ఇప్పుడు కరోనా వల్ల ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే కే జి ఎఫ్ చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయసులోనే ఘనత సాధించగలిగాడు ఈసీటీ కుర్రోడు.
అయితే మనం బతకడంతో పాటు సాటి మనుషులకు సహాయం చేసినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ కుర్రోడు ఏం చేశాడంటే తన టాలెంటు నిరూపించుకోవడమే కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వడం లో కూడా వయసుకు మించిన పరిణితి చూపిస్తున్నాడు.
కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి అనేక ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ అబ్బాయి సిటీలో అనేక సేవలు అందిస్తున్నాడు. ఈ కుర్రోడు కి తోడుగా మరి కొన్ని సేవ హృదయాలు కలిసి టీంఎఫ్ఎం పేరుతో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.
అయితే గత యాభై మూడు రోజుల నుంచి నిత్య అన్నదానాలు చేస్తున్నాడు. టీంఎఫ్ఎం తో కలిసి చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు తండ్రి సురేష్ అండగా నిలుస్తున్నారు. ఎందరో కూలీలకి, నిరుపేదలకు రోజూ ఆకలిని తీరుస్తున్నాడు. ఎందరో అభాగ్యులు ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడటం జీర్ణించుకో లేకపోయాను, అంటున్న తండ్రి సురేష్ అనూహ్యంగా సక్సెస్ అయిన తన చిన్నారి ద్వారా వచ్చిన ప్రతి పైసా కూడా సద్వినియోగం చేయడానికి ఇదే మంచి సమయమని అనుకుంటున్నాడు.
సురేష్ ఈ విషయాన్నీ భాను ప్రకాష్ కి అర్థమయ్యేలా వివరించారు. అంతే కాకుండా 50 రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు నింపిన 1500 కిట్లు అందించారు. ఇలా భాను ప్రకాష్ చిన్నవాడైనా పెద్ద మనసుతో సహాయం చేస్తున్నాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments