తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలకు ప్రజలలో మంచి ఆదరణ ఉంది . ప్రత్యేకంగా యువతలో అయితే వారు దర్శకత్వం వహించిన చిత్రాలు ఎప్పటికి మర్చిపోలేనివి. అటు మెగాస్టార్ వారస్వతం పంచుకున్న రాంచరణ్ తేజ్ కు బీ,సీ సెంటర్లలో స్టార్ డం గురించి చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఈ ఇద్దరి కలయిక లో మూవీ కోసం ఫాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. రాంచరణ్ స్టామినా, గౌతమ్ రైటింగ్ ఇవి అన్నీకలిపి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వస్తుంది అని వారి ఆరాటం.
కొన్ని సంవత్సరాల క్రితం చెర్రీ, గౌతమ్ మూవీ స్టార్ట్ అయ్యింది. అది కూడా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. కానీ మధ్యలో నాని రాకతో అన్నీ మారిపోయాయి. అసలు ఏం అయ్యిందో ఎవరికీ అర్ధం కాలేదు. తరువాత ఒక ప్రకటన అయితే మొత్తం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇంతకీ అ వార్త ఏంటి అంటే? గౌతమ్ మీనన్ మూవీని రాంచరణ్ రిజెక్ట్ చేసారు. అప్పట్లో ఈ వార్త ఒక సంచలనం.
ఈ న్యూస్ ఇలా కొనసాగుతుండగానే నాని అడుగు పెట్టాడు. ఇంతకీ ఆ మూవీ ఏంటి అనే కదా మీ సందేహం?
2011లో గౌతమ్ మీనన్ - ఇళయరాజా కలయికలో వచ్చిన “ఎటో వెళ్లిపోయింది మనుసు " సినీ ప్రేక్షకుల మనుసుని దోచుకుంది. ప్రత్యేకంగా ఇళయరాజా మ్యూజిక్ అయితే మూవీకే హైలైట్. నాని - సమంత చేసిన మ్యాజిక్ ఎప్పటికీ మర్చిపోలేం. రొమాన్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రొడ్యూసర్ కి కాసుల పంట పండించింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, అ మూవీని ఫస్ట్ రామ్ చరణ్ చేయాల్సి ఉంది. గౌతమ్, రామ్ చరణ్ న్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసారు .... కానీ చివరికి సినిమా నాని వద్దకు చేరింది.
అప్పట్లో ఏం జరిగింది అంటే ?
2011 గౌతమ్ మీనన్ రామ్ చరణ్ తో " ఎటో వెళ్లిపోయింది మనుసు" మూవీని తీయటానికి ప్రయత్నించారు. చెర్రీ మొదటి నుండి ఒకే రకమైన కథలు చేస్తున్నారు, అనే విమర్శలు రావడంతో మెగా స్టార్ సలహా మేరుకు మంచి ప్రేమ కథ చిత్రాన్ని చేయాలని నిర్ణయించికున్నాడు. ఆ సమయంలో గౌతమ్ మీనన్ వచ్చి కథ చెప్పటం, అది చెర్రీకి నచ్చటం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇంకా మరికోద్ది రోజుల్లో మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది అనగా రామ్ చరణ్ మూవీ నుండి డ్రాప్ అయ్యాడు. అప్పటికే ఆరంజ్ మూవీ ప్లాప్ అవ్వడంతో పాటు తన మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. దీనితో మరోసారి ప్రయోగం చేయటానికి చరణ్ వెనకడుగు వేసాడు. ఆటోమేటిక్ గా మూవీకి బ్రేక్స్ పడ్డాయి . మరో కధా నాయకుడు కోసం ఎదురు చూస్తున్న సమయంలో తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న నానికి గౌతమ్ మీనన్ ఈ కథని చెప్పడం, వెంటనే ఒప్పుకోవడం, షూటింగ్ జరగడం జరిగింది.
చెర్రీ ఈ మూవీ రిజెక్ట్ చేయటానికి మరో కారణం కూడా ఉంది. చరణ్ అప్పటికే రచ్చ మూవీ చేస్తున్నాడు. దీనితో గౌతమ్ మీనన్ మూవీకి డేట్స్ ని సర్దుబాటు చేయలేక మూవీ చేజారిపోయింది అని సమాచారం.
నిజానికి నాని వెంటనే ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రధాన కారణం, ఇళయరాజా అంటే నానికి ఉన్న ప్రత్యేకమైన అభిమానమే.
మూవీలో నాని నటనకు విమర్శకులు నుండి మంచి ప్రశంసలు అందాయి. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఒక మంచి మూవీ చేజారి పోయింది అని బాధపడ్డారు అన్నది నిజం. మరోసారి వీరి ఇద్దరి కలయికలో మూవీ కోసం అటు ప్రేక్షకులు, ఇటు సినీ జనం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆ కల ఎప్పటికీ నిజం అవుతుందో చూడాలి మరి.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments