టెలిస్కోప్ గురించి తెలుసుకోవాలనే ఆశక్తి మీలో ఉందా? ప్రపంచం లో అతిపెద్ద టెలిస్కోప్ ఏది? అంతరిక్షం లో కూడా టెలిస్కోప్ ఉందా? ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి విశ్వం పుట్టిన నాటి వాస్తవాలను కనుగొనవచ్చా? ఇలాంటి అనేక ఆశక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో చాలామందికి టెలిస్కోప్ గురించి తెలిసే ఉంటుంది.. ఇది ఉపయోగించి ఆకాశంలో దూరంగా కంటికి కనిపించని నక్షత్రాలను, గెలాక్సీలను దగ్గరగా చూడవచ్చు.. అయితే భూమి మీద ఒక టెలిస్కోప్ అమర్చి ఆకాశాన్ని శోధించడం ఒకపద్దతి అయితే, ఆ టెలిస్కోప్ ని అంతరిక్షం లోకి పంపించి అక్కడ నుండి ఆకాశాన్ని పరిశోధించడం మరొక పద్దతి.. ఈ రెండిటినీ ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసి ఖగోళం లో దాగి ఉన్న అనేక షాకింగ్ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు.. భూమిపైన ఉన్న అతిపెద్ద టెలిస్కోప్ స్పెయిన్ లో ఉంది.. అంతరిక్షం లో అతిపెద్ద టెలిస్కోప్ హబుల్.. ఇక ఇప్పుడు హబుల్ కు ఆరు రెట్లు పెద్దదిగా ఉండే జేంస్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తయారీ దశలో ఉంది..
ఏమిటి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్?
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. ఇది అంతరిక్షంలో ఉండి పనిచేసే టెలిస్కోపు. దీన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ కు సక్సెసర్ గా రోపొందుస్తున్నారు. జేమ్స్ వెబ్ లో, హబుల్ కంటే మెరుగైన ఇన్ఫ్రారెడ్ రిజల్యూషన్, సెన్సిటివిటీ ఉంటుంది. విశ్వంలో తొలి గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడంతో పాటూ కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరం లో ఏం జరుగుతుందో తెసుకోవడం దీనిపని.. విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన అనేక అంశాలలో విస్తృతమైన పరిశోధనలు దీని ద్వారా చెయ్యవచ్చు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవడం, బయటి గ్రహాలను, నోవాలనూ నేరుగా పరిశీలించడం మొదలైనవి జేమ్స్ వెబ్ ద్వారా కనిపెట్టవచ్చు.
జేమ్స్ వెబ్ లో ఆప్టికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది బెరీలియంతో తయారు చేసి, బంగారు పూత పూసిన పెద్ద మిర్రర్. అయితే ఇవి 18 పార్ట్స్ గా విభజించబడి ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద మిర్రర్ ని అంతరిక్షం లోకి పంపడం అసాధ్యం కాబట్టి, దీనిని ఫోల్డ్ చేసి రాకెట్ లాంచర్ లో ఇన్స్టాల్ చేస్తారు.. దీని వ్యాసం 6.5 మీటర్లు. 2.4 మీటర్ల హబుల్ టెలిస్కోపు మిర్రర్ కంటే ఇది చాలా పెద్దది. హబుల్, ఇంఫ్రారెడ్ కిరణాల లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేదు.. అదే నెబ్ టెలిస్కోప్ అయితే ఇంఫ్రారెడ్ కిరణాలను దాటుకుని అవతల ఏం జరుగుతుందో చూడగలదు... దీనికోసం ఈ టెలిస్కోపును అత్యంత కూల్ ప్రదేశం లో ఉంచాలి. అందుకే సూర్యకిరణాలు డైరెక్ట్ గా దీనిపైన పడకుండా భూమి చాటున ఉంచుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమినేలా చేస్తారు.. సిలికాన్, అల్యూమినియం- పూత పూసిన ఒక లేయర్ "ఆ దర్పణాన్ని ఇతర వెబ్ పరికరాలను" అత్యంత కూల్ గా, అంటే 220 డిగ్రీ సెల్సియస్ వద్ద చల్లగా ఉంచుతుంది.
