నెపోలియన్ జీవిత చరిత్ర రెండవ భాగం లో ఇప్పుడు తన పతనానికి కారణాలు తెలుసుకుందాం..
1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం ఫ్రాన్స్ లోనే గాక యూరప్ మొత్తానికి విస్తరించింది. నాటి యూరప్ రాజ్యాలన్నీ నెపోలియన్ పట్ల భయంతో కూడిన గౌరవాన్ని ప్రదర్శించాయి. ఆ తరువాత అతికొద్ది కాలంలోనే నెపోలియన్ పతనం ఆరంభమయింది.
ఇంగ్లాండు కు చెందిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని ధ్వంసం చేయాలంటే "భూఖండ" విధానాన్ని అన్ని వేళలా, అన్ని చోట్లా అమలు చేయాలి. ఇంగ్లాండు కు చెందిన సరుకులు ఐరోపా చేరకుండా గస్తీ ఏర్పరచాలి. ఈ విధానాన్ని అమలు చేయడం లో ఎటువంటి అలసత్వం వహించినా ఇంగ్లాండును ఆర్థికంగా దెబ్బతీయడం సాధ్యం కాదు. దీని ఫలితంగా ఇతర దేశాల మీద దురాక్రమణలు చేయవలసి వచ్చింది.
భూఖండ విధాన అమలులో నెపోలియన్ "పోర్చుగల్, స్పెయిన్" లతో వినాశకరమైన యుద్ధం చేయవలసి వచ్చింది. పోర్చుగల్ కు మొదటి నుండీ ఇంగ్లాండు తో గల రాజకీయ, ఆర్దిక సంబంధాల వల్ల అది "భూఖండ" విధానాన్ని వ్యతిరేకించింది. ఆ కారణంగా నెపోలియన్ పోర్చుగల్ ను జయించి స్పెయిన్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోర్చుగల్ ఆక్రమణ సందర్భంగా నెపోలియన్ తన సైన్యాలను స్పెయిన్ లో ప్రవేశపెట్టాడు. స్పెయిన్ రాజు బలహీనతను గుర్తించి దాన్ని కూడా ఆక్రమణ ఆక్రమించుకున్నాడు.. తన సోదరుడైన జోసఫ్ ను స్పెయిన్ రాజుగా ప్రకటించాడు. స్పెయిన్లో ఫ్రాన్స్ అధికారానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వీటిని అణచి వేయడానికి నెపోలియన్ తన సైనిక బలగాన్ని అధికంగా వినియోగించవసి వచ్చింది. అయినా వైఫల్యం తప్పలేదు. సముద్రం పై పట్టు లేకపోవడం కూడా నెపోలియన్ పతనానికి కారణం అయింది.
"జాతీయతా భావం" ఫ్రెంచి విప్లవం నుండి మొదలుకుని ఐరోపా అంతటికీ విస్తరించింది. నెపోలియన్ ఈ "జాతీయతా భావాన్ని" నిరోధించలేక పోయాడు. మేధావులు, కవులు, వేదాంతులు, అధ్యాపకులు జాతీయ తత్వాన్ని ప్రేరేపించడానికి నిరంతరం కృషి చేశారు.
1807 లో రష్యాను ఫ్రాన్స్ ఓడించగా జరిగిన సంధి 5 సంవత్సారాల పాటూ కొనసాగినప్పటికీ ఈ రెండు రాజ్యాల మద్య అనేక అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. నెపోలియన్ "భూఖండ" విధానం వల్ల రష్యాకు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ కారణాల వల్ల రష్యా, ఫ్రాన్స్ ల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూఖండ విధానమును బలవంతఅంగా అమలు జరపడానికి నెపోలియన్ పెద్ద సంఖ్యలో సైన్యం తో రష్యా మీద దాడి చేసాడు. రష్యా సైన్యాలు ఎదురు నిలువకుండా వెనుకడుగు వేశాయి.. అడ్డొచ్చిన గ్రామాలను, పంటలను శత్రువుల వశం కాకుండా పాడు చేసారు. అనేక వ్యయ ప్రయాసలను ఎదుర్కొని నెపోలియన్ సైన్యం మాస్కో చేరింది. రష్యా "సంధి" కి వస్తుందని నెపోలియన్ భావించి, కొన్ని వారాలపాటు అక్కడే వేచి వున్నా ప్రయోజనము లేక సైన్యాన్ని వెనక్కి రమ్మని ఆదేశించాడు. అయితే తీవ్రమయిన చలి, ఆహార పదార్దాల కొరత, రష్యా సైన్యాల గెరిల్లా దాడుల వల్ల నెపోలియన్ సైన్యాలు తీవ్రంగా నష్టపోయాయి.
రష్యా, ఆస్ట్రియా, పర్షియా దేశాలు కలిసి సంయుక్తంగా సైనిక శక్తిని రూపొందించాయి. వీటికి ఇంగ్లాండు ఆర్థిక సహాయం అందించింది. 1813 లో నెపోలియన్ సేనలకు, సంయుక్త సైన్యాలకు మద్య "లిప్ జిగ్" వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ సేనలు అధ్బుతంగా పోరాడినప్పటికీ చివరకు ఘోరంగా ఓడిపోయారు. నెపోలియన్ ను "ఎల్బా" అనే చిన్న దీవికి పాలకునిగా పంపించి వేశారు. ఫ్రాన్స్ కు "లూయి 18" ని రాజుగా నియమించారు.
నెపోలియన్ తరువాత ఫ్రాన్స్ కు రాజైన "లూయి 18" తన తెలివి తక్కువ పనుల వల్ల కొద్ది కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. విజేతలైన రాజ్యాలు భూభాగాల పంపకంలో గొడవ పడ్డాయి.. దీన్ని అవకాశంగా తీసుకొని నెపోలియన్ "ఎల్బా" నుండి తప్పించుకొని పారిస్ కు 1815 మార్చి 1 న చేరుకున్నాడు. వెంటనే "లూయి 18" ఫ్రాన్స్ వదిలి పారిపోయాడు. నెపోలియన్ తనకు తానుగా తిరిగి రాజు అని ప్రకటించుకున్నాడు. కాని ఇది 100 రోజులు మాత్రమే కొనసాగింది. మరలా ఐరోపా రాజ్యాలు అన్నీ తిరిగి ఒక్కటై నెపోలియన్ తో "వాటర్లూ" యుద్ధంలో తలపడ్డాయి. ఈ యుద్ధంలో నెపోలియన్ ను ఓడించి ఈసారి "సెయింట్ హెలినా" అనే దీవికి పంపించి వేశారు.
సెయింట్ హెలినా అను దీవిలో అతనిపై అనేక నిర్భందాలు విధింపబడ్డాయి. అక్కడే కాన్సర్ వ్యాధితో భాదపడుతూ నెపోలియన్ తన 52వ ఏట మరణించాడు. నెపోలియన్ కి ఇద్దరు భార్యలు, జోసెఫిన్ మరియు మేరీ లూయిస్.. ఆయనకు నెపోలియన్ - 2 అనే ఒక కుమారుడు ఉన్నాడు.. నెపోలియన్ మృతదేహాన్ని సెయింట్ హెలినా దీవిలో సమాధి చేసినప్పటికీ, ఆ తర్వాత శరీరాన్ని వెళికితీసి పారిస్ లో తిరిగి ఖననం చేసారు..
ఇంగ్లండ్ పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేసుండకపోతే నెపోలియన్ జీవితం మరోలా ఉండేది.. ఇదీ నెపోలియన్ జీవిత గాధ..
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments