ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్ మాత్రమే. రంగు రంగుల ఈ చిత్ర పరిశ్రమ గురించి, బయట ప్రపంచానికి తక్కువ విషయాలు మాత్రమే తెలుసు. గ్లామర్ మాటున దాగి వున్న, బాలీవుడ్ గురించి నమ్మలేని 10 నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం ..
మీకు తెలుసా ? సల్మాన్ ఖాన్ పూర్వికులు భారదేశానికి చెందిన వారు కాదు. వారు 1800 వ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ కు వలస వచ్చారు. పూర్వం వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోని అలకోజాయ్, పఠాన్ తెగతో కలిసి జీవనం కొనసాగించే వారు.
ఇప్పటి వరకు బాలీవుడ్ తెరపై రివర్స్ రోల్స్ లో నటించిన ఏకైక తండ్రి-కొడుకులు అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ మాత్రమే. వీరిద్దరూ కలిసి “పా” అనే చిత్రంలో నటించారు.
బాలీవుడ్ లో ఏటా 1 బిలియన్ సినిమా టిక్కెట్స్ అమ్ముడవుతున్నాయి . ఇది ప్రపంచంలోనే అత్యధికం. కానీ సగటు టికెట్ ధర చాలా తక్కువుగా ఉంటుంది. అందుకే హాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్ కు తక్కువ ఆదాయం చేకూరుతుంది.
బాలీవుడ్ సినీ చరిత్రలో “లగాన్ “ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆస్కార్ రేస్ లో చివరి వరకు పోరాడిన మొట్ట మొదటి చిత్రం “లగాన్ “. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనాలో విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రం “లగాన్ “ .దీనిని బీజింగ్ లోని షాంఘైలో డబ్ చేసి ప్రదర్శించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో బ్రిటిష్ నటులు నటించిన ఏకైక సినిమాగా రికార్డు లోకి ఎక్కింది.
అమీర్ ఖాన్ స్క్రిప్ట్ సెలక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు నటించే సినిమాలో ప్రాణం పెట్టి యాక్టింగ్ చేస్తారు. అందుకే వారిని “మిస్టర్ పెర్ఫెక్ష నిస్ట్” అని అంటారు. బాలీవుడ్ లో వరసగా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు బెంచ్ మార్కు ను అందుకున్న మొట్టమొదటి హీరో అమీర్ ఖాన్ మాత్రమే. బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు కొల్లగొట్టిన మొదటి చిత్రం ఘజిని. ఈ చిత్రంతో అమీర్ ఖాన్ తన మార్కెట్ ను అమాంతం పెంచుకున్నాడు.
బాలీవుడ్ లో 'మోస్ట్ ట్విస్టెడ్ లవ్ స్టోరీ” గురించి చెప్పాలంటే అది ఖచ్చితంగా “బోనీ, శ్రీదేవి కపూర్” ప్రేమ వివాహం. బోనీకపూర్ తన మొదటి భార్య మోనా కారణంగా, శ్రీదేవి, బోనీకపూర్ కు పరిచయం అయ్యింది. శ్రీదేవి, బోనీకపూర్ ప్రేమలో పడతారు అని మోనా ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే ? శ్రీదేవి అప్పటికే బోనికపూర్ కు రాఖీ కట్టడంతో పాటు అన్నయ్య అని కూడా పిలిచేది.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి కారు నడపడం అంటే చాల భయం. ఆమె ఎక్కడికి వెళ్లిన తన వెంట డ్రైవర్ ను తీసుకువెళ్తుంది.
అమితాబ్ బచ్చన్ తన రెండు చేతులతో వ్రాయగలడు. కూలీ చలనచిత్ర ప్రమాదం తరువాత అతను ఈ రైటింగ్ స్కిల్ ను నేర్చికున్నాడు.
బాలీవుడ్ ఖిలాడీ స్థార్ “అక్షయ్ కుమార్” కు దైవ భక్తి అధికం. అక్షయ్ కుమార్ పేపర్ మీద ఏదైన రాయడానికి ముందు, ఓం రాసి తరువాత సారాంశాన్ని రాయడం మొదలుపెడతారు.
హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన "జురాసిక్ పార్క్" మూవీ ఇండియాలో భారీ వసూళ్ళను రాబట్టింది.ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ? ఈ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ కోసం స్పీల్బర్గ్ మొదట శ్రీదేవి ని సంప్రదించారు. కానీ శ్రీదేవికి స్టోరీ నచ్చక పోవడంతో ఆమె ఈ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments