అల్లు అర్జున్ తన 20 వ చిత్రాన్ని రూపొందిస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. కానీ చాల రోజుల నుండి ఎటువంటి వార్తలు రాకపోవడం వల్ల ఫ్యాన్స్ ఎంతో బాధ పడ్డారు. కానీ ఈరోజు మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదలని చేసారు. పుష్ప అనే టైటిల్ తో పోస్టర్ ని కూడా ఈరోజు రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇంకేం ఉంది పోస్టర్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.
అయితే బన్నీ ఈసారి ఆలా వైకుంఠ పురం సినిమా తో సంక్రాంతి కి పెద్ద హిట్ కొట్టాడు. అయితే మరో హిట్టు కొట్టాలని ఈ సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. పుష్ప సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని, హీరోయిన్ రష్మిక మందన అన్న విషయం కూడ తెలిసినదే. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ప్యాన్ ఇండియా సంస్థ లెవెల్లో ఈ సినిమాని కేవలం తెలుగు లో మాత్రమే కాక హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ అన్ని భాషల్లో కూడా పోస్టర్ విడుదల అయ్యింది.
మాసిన గడ్డం, జుట్టు, నల్ల తాడు ఇలా రఫ్ లుక్ తో అల్లు అర్జున్ పుష్ప పోస్టర్ లో కనిపించాడు. ఈ సినిమా 1980 ల కాలం నాటిదేమో అని అంటున్నారు. ఈ సినిమా ప్రచారాన్ని బట్టి ఈ డ్రైవర్ పాత్రని సుకుమార్ రూపొందించినట్టు అంచనా వేస్తున్నారు జనం. చిత్తూరు స్లాంగ్ లో ఈ పోస్టర్ చూపించారు మొదట. ఇవన్నీ చూస్తుంటే చాల వెరైటీ ఉండేలా ఉంది పుష్ప సినిమా.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments