సినిమా..ఈ పదానికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రస్తుతం సినిమా అన్నది మన జీవితంలో ఒక భాగం. మనం ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు చూస్తూవుంటాం, అందులో కొన్నిసినిమాలు చిరునవ్వులని పూయిస్తే, మరికొన్ని కంట తడి పేట్టిస్తాయి. కేవలం సినిమా అంటే ఇది మాత్రమే కాదు... సినిమా మనిషిని కదిలించగలుగుతుంది. నిజ జీవితంలో గెలవడం అన్నది మన అందరి అంతిమ లక్ష్యం, ప్రతి సారి సక్సెస్ మనతో రాదు, అప్పుడప్పుడు ఓటమిని కూడా చవి చూస్తాం, అది మనకి కష్టాలను, కన్నీళ్లను మిగుల్చుతుంది. మనం జీవితం ఇంతేనా అని మనకే విరక్తి పుడుతుంది. ఎటు చూసినా చిమ్మ చీకటి, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఒక మంచి ఫ్రెండో లేక ఒక గురువో ఉంటే బాగుండు అని పిస్తుంది. నిజానికి ఒక మంచి సినిమా కంటే గొప్ప స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు చెప్పండి. అప్పుడప్పుడు వచ్చే ఆణిముత్యాలు వంటి ఈ సినిమాలు, మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. నువ్వు అంటే ఏమిటో, నీకే పరిచయం చేస్తాయి. అటువంటి అల్ టైం టాప్ 6 ఇన్స్పిరేషనల్ మూవీస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
నెంబర్ సిక్స్ : క్యాచ్ మీ ఈఫ్ యుకెన్. (ఈ సినిమా భాద నుండి ఎలా బయట పడాలో నేర్పిస్తుంది)
ఈ సినిమాను హాలీవుడ్ టాప్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ తీశారు. స్పీల్బర్గ్ ఎక్సట్రీమ్ క్రియేషన్స్ అయిన జురాసిక్ పార్క్, టైటానిక్, అవతార్ మూవీస్ తో కంపేర్ చేస్తే “క్యాచ్ మీ ఈఫ్ యు కెన్’ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో అద్భుతమైన గ్రాఫిక్స్ ఉండవు , కానీ imdbలో 8.1 రేటింగ్ తో టాప్ పొజిషన్ లో ఉంది. ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో మరియు టామ్ హాంక్స్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసారు. ఇక మూవీ కధకు వస్తే : ఫ్రాంక్ అనే ఒక 16 ఏళ్ళ కుర్రాడు, తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నివాసం ఉంటాడు. ఫ్రాంక్స్ స్కూల్ ఏజ్ నుండే బ్రిలియంట్ స్టూడెంట్. కానీ ఇంతలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోతుంది, దీనితో ఫ్రాంక్ పేరెంట్స్ మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి, చివరికి వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన అంత ఖర్చు అయ్యిపోతుంది. దీనితో ఫ్రాంక్ పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటారు. ఈ విషయం ఫ్రాంక్ కు నచ్చదు. ఇంట్లో తినడానికి తిండి కూడా లేదు, మరో వైపు ప్రతి రోజు తలిదండ్రుల గొడవలు. వీటిని తట్టుకొలేని ఫ్రాంక్ ఇంటి నుండి పారిపోతాడు. ఫ్రాంక్ ఒక విషయాన్ని గట్టిగా నమ్మాడు, జీవించటానికి డబ్బు అనేది చాలా ముఖ్యం. అందుకే ఎలా అయినా డబ్బు సంపాదించాలి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఫ్రాంక్ దగ్గర ఉన్నది కేవలం 25 డాలర్లు మాత్రమే. ఆ 25 డాలర్లుతో దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇలా రెండు సంవత్సరాలలో దాదాపు 42 లక్షల అమెరికన్ డాలర్లులను కొల్లగొడతాడు. పట్టు మని 18 ఏళ్ళు కూడా నిండని ఫ్రాంక్ 26 దేశాల క్రైమ్ రికార్డ్స్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉంటాడు. అటువంటి ఒక మోసగాడు మరీ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఎలా ఎదుగుతాడు అన్నది ఈ సినిమా అసలు కధ. ప్రపంచంలో అనేక మంది నేరాలు చేయడానికి వారి ఆర్ధిక పరిస్థితులే ముఖ్య కారణం. మనం తప్పు చేసిన ప్రతిసారి, మంచిగా మారడానికి కాలం నీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. ఓటమి, డబ్బు ఎప్పటికి శాశ్వతం కాదు అని ఈ సినిమా నిరూపిస్తుంది. క్రైమ్/డ్రామాగా తెరకెక్కిన “క్యాచ్ మీ ఈఫ్ యు కెన్” మూవీ, థ్రిల్లర్ లవర్స్ కు కిక్ ఇవ్వడం పక్కా. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాను “ఫ్రాంక్ విలియం అబాగ్నలే” వ్యక్తి యొక్క రియల్ స్టోరీ నుండి ప్రేరణ చెంది ఈ సినిమాను తీసారు. ఈ సినిమా ఒక్కసారి చూస్తే చాలు డబ్బు అనే పదానికి మీనింగ్ ఎమిటో తెలుస్తుంది.
నెంబర్ ఫైవ్ : అమెరికన్ బ్యూటీ : (ఈ సినిమా సమాజమంలో కూరుకుపోయిన అహం గురించి వివరిస్తుంది.)
ఇప్పటి వరకు మేము చూసిన మూవీస్ అన్నింటిలో “అమెరికన్ బ్యూటీ” సంథింగ్ స్పెషల్. ఈ మూవీలో ఇంటెర్నల్ గా రన్ అయ్యే హ్యూమన్ ఎమోషన్స్ అండ్ రిలేషన్ షిప్స్ మూవీ లవర్స్ ను కట్టిపడేస్తాయి. ప్రెజెంట్ సొసైటీ లో చాలా మంది మెకానికల్ లైఫ్ ను గడుపుతున్నారు. మార్నింగ్ ఆఫీస్ కు వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చి నిద్రపోవడం ఇదే ఒక లైఫ్ గా మారిపోయింది. అమెరికన్ బ్యూటీ కధ కూడా ఇలానే ఉంటుంది. మన హీరో లెస్టర్ కు తన వైఫ్ అంటే ఇష్టం ఉండదు, ఇక లెస్టర్ వైఫ్ అయినా జాన్ కు డబ్బు అంటే పిచ్చి. వాళ్ళ పాపకు పక్కింటి అబ్బాయి అంటే ఇష్టం. ఈ కధ మన అందరి ఇంటిలోనూ కనిపిస్తుంది. ఈ టైంలో 50 ఏళ్ల లెస్టర్, ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒక 50 ఏళ్ల ముసలివాడు 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమించడం విచిత్రంగా ఉన్నా అదే నిజం. చివరికి తప్పు తెలుసుకొని లెస్టర్ మంచివాడిగా మారిపోతాడు. కానీ క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ తో కంప్లీట్ అవుతుంది. సమాజంలో అందరూ బయటకు మంచిగా నటిస్తూ, లోలోపల కోపంతో రగిలిపోతారు,ఈ సినిమాలోని జాన్ వలే. వాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళకంటే, తామే మంచి వాళ్ళం అని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఒక తప్పు చేసిన వ్యక్తి, మంచివాడిగా మారీ సోసిటీలోకి వస్తే ఈ ప్రపంచం దానిని యాక్సెప్ట్ చేయదు. సమాజంలో లోతుగా కూరుకుపోయిన అహమే అసలైన శత్రువు. ఇందులోని లెస్టర్ క్యారెక్టర్ నిన్ను మోటివేట్ చేస్తుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో అమెరికన్ బ్యూటీ మొత్తం 5 ఆస్కార్ అవార్డ్స్ ను గెలుపొందింది.
నెంబర్ ఫోర్ : ది థియరీ అఫ్ ఎవిరీథింగ్ (ఈ సినిమా పట్టుదల, శ్రమ అంటే ఏమిటో తెలియజేస్తుంది).
21 వ శతాబ్దం మేధావుల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. వారు జీవితం ఆధారంగా తెరకెక్కన మూవీ “ది థియరీ అఫ్ ఎవిరీథింగ్”. డైరెక్టర్ జామ్స్ మార్ష్ దర్శకత్వం వహించిన, ఈ మూవీ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. కధ విషయానికి వస్తే : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో స్టీఫెన్ హాకింగ్ అనే ఆస్ట్రో ఫిజిక్స్ స్టూడెంట్ ఉంటాడు. ఫిజిక్స్ అండ్ మాథమాటిక్స్ లో యూనివర్సిటీ టాపర్. పాతికేళ్ళు నిండకముందే బ్లాక్ హోల్స్ థియరిని ప్రతిపాదించిన ఏకైక వ్యక్తి. అటువంటి మేధావికి “మోటార్ న్యూరాన్” అనే వ్యాధిసోకుతుంది. ఈ వ్యాధి వలన స్టీఫెన్ హాకింగ్ శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయకుండాపోతాయి. కేవలం తన ఆలోచనలతోనే అద్భుత ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్త. అతడి శరీరం సహకరించపోయినా అలుపెరగని పోరాటం, పట్టుదల ఆయనను గొప్ప శాస్త్రవేత్త గా మార్చాయి. చాలా మంది చిన్న చిన్న కష్టాలకే భయపడి, ప్రయత్నించడం మానేస్తారు. ది థియరీ అఫ్ ఎవిరీథింగ్ మూవీ పట్టుదల, ఆత్మస్థైర్యం అంటే ఏమిటో తెలిసేలా చేస్తుంది. జీవితంలో ఏదైన సాధిద్దాం అనుకునే వారికీ ఈ సినిమా ఉపయోగపడుతుంది. 2015 లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో ఈ మూవీకి బెస్ట్ యాక్టింగ్ కేటగిరిలో అవార్డు వచ్చింది.
