సరిలేరు నీకు ఎవరు తో అదరగొట్టే మహేష్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా తో అదరగొట్ట నున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని అధికారంగా ప్రకటించారు.
అయితే తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించి అభిమానులకి తెలియజేశారు నిజంగా ఇది అభిమానులకి తీపి కబురు అని చెప్పవచ్చు. అయితే ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాల కి ఈ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
అయితే గతం లో లీక్ అయినట్టే ఈ సినిమాకి సర్కారు వారి పాట అనే టైటిల్ ఫైనల్ అయింది అయితే ఈ సినిమాని గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహించనున్నాడు. నిర్మాతగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే జి ఎం బీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారట.
అయితే ఈ టైటిల్ పోస్టర్ లో మహేష్ బాబు ఫుల్ లుక్ ని అయితే ఇంకా చూపించ లేదు కానీ టైటిల్ మాత్రం ఫిక్స్ చేశారు. అలానే చెవికి రింగు మెడపై రూపాయి టాటూ తో మాత్రమే మహేష్ బాబు కనిపించాడు. అయితే టైటిల్ పోస్టర్ మాత్రం నెట్టింట్లో షికార్లు కొడుతోంది.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్.ఎస్.తమన్ వ్యవహరించనున్నాడు. అయితే ఈ చిత్రంలో మహేష్ త్రిపాత్రాభినయం పోషించనున్నారు అనే వార్తల పై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ టైటిల్ ఫిక్స్ చేయగానే సర్కారు వారి పాట హాష్ టాగ్ తో బాగా ట్రెండ్ అయింది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments