పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ స్టన్నింగ్ అప్డేట్

img

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్…ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలిసిన అవసరం లేదు. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో రజినీకాంత తరువాత ఆ స్థాయిలో అభిమాన తారాగణం సొంతం చేసుకున్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. 2018లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చిన అజ్ఞాతవాసి సాధారణ ప్రేక్షుకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా తీవ్ర నిరాశ పరిచిన విషయం తెలిసందే. అదే సమయంలో పవన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయడంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే  కోట్లమంది అభిమానుల కలను తీర్చడానికి పవన్ కళ్యాణ్ “పింక్” మూవీ రీమేక్ తో తెరమీదకు రాబోతున్నారు అన్న న్యూస్ పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా విడుదలైన ‘పింక్’ తెలుగు రీమేక్ ఫస్ట్ లుక్ మరియు  టైటిల్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. మూవీ టీం ఈ  చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే పేరును నిర్ణయించారు.

తాజాగా సినీవర్గాల్లో వినిపిస్తున్న ఒక న్యూస్ కాక రేపుతుంది. ఈ న్యూస్ కేవలం టాలీవూడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు మెగా అభిమానులను కూడా ఊరిస్తుంది. ఇంతకీ  ఏమిటి ఆ న్యూస్ ? టాలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకు ఆ న్యూస్ ను బయటకు రానివ్వడం లేదు ? 

పవన్  కళ్యాణ్ మరియు వేణు శ్రీరామ్  కలయికలు “ వకీల్ సాబ్ “ మూవీ తెరకెక్కుతుంది.  ఈ మూవీ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ కు మూవీకి ఆఫిసిఅల్ రీమేక్. అయితే మూవీ టీం 

“వకీల్ సాబ్” మూవీలో భారీ మార్పులు చేసినట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. 

పవన్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. పవన్ రీమేక్ సినిమాలు అయిన తీన్ మార్ మరియు గోపాల గోపాల చిత్రాలకు  త్రివిక్రమ్ మాటలు అందించడంతో పాటు, అడిషనల్ స్క్రీన్ ప్లే కూడా రాశారు. అందులోను పవన్ సినిమాలకు త్రివిక్రమ్ ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. 

ఈ క్రమంలో పవన్ మరోసారి త్రివిక్రమ్ హెల్ప్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు పింక్ రీమేక్ అనేది కం బ్యాక్ మూవీ వంటిది. ఈ సమయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి పవన్ ఇష్టపడం లేదు. అందుకే “వకీల్ సాబ్” కథను  త్రివిక్రమ్ కు అందించినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ ఈ మూవీలో భారీ మార్పులు చేస్తునట్టు తెలుస్తుంది. 

పింక్ మూవీ క్లైమాక్స్ లో భావోద్వేగ సన్నివేశాలు మనస్సును కట్టిపడేస్తాయి. అందుకే త్రివిక్రమ్, వకీల్ సాబ్  క్లైమాక్స్ కోసం భారీ డైలాగ్స్ రాశారు. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు.  పవన్ కు ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. వీరిఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్ లో రచ్చ చేయడం ఖాయం అని ఇన్సైడ్ టాక్.

రీసెంట్ గా మూవీ టీం విడుదల చేసిన “వకీల్ సాబ్” పోస్టర్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా పవన్ గుబురు గడ్డం కు ఫాన్స్ ఫిదా అయిపోయారు. కానీ మూవీలో మరో ప్రత్యేకత ఉన్నట్టు తెలుస్తుంది. పోస్టర్లో చూపించినట్టుగా  పవన్ పూర్తి గడ్డంతో కనిపించడం లేదు. వాస్తవానికి బాలీవుడ్ పింక్ మూవీలో అమితాబ్ వయస్సు మీద పడిన లాయర్ గా కనిపించారు. కానీ తెలుగు నేటివిటీ కోసం పాత్రలో మార్పులు చేస్తునట్టు తెలుస్తుంది. దీని ప్రకారం “వకీల్ సాబ్” మూవీలో పవన్ రెండు వేరువేరు గెటప్స్ లో కనిపించనున్నారు అని తెలుస్తుంది.  ఫస్ట్ హాఫ్ లో క్లీన్ షేవ్ తో కనిపించగా, సెకండ్ హాఫ్ లో గుబురు గడ్డంతో కనిపిస్తారు అని టాలీవుడ్ లో వినిపిస్తుంది.  

 రెండేళ్ల తర్వాత పవన్ చేస్తున్న సినిమా కావడం అందులోనూ  ఫస్ట్ లుక్ మాస్ ఫాన్స్ కి నచ్చడంతో అభిమానులు విపరీతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫస్ట్ లుక్ బయటికొచ్చిన కొద్దిసేపటికే పవన్ ఫాన్స్  భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. నెల్లూరు, కర్నూల్, వైజాగ్, భీమవరం, కడప లాంటి పలు ప్రాంతాల్లో ప్రధాన థియేటర్ల వద్ద భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి బానాసంచా పేల్చి, కేక్ కటింగ్స్ నిర్వహించి హంగామా చేశారు.

ఈ క్రేజ్ చూస్తే, ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల రోజున హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో అయితే ఫస్ట్ లుక్, ఇండియా టాప్ ట్రెండింగ్లో ఉండటం విశేషం. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు బ్యానర్ పై రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని

Comments

0 Comments

సినిమా

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()