కడలిని కాపాడుకుందాం! మానవ మనుగడను ప్రశ్నార్ధకం కాకుండా చూద్దాం..
మనం నివసిస్తున్న భూమి కంటే సముద్రం విశాలమైంది. చెప్పాలంటే.. సముద్ర ప్రపంచమే చాలా పెద్దది. కానీ, మనుషుల స్వార్థం సముద్రాలకు తీరని నష్టం కలిగిస్తోంది. సముద్ర జాతులను నాశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏటా జూన్ 8వ తేదీన ‘ప్రపంచ మహాసముద్ర దినం’ నిర్వహిస్తుంటారు. అయితే సముద్రాల గురించి మనం తెలుసుకోవల్సిన ముఖ్య విషయాలు ఒకసారి చూద్దాం..
సముద్ర పర్యావరణాన్ని రక్షించడంలో వేల్ చేపలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దురదృష్టవశాత్తు.. వీటిలో చాలావరకు జాతులు అంతరించాయి. ఎన్నో పోరాటాల తర్వాత 13 వేల్ జాతుల్లో 7 జాతులను అంతరించిపోతున్న జాతులుగా గుర్తించారు.
ప్రపంచంలోని అన్ని సముద్రాలు దాదాపు 5వేల నుంచి 10వేల మీటర్ల లోతు ఉన్నాయి. పసిఫిక్ మహా సముద్రం ప్రపంచంలోనే అత్యంత లోతైనది. దీని లోతు 10,918 మీటర్లు. అంతరిక్షాన్ని సైతం అందుకున్న మానవుడు. ఇప్పటి వరకు సముద్రం అడుగున ఉన్న లోతైన చీకటి ప్రపంచంలోకి వెళ్లేందుకు సాహసించకపోవడం గమనార్హం.
అమెరికాకు సరఫరా అవుతున్న సముద్ర ఆహారంలో 20 శాతానికి పైగా సముద్ర జీవులను అక్రమంగా వేటాడుతున్నవేనని తెలిసింది.
సముద్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల 2050 కల్లా దాదాపు 40 శాతం ప్రధాన చేప జాతులు అంతరిస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటికి సముద్రాల్లో చేపలు కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సముద్రాలను రక్షించేందుకు ఏర్పాటైన మెరైన్ ప్రొటెక్ట్ ఏరియా (ఎంపీఏ) ద్వారా గలపగోస్ ద్వీపాల్లో సముద్ర జాతులను రక్షిస్తున్నారు. ఇక్కడి సముద్రంలో వేటను నిషేదించారు. అయితే, ప్రపంచంలో కేవలం 1.6 శాతం సముద్రాలను మాత్రమే ఎంపీఏగా నిర్ధారించారు. దీంతో 90 శాతానికి పైగా సముద్ర జలాల్లో యదేచ్ఛగా వేట కొనసాగుతోంది.
మానవుడు వివిధ రూపాల్లో విడుదల చేస్తున్న కార్బన్ డై ఆక్సైడ్ వల్ల చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల నుంచి సముద్రాలు, భూమిని రక్షిస్తున్నాయి. అయితే, కార్బన్ డైఆక్సైడ్‌ను అతిగా గ్రహించడం వల్ల ఇవి క్రమేనా ఆమ్ల ప్రభావానికి గురై జీవం కోల్పోతున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతం పసిఫిక్ మహా సముద్రంలోని మరియానా ట్రెంచ్. ఇది సముద్ర తలానికి 36,000 అడుగుల లోతులో ఉంది. మనం పాడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు చివరికి అక్కడికి కూడా చేరాయి. పసిఫిక్ ప్లేట్, మరియానా ప్లేట్లు కలుసుకునే ఈ ప్రాంతాన్ని "సబ్డక్షన్ జోన్" గా గుర్తించారు.
సముద్రం గురించి మరికొన్ని ఆశక్తికర అంశాలు తెలుసుకుందాం..
మన మహాసముద్రాలు భూమి యొక్క ఉపరితలంలో 70 శాతానికి పైగా ఉంటూ ఇంకా ఎంతో అన్వేషించాల్సింది మిగిలి ఉందని గుర్తుచేస్తుంటాయి..
భూమి యొక్క ఉపరితలం చాలా వరకు నీటి అడుగున ఉన్నందున, సముద్ర జాతులు భూమిపై ఉన్నవారి కంటే ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ భూమిపై ఉన్న జీవ జాతులలో 94% మహాసముద్రాలలో నే ఉన్నాయి..
మహాసముద్రాలలో ఉన్న ఐదు శాతం జీవ జాతులలో 5% కన్నా తక్కువే ఇప్పటివరకు అన్వేషించబడ్డాయి.
భూమి యొక్క పొడవైన పర్వతాల వరుస అయిన మిడ్-ఓషన్ రిడ్జ్, దాదాపు పూర్తిగా సముద్రం క్రింద ఉంది.. ఇది 65,000 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది.
ప్రపంచంలోని అన్ని మ్యూజియమ్‌ల కంటే సముద్రం క్రింద చారిత్రాత్మక కళాఖండాలు అధికంగా ఉన్నాయి. ఫ్లోరిడా కీస్ నేషనల్ మెరైన్ వద్ద ఇటీవలి సంవత్సరాలలో అనేక మ్యూజియంలు సృష్టించబడ్డాయి, వీటిలో మధ్యధరా సముద్రం లో మునిగిపోయిన కాంస్య విగ్రహం, క్రైస్ట్ ఆఫ్ ది అబిస్ ఉన్నాయి..
సముద్రం అడుగున ఉన్న మొత్తం బంగారం తీసి ప్రపంచం లో ఉన్న ప్రజలకు పంచితే ఒక్కొకరికీ 5 కిలోల బంగారం వస్తుంది..
మన గ్రహం యొక్క ఆక్సిజన్‌లో 70 శాతానికి పైగా సముద్రం ద్వారా ఉత్పత్తి అవుతుంది. మనం పీల్చే ఆక్సిజన్‌లో 70 నుంచి 80 శాతం మధ్య సముద్ర మొక్కల ద్వారా ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు.
సముద్రం క్రింద నదులు మరియు సరస్సులను కనుగొన్నారు.. ఉప్పునీరు మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ కలిసినప్పుడు, దాని చుట్టూ ఉన్న మిగిలిన నీటి కంటే దట్టంగా మారుతుంది, ఇది సముద్రం క్రింద ప్రవహించే ఒక సరస్సు లేదా నదిని ఏర్పరుస్తుంది.
అమెరికాలో 50 శాతం సముద్రం క్రింద ఉంది. యునైటెడ్ స్టేట్స్ కూడా అత్యధిక భాగం సముద్రం కిందనే ఉంది..
పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం మరియు ఇది 25,000 ద్వీపాలను కలిగి ఉంది.
ఇవీ సముద్రాల గురించిన కొన్ని విశేషాలు .. మీకు తెలిసిన సముద్రపు వింతలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments