టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 10 హీరోలు

img

2014 వ సంవత్సరం వరకు టాలీవుడ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే  పరిమితమయ్యింది. కానీ తరువాత విడుదలైన బాహుబలి, బాహుబలి - టూ వంటి  చిత్రాలు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయి. దీనితో టాలీవుడ్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు అమెరికా, చైనా వంటి దేశాలలో బలమైన మార్కెట్ ను చేజిక్కించుకుంది. 

టాలీవుడ్ మార్కెట్ విస్తరిస్తూ ఉండటంతో దర్శక - నిర్మాతలు సినిమా బడ్జెట్ ను భారీగా పెంచేశారు. వీటితో పాటు కధానాయకుల మార్కెట్ బలపడటంతో, మన హీరోస్ పారితోషికం భారీగా పెంచేశారు. 

నెంబర్ టెన్:

అత్యధిక రెమ్యూనరెషన్ తీసుకొనే నటులలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ  ముందు వరుసలో ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రశ్రేణి తారలలో నాగార్జున ఒకరు. దశాబ్ద కాలం నుండి తాను టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. గీతాంజలి, కింగ్, శివ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వసూళ్ళ, సునామీని సృష్టించాయి. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న మూవీగా నిలిచిపోయింది. ఇటీవల విడుదలైన సినిమాలు విజయం సాధించనప్పటికీ నాగార్జున సినిమాలు చూడటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. తాజాగా విడుదలైన ఆఫీసర్ మరియు దేవదాస్ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టినప్పటికీ, పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో నాగార్జున ఒకరిగా కొనసాగుతున్నారు. “సోగ్గాడే చిన్నినాయనా” తరువాత నాగార్జున రెమ్యూనరెషన్ ను భారీగా పెంచారు. 2020 వ సంవత్సరానికి గాను నాగార్జున 8.5 కోట్ల రూపాయిల  రెమ్యూనరెషన్ ను తీసుకుంటున్నారు. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరెషన్ తీసుకునే నటులలో నాగార్జున పదోవ స్థానంలో ఉన్నారు.   

నెంబర్ నైన్:

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ ఫామిలీ నుండి తెరంగేట్రం చేసిన మొట్ట మొదటి హీరో విక్టరీ వెంకటేష్. 80 వ దశకం చివరిలో కలియుగ పాండవులు మూవీతో కెరీర్ ప్రారంభించిన వెంకటేష్ అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరో గా ఎదిగారు. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలకు వెంకటేష్  కేరాఫ్ అడ్రస్. ఆయనకు ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సంక్రాంతి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు ఆయనలోని హాస్య నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేసింది. తాజగా విడుదలైన “ఎఫ్-2” మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటి వరకు “ఎఫ్-2” మూవీ   70 కోట్లుగా పైగా వసూళ్ళను సాధించింది. ఈ మూవీ తరువాత వెంకటేష్ తన రెమ్యూనరెషన్ ను పెంచారు. ప్రస్తుతం వెంకటేష్ రెమ్యూనరెషన్ 9 కోట్ల రూపాయిలు. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరెషన్ తీసుకునే నటులలో వెంకటేష్ తొమ్మిదవ స్థానంలో  ఉన్నారు.

నెంబర్ ఎయిట్:

నందమూరి నటసింహం బాలకృష్ణ యొక్క  అభిమాన తారాగణం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో బాలకృష్ణ అభిమానులు సంఖ్య అసాధారణమైనది. ఎన్‌టి రామారావు తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, తనదైన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సింహ, లెజెండ్, నరసింహ నాయుడు సినిమాలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. తాజాగా విడుదలైన ఎన్.టి.ఆర్ బయోపిక్, జై సింహం, రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద  బోర్లా పడ్డాయి. అయినా కోట్ల మంది ఫోలోవర్స్ కలిగిన బాలకృష్ణ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు ఎదుచూస్తేనే ఉంటారు. ప్రొడ్యూసర్లు కూడా బాలయ్యకు అడిగినంత రెమ్యూనరెషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య  రెమ్యూనరెషన్ 10 కోట్ల రూపాయిలుగా ఉంది. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరెషన్ తీసుకునే నటులలో బాలకృష్ణ, ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

నెంబర్ సెవెన్:

అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో ఇప్పుడు అతడు ఒక సంచలనం. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు అత్యధిక వసూళ్లను రాబట్టాయి. అయితే తాజాగా  విడుదలైన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయినప్పటికీ “విజయ్ దేవరకొండ” క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీజగన్నాధ్ కలయికలో “ఫైటర్” అనే మూవీ చేస్తున్నారు.  విజయ్ ఈ మూవీకి 11 కోట్ల రూపాయిలు  రెమ్యూనరెషన్ తీసుకున్నారు అని  తెలుస్తుంది. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరెషన్ తీసుకునే నటులలో  విజయ్ దేవరకొండ, ఏడవ స్థానంలో ఉన్నారు.

నెంబర్ సిక్స్ :

దక్షిణాది చిత్ర పరిశ్రమలో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన ఏకైక హీరో అల్లు అర్జున్. 2004 లో తెరంగేట్రం చేసిన  అల్లు అర్జున్ ఆర్య మూవీతో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. రేసుగుర్రం, అల వైకుంఠపురంలో చిత్రాలు భారీ వసూళ్లను నమోదు  చేశాయి. “అల వైకుంఠపురంలో” సినిమా హిట్ తో బన్నీ తన రెమ్యూనరెషన్ ను భారీగా పెంచారు. ప్రస్తతం బన్నీ పారితోషికం 15 కోట్ల రూపాయిలు. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో అల్లు అర్జున్, ఆరవ స్థానంలో ఉన్నారు

నెంబర్ ఫైవ్:

మెగా స్టార్ చిరంజీవి వారసుడుగా, టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన రామ్ చరణ్, అతి తక్కువ  సమయంలోనే బాక్స్ ఆఫీస్ రేస్ లోకి అడుగుపెట్టారు. కెరీర్ మొదటిలోనే “మగధీర” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రసుతం రామ్ చరణ్ ఖాతాలో మగధీర, ధృవ, రంగస్థలం వంటి సూపర్ హిట్ మూవీస్  ఉన్నాయి. తాజాగా విడుదలైన “వినయ విధేయ రామ” ప్లాప్ అయినప్పటికీ రామ్ చరణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ట్రిపులర్ మూవీలో నటిస్తున్నాడు. ఈచిత్రానికి గాను 18 కోట్ల రూపాయిలు రెమ్యూనరెషన్ తీసుకున్నారు. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో రామ్ చరణ్, ఐదవ స్థానంలో ఉన్నారు. 

నెంబర్ ఫోర్:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరుకే ప్రత్యేకమైన రికార్డులు  సొంతం. ఎన్.టి.రామారావు మనవడుగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎన్టీఆర్, ఆది సినిమాతో రికార్డుల మోత మోగించాడు.  టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ , అరవింద సమేత వంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. గతంతో పోల్చితే, ప్రస్తుతం తారక్ రెమ్యూనరెషన్ భారీగా పెరిగింది.  ఎన్టీఆర్ ట్రిపులర్ మూవీ కోసం దాదాపు 20 కోట్ల రూపాయిలు రెమ్యూనరెషన్ తీసుకున్నారు. ఎన్టీఆర్ వార్షిక ఆదాయం రూ .400 కోట్ల రూపాయలుగా ఉంది. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో ఎన్టీఆర్ , నాల్గువ స్థానంలో ఉన్నారు

నెంబర్ త్రీ: 

అభిమానులకు అతడొక దైవం.  టాలీవుడ్ అగ్రతారలలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటారు. కోట్ల మంది అభిమానులు వారి సొంత. పవన్ కళ్యాణ్ కెరీర్ ను చూసుకుంటే జల్సా, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాలు అనేకం ఉన్నాయి. 2013లో విడుదలైన అత్తారింటికి దారేది టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. దాదాపు 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అజ్ఞాత వాసి ప్లాప్ అయినప్పటికీ, పవన్ మానియా మాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ “వకీల్ సాబ్” చిత్రంతో మరికొద్ది  రోజులలో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో నటించాడానికి గాను పవన్ రెమ్యూనరెషన్ క్రింద, 23 కోట్ల రూపాయిలను తీసుకున్నారు. తెలుగు పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో పవన్ కళ్యాణ్ ,మూడవ స్థానంలో ఉన్నారు.

నెంబర్ టూ: 

టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు పొందిన మహేష్ బాబు,  రెమ్యూనరెషన్ లో కూడా టాప్ పొజిషన్ లోఉన్నారు. పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు మహేష్ ఖాతాలో ఉన్నాయి. తాగాజా విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించడానికి గాను 26 కోట్ల రూపాయిలను రెమ్యూనరెషన్ గా తీసుకున్నారు. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్స్ లో  మహేష్ బాబు,రెండవ స్థానంలో ఉన్నారు.

నెంబర్ వన్:

 బాహుబలి, బాహుబలి 2, సాహో వంటి సినిమాలతో రికార్డులు సృష్టించిన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ప్రభాస్ అంతర్జాతీయ కధానాయకుడు.  బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ రెమ్యూనరెషన్ 10 కోట్ల వరుకు ఉండేది. ప్రస్తుతం ప్రభాస్  రెమ్యూనరెషన్ 30 కోట్ల వరుకు ఉంటుంది అని తెలుస్తుంది. తెలుగు పరిశ్రమలో అత్యధిక  రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో ప్రభాస్, మొదటి  స్థానంలో ఉన్నారు.

మరిన్ని

Comments

0 Comments

సినిమా

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()