టాలీవుడ్ నటులు - లాక్ డౌన్ స్పెషల్స్
కరోనా కారణంగా సెలబ్రెటీలు సైతం కొత్త కొత్త ఛాలెంజ్లను స్వీకరిస్తున్నారు. ప్రతి రోజు సోషల్ మీడియాలో వర్క్ అవుట్ ,పిల్లో ఛాలెంజ్,బి ద రియల్ మెన్ వంటివి వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది కుక్కింగ్ ఛాలెంజ్.
రెండు రోజుల ముందు మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ చెఫ్ లా పెసరట్టు చేశారు, బి ద రియల్ మెన్ ఛాలెంజ్ లో భాగంగా విజయ్ దేవరకొండ మ్యాంగో ఐస్ చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కి టి.సుబ్బిరామిరెడ్డి కుమార్తె కుకింగ్ ఛాలెంజ్ ఇచ్చారు. దాన్ని స్వీకరించి మనవరాలి తో కలిసి స్పెషల్ మసాలా వడలు చేశారు.
ఇక అక్కినేని వారి కోడలు సమంత పుట్టినరోజు సందర్భంగా నాగ చైతన్య తానే స్వయంగా కేక్
తయారు చేశారు. కేక్ ముందు కూర్చుని దేవుడు కి దండం పెడుతున్న ఫొటో పోస్ట్ చేశారు. "నేను ఏం ప్రార్థిస్తున్నానో ఊహించండి,నేను ఎటువంటి క్లూ ఇవ్వడం లేదు" అని ఆమె పేర్కొన్నారు. ఇంతకీ సమంత ఏం ప్రార్థించారో?
అయితే ఇలా ఈ కరోనా లాక్ డౌన్ వల్ల సెలబ్రెటీస్ అంత కూడా ఇళ్లకే పరిమితం అయ్యి సోషల్ మీడియా లో పోస్ట్లు పెడుతున్నారు. మరి ఇంకేం ఉంది అభిమానులు కూడా మురిసిపోతున్నారు ఈ ఛాలెంజులని చూస్తూ. ఇలా నటులు అంతా కూడా ఎదో ఒక రకంగా ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సీనియర్ నటుల సైతం ఈ ఛాలెంజుల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.
మరిన్ని
0 Comments