నెంబర్ త్రి : ఆ నలుగురు (జీవితం అంటే ఏమిటో, నేర్పించే సినిమా)
2004 వ సంవత్సరంలో రాజేంద్రప్రదేశ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తూ విడుదలైన మూవీ ఆ నలుగురు. మన అందరి జీవితాల్లో సినిమా భాగం, మరీ సినిమానే ఒక జీవితం అయితే అది “ఆ నలుగురు” చిత్రంలా ఉంటుంది. చంద్ర సిద్దార్థ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెలుగు అల్ టైం కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఇక కధ విషయానికి వస్తే రఘురామ్ కు సమాజం అంటే చాలా ఇష్టం. కుటుంబాన్నిఎంతలా ప్రేమిస్తారో, సమాజానికి కూడా అదేవిధంగా ప్రేమిస్తాడు. కానీ అనుకోని పరిస్థిలో రఘురామ్ చనిపోవడంతో, తన కుటుంబం డబ్బు కోసం దిగజారుతుంది. మనుషుల్లో పేరుకు పోయిన హిపోక్రసి గురించి, ఇందులో బలమైన సన్నివేశాలుఉన్నాయి. చివరికి రఘురామ్ ఆశించిన విధంగా సమాజం డబ్బుకంటే, మనుషి బంధానికి ఎక్కువ విలువనిస్తుందా ? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. జీవితం మీద విరక్తి ఉన్నవారికి ఈ సినిమా మంచి రిలీఫ్ ను ఇస్తుంది. ప్రపంచం అంటే డబ్బు కాదు, మనుషులు అనే నిజాన్ని బలంగా చెప్పిన సినిమా “ ఆ నలుగురు”.
నెంబర్ టూ : ఇన్ సైడ్ అవుట్ (బాధ కూడా జీవితంలో ఒక భాగం అని, చూపించే సినిమా)
ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సినిమాలన్నీ లైవ్ అండ్ ఫిక్షన్ కేటగిరీలోకి చెందినవి. కానీ ఇన్ సైడ్ అవుట్ కంప్లీట్ యానిమేటెడ్ మూవీ. బొమ్మల సినిమానా అని సింపుల్ గా తీసేయకండి, imdb లో ఇన్ సైడ్ అవుట్ మూవీకి 8.1 రేటింగ్ తో టాప్ పొజిషన్ లో ఉంది. అది మాత్రమే కాదు 2016లో ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ మూవీగా ఇన్ సైడ్ అవుట్ విన్ అయ్యింది. మనం ఎప్పుడూ సంతోషాన్ని కావాలను కోరుకుంటాం. ఒక్కసారి బాధవచ్చిన తట్టుకోలేం. ఇన్ సైడ్ అవుట్ మూవీలో భాద అయినా సంతోషం అయినా, అన్ని జీవితంలో ఒక భాగం అని నిరూపించే చిత్రం. న్యూస్6జి హై రికమెండేడ్ మూవీస్ లో ఇన్ సైడ్ అవుట్ మొదటి స్థానంలో ఉంటుంది.
నెంబర్ వన్ : షావ్‌శాంక్ రెడెంప్షన్ ( భవిష్యత్తు మీద ఆశావాద దృక్పధంతో జీవించమని చెప్పే సినిమా)
1994 వ సంవత్సరంలో విడుదలైన షావ్‌శాంక్ రెడెంప్షన్ మూవీ వరల్డ్ ఫిల్మీ హిస్టరీలో కల్ట్ క్లాసిక్ గా మారిపోయింది. imdb లో 9.2 రేటింగ్ తో అల్ టైం బెస్ట్ మూవీగా చరిత్రలో నిలిచింది. నిరాశ, నిస్పృహలు ఎక్కువ కాలం బలంగా ఉండవని తెలియజెప్పిన సినిమా. సినిమాలో ఆండీ డుఫ్రెస్నే అనే వ్యక్తి ఏ తప్పు చేయకపోయినా జైలు శిక్ష అనుభవిస్తాడు. తనకు ఎప్పటికీ బెయిల్ రాదు అని తెలసినా భవిష్యత్తు మీద ఆశావాద దృక్పధంతో ఉంటాడు. ఆ జైల్ నుండి ఆండీ విడుదల అయ్యాడా లేదా అనేది అసలైన కధ. జైల్ లో వుండే క్రూరమైన మనుషులు, వారి మనస్తత్వం గురించి అద్భుతంగా తేలియచెప్పిన సినిమా “షావ్‌శాంక్ రెడెంప్షన్”. మేము ఖచ్చితంగా చెప్పగలం ఈ సినిమా చూసి వచ్చిన తరువాత మీ జీవితం మారుతుంది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments