కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడం తో ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్ తో ఉన్న దుస్థితి ఏర్పడింది. అయితే ఇలా ఉండడం వల్ల సినిమాలు సైతం అన్నీ ఆగి పోయాయి. ఇంకేముంది ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇల్లు దాటి కదలడానికి లేదు కదా..! అయితే ఇప్పటి వరకూ సినిమాలన్నీ ఆగిపోయాయి. ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తమిళనాడు ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టి అనుమతులను జారీ చేసింది ఈ సంగతి అందరికీ తెలిసినదే.
అయితే దీని మేరకు సోమవారం నుంచి తమిళ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాకు సంబంధించి ఎడిటింగ్ వర్క్స్ మొదలయ్యాయి.
ఇండియన్ 2 సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే చెన్నైలో రెండు వేరు వేరు స్టూడియోలో ఈ వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఇకపోతే విశాల్ హీరోగా వస్తున్న చక్ర డబ్బింగ్ వర్క్స్ కూడా ప్రారంభం అయ్యాయట.
హీరోయిన్ త్రిష నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ ఫిలిం రంగి గ్రాఫిక్స్ పనులు కూడా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. ఇలా వారి సినిమాలలో పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి పలు నిర్మాణ సంస్థలు సన్నాహాలు మొదలు పెట్టాయి.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments