ఛాలెంజ్ ల మీద చాలెంజ్లు విసురుకుంటున్నారు హీరోలు. అయితే మెగాస్టార్ సైతం ఈ సవాల్ మీద సవాల్ విసురుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ క్రియేటివిటీని చూపిస్తున్నారు. చాలెంజ్ తో క్రియేటివిటీని చూపిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నారు.
కరోనా వైరస్ వల్ల హీరోలంతా ఇంట్లోనే ఉంటూ ఇలా సవాల్ మీద సవాల్ విసురుకుంటున్నారు. మెగాస్టార్ దోసెలు వేయడంలో ఎక్స్పర్ట్ అని వినడమే తప్ప ఇప్పటి వరకు ఎవరూ చూసింది లేదు. అయితే కరోనా వైరస్ కారణంగా మనకి చూసే అవకాశం లభించింది.
తన తల్లి అంజనాదేవి కోసం ఆయన ఎంతో ఆప్యాయంగా పెసరట్టు ఉప్మా చేసి వడ్డించారు. ఇలా తాను చేసిన వీడియో ని పోస్ట్ చేసి తారక్ నువ్వు విసిరిన సవాల్ స్వీకరించా.... ఇది నేను చేసే పనే కాకపోతే ఈ రోజు మీ అందరి కోసం ఈ వీడియో పోస్ట్ చేశాను అని చిరు అన్నారు. అలానే తారక్ విసిరిన ఛాలెంజ్ కి వెంకటేష్ కూడా రియాక్ట్ అయ్యి ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసారు. వంట చేసి, మొక్కలకి నీళ్ళు పోస్తున్న వీడియో ఆయన పోస్ట్ చేశారు.
ఆ తర్వాత చిరంజీవి ఛాలెంజ్ ని కేటీఆర్ కు, రజనీకాంత్ కు, దర్శకుడు మణిరత్నంకు ఛాలెంజ్ విసిరారు. అలానే విక్టరీ వెంకటేష్ కూడా ఛాలెంజ్ పూర్తి చేసేసి సూపర్ స్టార్ మహేష్ బాబుకి, వరుణ్ తేజ్ కి , దర్శకుడు అనిల్ రావిపూడికి ఛాలెంజ్ విసిరారు. ఇలా టాలీవుడ్ నటులు సవాల్ మీద సవాల్తో సోషల్ మీడియాలో దూసుకెళుతున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments