యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరు చెప్తే చాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు మోత మోగాల్సిందే.
ఇక ఎన్టీఆర్ మీసం తిప్పి, తొడ కొడితే సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యిపోతుంది. ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్.. యాక్టింగ్ అదుర్స్, ఇక డాన్స్ అయితే " 70mm స్క్రీన్ పై "రభస" జరగవలిసిందే . కానీ ఇప్పడు ఒక న్యూస్ అటు ఎన్టీఆర్ ఫాన్స్ ని ఇటు టాలీవూడ్ మొత్తానికి షాక్ కి గురి చెయ్యడమైతే పక్కా.
ఎన్టీఆర్ డాన్స్ కి గుడ్ బై చెప్తున్నారు. ఇది విన్న మీరు ఎంత షాక్ లో ఉన్నారో, చెప్తున్న మేము కూడా అదే షాక్ లో వున్నాం, కానీ ఇది నిజం. ఎన్టీఆర్, ఆయన ఫాన్స్ కి కిక్ ఇచ్చే మరో న్యూస్ అయితే రెడీ చేసి పెట్టారు. అ న్యూస్ అటు టాలీవుడ్ ని మాత్రమే కాదు, తమిళనాడుని కూడా ఉతికి ఆరేయబోతుంది. ఇంతకీ అ న్యూస్ ఏంటి ? ఎందుకు ఎన్టీఆర్ డాన్స్ కి గుడ్ బై చెప్తున్నారు ? ఎన్టీఆర్ తన ఫాన్స్ కి ఇచ్చే అ స్పెషల్ గిఫ్ట్ ఎం అయ్యి ఉంటుంది?
ప్రస్తుతం రాజమౌళి డైరెక్టన్ లో ఎన్టీఆర్ ఆర్ఆర్అర్ మూవీ చేస్తున్నాడు. ఇందులో తారక్ పూర్తిగా కొమరం భీం పాత్ర చేస్తూ వుండటంతో మాస్ డాన్స్ ఎన్టీఆర్ నుండి వస్తుంది అని అనుకోలేము. ఈ మూవీ తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక పొలిటికల్ మూవీ చేస్తున్నారు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీని మీద కూడా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇంతలో ఆర్ఆర్అర్ మూవీ తరువాత ఎన్టీఆర్ తమిళ, కన్నడ, తెలుగు టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేస్తున్నాడు అని కొందరి పేర్లు అయితే తెరపైకి వచ్చాయి. వారిలో అట్లీ, ప్రశాంత్ నీల్, కొరటాల శివ సహా ఎంతో మందితో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది... కానీ, ఎన్‌టీఆర్ త్వరలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.. వీరి అందరి మూవీస్ ఫిక్స్ అయినా ! వాటి స్టోరీస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి, వాటి నుండి తారక్ డాన్స్ ని అంచనా వేయలేము .
కొన్ని నెలలు క్రితం ఎన్టీఆర్ ఒక తమిళ మూవీ చూసి ఫిదా అయ్యారట. ఎలా అయినా ఆ డైరక్టర్ తో సినిమా చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి అంటే, తమిళంలో రిలీజ్ అయ్యి, దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న "అసురన్" మూవీ తారక్ కు విపరీతంగా నచ్చేసింది. వెంటనే తారక్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కి కాల్ చేసి, కలిసి పని చేద్దాం అని బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. రీసెంట్ గా దర్శకుడు వెట్రిమారన్ ఎన్టీఆర్ ను ఆర్ఆర్ఆర్ మూవీ సెట్ కలిసి తన సినిమా లైన్ ను చెప్పడం,ఎన్టీఆర్ కధకు ఓకే చెప్పడం చకచకా జరిగిపోయి.
అయితే ఇక్కడే వెట్రిమారన్ ఎన్టీఆర్ కు ఒక షరతు పెట్టారు అంటా. " తన మూవీలోని ఏ సాంగ్ లో కూడా డాన్స్ చేయకూడదు అని మాట తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.
గతంలో వెట్రిమారన్ తీసిన మూవీస్ అన్నీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉండి బ్లడ్ అండ్ వైలెన్స్ తారా స్థాయిలో ఉంటుంది. వెట్రిమారన్ తీసిన ‘వాడా చెన్నై', ‘ఆడుకాలమ్', ‘విసారణై' వంటి మూవీస్ చూస్తే ఈ విషయం మనకి అర్ధం అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోతున్న మూవీ కూడా అదే విధంగా ఉండనుంది. అందుకే వెట్రిమారన్ తన మూవీలో ఎటువంటి ప్రత్యేకమైన సాంగ్స్ గాని స్టెప్స్ గాని ఉండకూడదు అని ఎన్టీఆర్ కు చెప్పినట్టు తెలుస్తుంది. డాన్స్ అంటే ఎంతో మక్కువ ఉన్న, ఎన్టీఆర్, కథ నచ్చడంతో ఓకే చెప్పారు.
నిజానికి ఎన్టీఆర్ ఈ కధకు ఓకే చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. వెట్రిమారన్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్., అంతే కాకుండా ఎప్పటి నుండో ఎన్టీఆర్ తమిళ ఇండస్ట్రీకి ఒక మంచి మూవీతో వెళ్దాం అనుకుంటున్నారు. అందుకే ఈ మూవీ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా "అసురన్” లాంటి మూవీ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ అంటే ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. అందులోనూ తారక్ అభిమానులు "ఎన్టీఆర్" ను మాస్ లుక్ లో చూస్తే ఇక రచ్చ రచ్చే.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments