చిరంజీవికి ఫోన్ చేసి అభినందించారు అమితాబ్ బచ్చన్. ఇండియా ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్ బచ్చన్ మెగా స్టార్ చేసిన పనికి ఎంత గానో ప్రశంసించాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసినదే.
కంటికి కనిపించని ఈ కరోనాకి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలించడం లేదు. అయితే కరోనా కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు సాయం చెయ్యాలి అన్న ఉద్దేశం తో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసినదే.
ఈ ఛారిటీకి అండగా స్టార్ హీరోలు అయినా బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ మాత్రమే కాక పలు మెగా హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎంతో మంది సాయం అందించారు.
అలానే తమ వంతు విరాళాలతో ఆదుకున్నారు. సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి సీసీసీ వివిధ కష్టాలు పడుతోంది. మంగళవారం వెయ్యి మంది సినీ కార్మికులకు ఈ ఛారిటీ తరపున నిత్యావసరాలు అందించారు.
ప్రతీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి సాయం చేసారు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తమ్మారెడ్డి భరద్వాజ్, ఎన్ శంకర్, మెహర్ రమేష్ లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. ఇంత మంచి కార్యక్రమం చేప్పటినందుకు అమితాబ్ చిరంజీవిని ప్రశంసించారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments