గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాడు బాలకృష్ణ. అయితే పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నేడు టిడిపి వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు 97 వ జయంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.
అయితే హీరో బాలకృష్ణ తో పాటుగా ఆయన సతీమణి వసుంధర అలానే నందమూరి రామకృష్ణ సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు వారి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు బాలకృష్ణ. అయితే నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలన్నీ చరిత్రలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఆయన నటన అమోఘం ఆయన సినిమాలు నిజంగా చరిత్రలో నిలిచి పోయాయి. మా ఖ్యాతి మీరే మా కీర్తి మీరే ఓ విశ్వ విఖ్యాత అందుకో మా జ్యోత అని కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ట్విట్టర్ వేదికగా ఆయనని గుర్తు చేసుకుని నివాళులర్పించారు.
‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.
అయితే కరోనా కారణంగా జాగ్రత్తలు తీసుకోవడం సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద కి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments