ఈరోజు తారక్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా టాలీవుడ్ లో అనేక సినిమాలు చేసి పాప్యులర్ అయ్యాడు. ఎంతో మంది అభిమానుల తో చక్కటి సినిమాలతో దూసుకెళ్లి పోయే నటుడు నందమూరి తారక రామారావు.
మొదట జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనేక సినిమాల్లో నటించాడు. నిన్ను చూడాలని చిత్రం తో తొలి సారిగా హీరోగా పరిచయమయ్యాడు.
ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, యమదొంగ ఇలా అనేక సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే బిగ్ బాస్ లో మాత్రం అందరిని అలరించాడు జూనియర్. ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ షో విజయవంతం కావడం అవ్వడం తో జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతో మంది ప్రముఖులు అభినందించారు.
అయితే ఆ షోలో పాల్గొన్న హౌస్ మేట్స్ ఆదర్శ్, బాలకృష్ణ, అర్చన, హరితేజ, శివబాలాజీ, ధనరాజ్, ప్రిన్స్, కత్తి మహేష్, సంపూర్ణేష్ బాబు, మధుప్రియ, కత్తి కార్తీక్, జ్యోతి ప్రత్యేకంగా తారక్ కి విషెస్ చెప్పారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments