టాలీవుడ్ చరిత్రలో టాప్ 10 ఆశ్చర్యకరమైన విషయాలు!
ప్రస్తుతం టాలీవుడ్ అంటే ఒక ప్రాంతీయ పరిశ్రమ మాత్రమే కాదు...బాహుబలి, సైరా వంటి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ఏకైక పరిశ్రమ. టాలీవుడ్ స్థాయి ఇప్పటిది కాదు..90వ దశకం నుండే, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ప్రపంచాన్ని ఆకర్షించింది.
- భారతదేశ చలన చిత్రరంగంలో మణిరత్నం మరియు రాంగోపాల్ వర్మకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ వీరిద్దరి మధ్య గత దశబ్ద కాలంగా భేదాభిప్రాయాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. కానీ మీలో ఎంత మందికి తెలుసు ? మణిరత్నం మరియు రాంగోపాల్ వర్మ కలిసి పనిచేసారు అని. 1993 లో విడుదలైన గాయం సినిమా కథను, మణిరత్నం మరియు రాంగోపాల్ వర్మ కలిసి రాశారు. అదే సంవత్సరం విడుదలైన “దొంగ దొంగ” సినిమాకు మణిరత్నం దర్శకత్వం చేయగా రాంగోపాల్ వర్మ కథను రాశారు. 1998 లో విడుదలైన దిల్ సే మూవీ బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా మిగిలింది. ఈ సినిమాను మణిరత్నం దర్శకత్వం చేయగా రాంగోపాల్ వర్మ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
- టాలీవుడ్ క్వీన్ శృతి హాసన్, తెలుగు సుప్రసిద్ధ నటి సుహాసిని, నిజజీవితంలో అక్కచెల్లేల్లు.శృతి హాసన్ కమల్ హాసన్ తండ్రి శ్రీనివాసన్ కు చెందగా, సుహాసిని శ్రీనివాసన్ అన్నయ్య చారుహాసన్ యొక్క కుమార్తె.
- సూపర్ స్టార్ రజినికాంత్ తెలుగులో నటించిన మొట్ట మొదటి సినిమా “చిలకమ్మ చెప్పింది”. ఈ సినిమా 1993 ఆగష్టు 13న విడుదలైంది.
- వాస్తవానికి టాలీవుడ్ అనేది బెంగాల్ సినీ పరిశ్రమ, ఇది బెంగాల్ లోని టోలీగుంజే అనే ప్రాంతం నుండి ఏర్పడింది.తరువాత కాలంలో తెలుగు సినిమా ప్రభావంతో టాలీవుడ్ అనే పదం తెలుగు పరిశ్రమకు పర్యాయ పదంగా మారి పోయింది.
- భారతదేశంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్నఏకైక పరిశ్రమ టాలీవుడ్ మాత్రమే. 2006లో బాలీవుడ్ 243 చిత్రాలను విడుదల చేయగా, టాలీవుడ్ 220 కి పైగా సినిమాలను విడుదల చేసింది.
- తెలుగులో మనీషా కొయిరాలా ప్రత్యక్షంగా నటించిన ఏకైక చిత్రం “క్రిమినల్ మాత్రమే”.
- 1979లో విడుదలైన “శంకరాభరణం” సినిమా, ఆల్ టైం తెలుగు క్లాసిక్ గా నిలిచిపోయింది. మీకు తెలుసా ? మూవీ పైన నమ్మకం లేకపోవడంతో ఈ సినిమాను మొదట ఒకే థియేటర్ లో విడుదల చేసారు. మూవీ మార్నింగ్ షో ను కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే చూసారు. ఆ సమయానికి థియేటర్ మొత్తం ఖాళీ. కానీ సినిమా విడుదల అయిన 3 రోజులు తరువాత అదే థియేటర్ లో కూర్చోడానికి స్థలం కూడా లేనంతగా, ప్రేక్షకులతో నిండిపోయింది.
- మాయ బజార్ చిత్రంలోని టెక్నికల్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా మాయ బజార్ లోని "లాహిరి, లాహిరి లాహిరిలో" పాట అద్భుతంగా ఉంటుంది. మీకు తెలుసా ? ఈ పాటలో కనిపించే చంద్రకాంతి మరియు చంద్రడుని కృత్రిమంగా సృష్టించారు. ఆంగ్లో-ఇండియన్ సినిమాటోగ్రాఫర్ అయినా మార్కస్ బార్ట్లీ ఈ మ్యాజిక్ ను చేసి చూపించారు. ఇండియాలో కృతిమ చంద్రకాంతిని సృష్టించిన ఏకైక చిత్రం “మాయ బజార్” మాత్రమే.
- రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్. ఇది గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకుంది.
- 1987 లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదర్శనకు ఆహ్వానించబడిన ఏకైక దక్షిణ భారతీయ నటుడు చిరంజీవి మాత్రమే. 90వ దశకంలోనే చిరు సినిమాలు యుఎస్ మరియు యుకె వంటి దేశాలలో రికార్డుల మోత మోగించాయి.
మరిన్ని
0 Comments