వరుస సినిమాలతో దూసుకుపోతున్నా సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయాడు. 'అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ హాట్ అవ్వడంతో సందీప్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో రికార్డుల మోత మోగించటంతో సందీప్‌కు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. టీ సిరీస్‌లాంటి అతిపెద్ద నిర్మాణ సంస్థ సందీప్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. సందీప్ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేయాల్సి ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే సందీప్ ఏ హీరో సినిమా చేయాలన్నా ప్రస్తుతం వారి చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయాలి. అప్పటివరకు సందీప్ ఎదురుచూడాల్సిందే.
ఈ నేపథ్యంలోనే టీ సిరీస్ సంస్థతో సందీప్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో మళ్లీ సందీప్ టాలీవుడ్‌కే వచ్చేసినట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో తెలుగు సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే రణ్‌బీర్‌తో సినిమా విషయంలో టీ సిరీస్ సందీప్‌కు షాకిచ్చింది కాబట్టి.. తెలుగు సినిమాను నిర్మిస్తామని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. కానీ సందీప్‌లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌కు హిందీలో మరో మంచి సినిమా పడి ఉంటే.. ఆయన అక్కడ పెద్ద దర్శకులకు గట్టి పోటీనిచ్చేవారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సందీప్ తెరకెక్కించిన ‘కబీర్ సింగ్’ సినిమాను ఎన్ని వివాదాలు చుట్టుమట్టాయో అందరికీ తెలిసిందే. సమంత, అనసూయ లాంటి ఎందరో ప్రముఖులు సందీప్ తన సినిమా గురించి సమర్ధించుకుంటూ చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్య ఎన్నో నెలలు అయిపోతున్నా ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments