో నటించాడు. ఇలా అనేక విధాలుగా ఈ యాప్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఓటీటీ విభాగంలో తెలుగులో వచ్చిన తోలి యాప్ మన ఆహానే. చక్కగా సినిమాలని, వెబ్ సిరీస్ ని కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments