మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే చిరంజీవి తన కెరీర్ లో అనేక బిగ్ హిట్లు కూడా దక్కించుకున్నాడు. అలానే మంచి డాన్స్ తో గొప్ప యాక్టింగ్ తో తెర మీద కనిపిస్తూ ఫాన్స్ని ఫిదా చేస్తాడు. ఈ హీరో నూట యాభైకి పైగా సినిమాలలో నటించాడు అంటే అది మామూలు విషయం కాదు. అలానే చిరంజీవి అగ్ర తారగా నిలిచి నేటి తరం హీరోలకి ఆదర్శమయ్యాడు.
నలభై ఏళ్ళకి పైగా అనుభవం ఉన్న తార చెయ్యలేకపోయాడు. కానీ తనయుడు, తమ్ముడు మాత్రం ఇందులో చిరుని బీట్ చేసారు అనే చెప్పవచ్చు. బాలీవుడ్ లో అగ్ర హీరో అయిన అమితాబ్ సినిమాలు చాల విశేషంగా ఉంటాయి. అమితాబ్ యాక్టింగ్, ప్రెసెంటేషన్ ఎందరికో ఆదర్శమే. అయితే ఎప్పుడూ ఏదో ఒక సినిమా రీమేక్ జరుగుతూనే ఉంటాయి.
తెలుగు లోకి అనేక బాలీవుడ్ సినిమాలు ఇప్పటికే ఎన్నో రీమేక్ అయ్యాయి. అయితే అమితాబ్ సినిమాలని మాత్రం చిరు ఎప్పుడు రీమేక్ చెయ్యలేదు.కానీ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అలానే తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్ పాత్రలు తమ సినిమాలో చేసారు.
రామ్ చరణ్ అమితాబ్ హిందీ జంజీర్ సినిమాని అదే సినిమా పేరుతో తెలుగులో చేసాడు. ఇప్పుడు రాబోతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా అమితాబ్ ముఖ్య పాత్రలో నటించిన పింకీ సినిమానే. ఇలా చిరంజీవి చేయలేనిది పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ చేసి చూపించారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments