మలేరియాను తరిమికొట్టిన సర్ రోనాల్డ్ రాస్!

img

సర్ రోనాల్డ్ రాస్ ఒక బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త.  

రొనాల్డ్ రాస్ ఎక్కడ జన్మించాడు? భారతదేశం లో ఎక్కడెక్కడ పని చేశారు? హైదరాబాద్ తో ఆయనకు ఉన్న అనుభంధం ఏమిటి? మలేరియాను ఎలా గుర్తించాడు? ఆయన కు విపరీతమైన కోపం ఉండేదా? అయినా నోబెల్ బహుమతి ఎలా వచ్చింది? ఇలాంటి ఆశక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రోనాల్డ్ రాస్ 13 మే, 1857 లో జన్మించాడు.. ఇతడు మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902 లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. 1897 లో ఒక "దోమ ప్రేగులలో" మలేరియా పరాన్నజీవిని ఆయన గుర్తించాడు.. మలేరియా వ్యాధి "దోమల" ద్వారా వ్యాపిస్తుందని ఋజువు చేశాడు. ఈ వ్యాధిని అంతం చేసే మందు కనుక్కునేందుకు రోనాల్డ్ రాస్ ద్వారా మొదటి అడుగు పడింది. 

భారతీయ వైద్య సేవలో 25 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. అతడు అనేక రంగాల్లో ప్రావీణ్యుడు. భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, అతను లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అధ్యాపకులలో ఒకనిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు అక్కడే ప్రొఫెసర్ మరియు చైర్మన్ గా కొనసాగుతూ చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. అతను హైదరాబాదు నగరంలో కూడా తన పరిశోధనలు జరిపాడు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్"గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు..

రొనాల్డ్ రాస్ భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో జన్మించాడు. అతని తండ్రి "కాంప్‌బెల్ రాస్" బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జనరల్ గా పనిచేసేవాడు. ఎనిమిదేళ్ల వయసులో "ఐల్ ఆఫ్ వైట్" ‌లో తన అత్త, మామలతో కలిసి జీవించడానికి ఇంగ్లాండ్‌కు వెళ్ళాడు. అతను ప్రాథమిక విద్యను, మాధ్యమిక విద్యను సౌతాంప్టన్‌ బోర్డింగ్ స్కూల్ లో చదివాడు. తన చిన్నతనం నుండే కవిత్వం, సంగీతం, సాహిత్యం, గణితంపై మక్కువ పెంచుకున్నాడు. పద్నాలుగు సంవత్సరాల వయస్సులో అతను గణితశాస్త్రంలో బహుమతిని గెలుచుకున్నాడు. "ఆర్బ్‌స్ ఆఫ్ హెవెన్" అనే పుస్తకం గణితశాస్త్రంపై అతనికి ఆసక్తిని రేకెత్తించింది. 1873 లో తన పదహారేళ్ళ వయసులో చిత్రలేఖనంలో ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జ్ స్థానిక పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందాడు.. అతడు రచయిత కావాలని అనుకున్నా, అతని తండ్రి 1874 లో అతడిని లండన్ లోని సెయింట్ బార్తోలోమేవ్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో చేర్చాడు. అతను 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసులో చేరి ముందుగా మద్రాసులో పనిచేశాడు.. 

1881 నుండి 1894 వరకు అతను మద్రాస్, బర్మా, బలూచిస్తాన్, అండమాన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్ ‌లలో వివిధ పదవులలో నియమించ బడ్డారు. 1883 లో, అతన్ని బెంగళూరులో యాక్టింగ్ గారిసన్ సర్జన్‌గా నియమించారు. ఈ సమయంలో దోమలకు నీరు అందుబాటులో లేకపోతే వాటిని అదుపుచేయవచ్చని అర్ధం చేసుకున్నాడు. మార్చి 1894 లో అతను సెలవు తీసుకొని తన కుటుంబంతో లండన్ వెళ్ళాడు. 1894 ఏప్రిల్ 10 న అతను "సర్ పాట్రిక్ మాన్సన్‌" అనే శాస్త్రవేత్త ను మొదటిసారి కలిశాడు. రాస్ కు గురువుగా మారిన మాన్సన్, మలేరియా పరిశోధనలో అసలు సమస్యలను అతనికి తెలియజేశాడు. మాన్సన్ మాట్లాడుతూ "మలేరియా అధ్యయనం కోసం భారతదేశం ఉత్తమమైన ప్రదేశమని" అంటుండేవాడు.. దీంతో రాస్ మళ్ళీ భారతదేశానికి బయలుదేరి సికింద్రాబాదు చేరుకుని తన పరిశోధనా వస్తూలు తీసుకుని అక్కడనుండి నేరుగా బొంబాయి సివిల్ హాస్పిటల్ కి వెళ్ళాడు.. అక్కడ మలేరియా రోగుల కోసం వెతుకుతూ రక్త నమూనాలు సేకరించడం ప్రారంభించాడు.

రాస్ మే 1895 లో దోమల కడుపు లోపల మలేరియా పరాన్నజీవి ప్రారంభ దశలను గమనించినప్పుడు తన పరిశోధనలో మొదటి ముఖ్యమైన అడుగు వేశాడు. అయినప్పటికీ, కలరా వ్యాప్తిపై పరిశోధన చేయడానికి అతనిని బెంగళూరుకు పంపించడంతో అతని ఉత్సాహానికి బ్రేకులు పడ్డాయి..  బెంగుళూరులో కలరా పరిశోధన చేస్తున్నప్పటికీ మలేరియా వ్యాధిపైనే తన ఆలోచనలు తిరుగుతుండేవి.. కానీ అక్కడ మలేరియా రోగులు అతడికి దొరకలేదు.. కానీ ఏప్రిల్‌లో అతను ఊటీ హిల్ స్టేషన్ సమీపంలో ఉన్న సిగుర్ ఘాట్‌ను సందర్శించే అవకాశం వచ్చింది. అక్కడ అతను ఒక గోడపై విచిత్రమైన భంగిమలో ఒక దోమను గమనించాడు. అప్పటికి ఆ జాతి దోమ గురించి ఎవ్వరికీ తెలియదు. మే 1896 లో అతనికి ఒక రోజు సెలవు దొరికింది.. వెంటనే ఊటీ చుట్టూ మలేరియా-స్థానిక ప్రాంతాన్ని సందర్శించడానికి బయలుదేరాడు. అయితే ఆయనను అక్కడనుండి మళ్ళీ సికింద్రాబాద్‌కు బదిలీ చేశారు. రెండు సంవత్సరాల పరిశోధన అనంతరం, 1897 లో అతను లార్వా నుండి 20 "గోధుమ" దోమలను స్రుష్టించాడు.

అతను హుస్సేన్ ఖాన్ అనే మలేరియా రోగికి 8 అణాలు ఇచ్చి 8 దోమలతో కుట్టించుకోవాలని ఒప్పందం చేసుకున్నాడు.. రక్తం త్రాగిన కొన్నాళ్ళ తరువాత ఆ దోమల ప్రేగు లోపల మలేరియా పరాన్నజీవి ఉన్నట్లు కనుగొన్నాడు. దీనిని అతను అనోఫిలెస్ జాతికి చెందిన దోమ గా గుర్తించాడు. మరుసటి రోజు దోమలో పరాన్నజీవి పెరుగుదలను కూడా గమనించాడు. ఈ ఆవిష్కరణ 1897 న ఇండియన్ మెడికల్ గెజిట్‌లో ప్రచురించబడింది. తరువాత బ్రిటిష్ మెడికల్ జర్నల్ డిసెంబర్ 1897 సంచిక కూడా ఈ విషయం ప్రచురించింది. 

సెప్టెంబర్ 1897 లో "రాస్" బొంబాయికి బదిలీ చేయబడ్డాడు. అక్కడ నుండి  రాజస్థాన్ మలేరియా రహిత ప్రదేశానికి పంపబడ్డాడు. అక్కడ పని లేకపోవడంతో విసుగు చెందిన అతను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అధికారులతో చెప్పాడు, ఎందుకంటే అలా ఖాలీ గా కొర్చోవడం అతడికి ఇష్టమే లేదు.. 17 ఫిబ్రవరి 1898 న ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్‌లో పనిచేయడానికి కలకత్తా చేరుకున్నాడు. అక్కడ అతను వెంటనే మలేరియా పై మరిన్ని పరిశోధనలు ముమ్మరం చేశాడు. కోల్కత్తా సమీపంలోని మహానద్ గ్రామంలో ఒక ప్రయోగశాలతో కూడిన బంగ్లాను నిర్మించాడు. అక్కడ అతను గ్రామంలో, చుట్టుపక్కల దోమలను ఎప్పటికప్పుడు సేకరించేవాడు. 

కలకత్తా లో మలేరియా ప్రభావం అంతగా లేనందువల్ల అతడు పక్షులపై పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాడు.. కొన్ని నెలల్లో క్యూలెక్స్ దోమల గురించి కూడా కనుగొన్నాడు.. అతను ఆ తరువాత "దోమల నుండి మలేరియా వ్యాధి పిచ్చుకలకు సోకడం పై అందరికీ ప్రాక్టికల్ గా చూపించాడు.. తద్వారా మలేరియా పూర్తి జీవిత చక్రాన్ని కనుగొన్నాడు. 

పక్షులలో మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు రోనాల్డ్ రాస్‌కు నోబెల్ బహుమతి లభించింది. 

రోనాల్డ్ రాస్ కి టెంపర్ ఎక్కువ.. అతడు తోటి విద్యార్థులు, సహచరులు, శాస్త్రవేత్తలతో నిరంతరం గొడవ పడేవాడు. 1889 లో రాస్ రోసా బెస్సీ బ్లోక్సామ్ ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, డోరతీ, సిల్వియా లు, ఇద్దరు కుమారులు, రోనాల్డ్ కాంప్‌బెల్, చార్లెస్ క్లే. అతని భార్య 1931 లో మరణించింది. రోనాల్డ్, సిల్వియాలు అతని కంటే ముందే మరణించారు.. అనారోగ్యం, ఉబ్బసం వల్ల రాస్ తన పేరుతోనే ఉన్న ఒక ఆసుపత్రిలో మరణించాడు. 

భారత దేశం లో అతడికి ఎంతో గౌరవం ఇస్తారు..

హైదరాబాద్ లో ఒక అంటువ్యాధుల ఆసుపత్రికి అతడి పేరు పెట్టారు.

బేగంపేట విమానాశ్రయానికి సమీపంలో సికింద్రాబాద్‌లో అతడు మలేరియా పరాన్నజీవిని కనుగొన్న భవనాన్ని ఒక వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4 లక్షల మంది మలేరి వ్యాధి తో మరణిస్తున్నారు.. అత్యధికంగా ఆఫ్రికా దేశాల్లఒ ఈ మరణాలు అధికం.. అసలు అన్ని రకాల దోమల వల్ల ప్రపంచం లో 7 లక్షల మంది డెంగ్యూ, మలేరియా వంటి వివిధ రోగాలబారిన పడి మరణిస్తున్నారు.. మనుషులు అధికంగా మరణించేది దోమకాటువలన్నే.. తర్వాతి స్థానాల్లో పాము (ఒక లక్ష), కుక్కలు (60 వేలు) ఉన్నాయి..

మరిన్ని

Comments

0 Comments

అంతర్జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()