జేమ్స్ వెబ్ ను నాసా సంస్థ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీల సహకారంతో అభివృద్ధి చేస్తోంది. 1961 నుండి 1968 వరకు నాసాకు అధినేతగా ఉన్న జేమ్స్ ఇ. వెబ్ అనే శాస్త్రవేత్త కు గుర్తుగా దీనికి ఈ పేరు పెట్టారు. అతడు అపోలో స్పేస్ షిప్ ప్రాజెక్ట్ లో కూడా పనిచేసాడు. 2007 లో అంతరిక్షంలోకి పంపించాలనే లక్ష్యంతో 1996 లో వెబ్ టెలిస్కోప్ ను అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. కాని ఈ ప్రాజెక్టులో చాలా జాప్యం జరిగింది, వ్యయం పెరిగింది. 2005 లో దీని రూపకల్పనలో పెద్ద పెద్ద మార్పులు చేసారు. ఎట్టకేలకు 2016 నాటికి జేంస్ వెబ్ నిర్మాణం పూర్తయింది. తరువాత అనేక పరీక్షలు చేస్తూ ఈ టెలిస్కోప్ లక్ష కిలోమీటర్ల దూరం లో సరిగా పనిచేయగలదా లేదా అనే విషయాన్ని పరిశీలించారు... 2018 మార్చిలో చివరి సారిగా పరీక్ష చేస్తున్న సమయంలో టెలిస్కోపు కు అమర్చే షీట్ చినిగిపోవడంతో ప్రయోగం ఆలస్యమైంది. 2018 జూన్ లో ఒక "టెస్టింగ్ సంస్థ" చేసిన రికమెండేషన్స్ కి అనుగుణంగా ప్రయోగాన్ని మళ్ళీ వాయిదా వేసారు. ప్రస్తుతం 2021 మార్చిలో ప్రయోగించాలని ప్రణాళిక వేసారు. నార్త్‌రోప్ గ్రుమ్మన్ అనే సంస్థ ఈ టెలిస్కోపు తయారీలో ప్రధాన కాంట్రాక్టరు గా ఉంది.
జెడబ్ల్యుఎస్‌టి బరువు హబుల్ స్పేస్ టెలిస్కోప్ బరువులో సగం ఉంటుంది. అయితే హబుల్ మిర్రర్ కన్నా వెబ్ మిర్రర్ ఐదు రెట్లు పెద్దది. భూమ్మీది టెలిస్కోపులు వాతావరణం లో ఉన్న దుమ్ము ధూళి ద్వారా చూడాలి. ఇది ఎంతో దూరం లో ఉన్న ఆబ్జెక్ట్ లను క్లియర్ గా చూడలేదు.. ప్రస్తుతం హబుల్ వంటి అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా కూడా కొంత దూరం వరకు ఉన్న నక్షత్రాలను, గెలాక్సీ లను మాత్రమే చూడగలుగుతున్నాము, ఎందుకంటే ఆ టెలిస్కోప్ తనకు తానుగా వేడిని తనచుట్టూ పుట్టిస్తూ ఉంటుంది.. ఆ వేడిగుండా అంతరిక్షం లోకి చూసినప్పుడు ఆబ్జెక్ట్స్ మసకగా కనిపిస్తాయి..
జెడబ్ల్యుఎస్‌టి భూమి నుండి సుమారు 15,00,000 కి.మీ. దూరాన ఉంటూ పనిచేస్తుంది. ప్రస్తుతం హబుల్ టెలిస్కోప్ భూమికి 550 కి.మీ. దూరాన, చంద్రుడికి సుమారు 4,00,000 కి.మీ. దూరాన ఉంది. వెబ్ టెలిస్కోప్ ఒకసారి లాంచ్ చేశాక మరమ్మతులు గానీ, హార్డ్‌వేరును అప్‌గ్రేడ్ చెయ్యడం వంటివి గానీ అసాధ్యం. సూర్యుడు, భూమి నుండి వెలువడే వేడి, కాంతి నుండి రక్షణగా ఒక కోల్డ్ షీల్డ్ ని వెబ్ లో ఉపయోగిస్తారు.
ఈ టెలిస్కోపు ప్రాజెక్టులో జరిగిన ఆలస్యం, వ్యయ పెరుగుదల మొదలైనవి హబుల్ స్పేస్ టెలిస్కోపు ప్రాజెక్టు లోనూ జరిగాయి. 1972 లో హబుల్ నిర్మాణం ప్రారంభమైనప్పుడు, దాని అభివృద్ధి వ్యయం 30 కోట్ల డాలర్లు అవుతుందని అంచనా వేసారు. కానీ 1990 లో దానిని కక్ష్యలోకి పంపించే సమయానికి, ఖర్చు దానికి నాలుగు రెట్లైంది. దానికి తోడు, కొత్త పరికరాలు, నిర్వహణ పనులతో కలిపి 2006 నాటికి మొత్తం ఖర్చు 900 కోట్ల డాలర్లకు చేరింది.
వెబ్ టెలిస్కోప్ పై ఫోకస్ పెట్టిన కారణంగా గతంలో తలపెట్టిన కొన్ని ఇతర అబ్జర్వేటరీలను రద్దు చేశారు.. 2006 నాటికి, జేమ్స్ వెబ్ ను అభివృద్ధి చేయడానికి 1 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఆ సమయానికి మొత్తం బడ్జెట్ 4.5 బిలియన్ డాలర్లు ఉంది. 2021 లో ప్రాజెక్టు అంచనా వ్యయం 10 బిలియన్లకు చేరుకుంది.
వెబ్ టెలిస్కోపుపై పెరుగుతున్న ఖర్చుల పైన, షెడ్యూల్లో జరుగుతున్న ఆలస్యం పైనా కొంతమంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు, అసలే అరకొరగా ఉన్న బడ్జెట్టు కోసం పోటీపడడం ద్వారా ఇది ఇతర అంతరిక్ష శాస్త్ర కార్యక్రమాలకు నిధులను అందనీయడం లేదు. ఉన్న బడ్జెటును మింగేస్తూ, ఇతర పరిశోధనల నుండి నిధులను మళ్లిస్తున్నందున, 2010 లో నేచర్ పత్రిక, జేమ్స్ వెబ్ ను "ఖగోళ శాస్త్రాన్ని మింగేస్తున్న టెలిస్కోపు"గా అభివర్ణించింది. నిజానికి ఇలాంటి ప్రాజెక్టు అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేయడం కష్టం.
జేమ్స్ వెబ్ కి నాలుగు ముఖ్యమైన లక్ష్యాలున్నాయి. బిగ్ బ్యాంగ్ తరువాత ఏర్పడ్డ తొలి నక్షత్రాలను పసిగట్టడం, గెలాక్సీల నుండి వెలువడ్డ కాంతిని వెతకడం, తొలి గెలాక్సీల నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకోవడం, వాటి పరిణామాలను అధ్యయనం చెయ్యడం, నక్షత్ర, గ్రహ వ్యవస్థల ఏర్పాటు అధ్యయనం, జీవావిర్భావాన్ని అధ్యయనం చెయ్యడం వంటి లక్ష్యాలు ఈ ఎబ్ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవాలని లక్ష్యం గా పెట్టుకున్నారు..
జేమ్స్ వెబ్‌ను 2021 మార్చి 30 న ఫ్రెంచ్ గయానా నుండి "ఏరియాన్ 5" రాకెట్‌పై ప్రయోగించాలని నిర్ణయించారు.
ఒక ఖగోళ వస్తువు ఎంత ఎక్కువ దూరంలో ఉంటే, అంత తక్కువ వయసులో ఉంటుంది.. అందువల్ల దాని మొదటి దశలలో ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు.. దాని కాంతి భూమిని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం దాని పూర్వ స్థితిని తెలుసుకోవచ్చు.
ఈ టెలిస్కోప్ ను ప్రయోగించిన దాదాపు ఒక నెల తరువాత, గుర్తించిన పాయింట్ వద్ద ఒక ప్రత్యేకమైన కక్ష్యలోకి పంపించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తారు.
మీకు ఇవి తెలుసా?
- మనం కాంతి వేగం తో ప్రయాణించగలిగితే మన వయస్సు ఎన్నటికీ పెరగదు..
- భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ "సగటేరియస్ ఆ" అనే ఒక బ్లాక్ హోల్ చుట్టూ తురుగుతుంది..
- బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న సూర్యుడు క్రితం సారి పరిబ్రమణం లో ఉన్న స్థానానికి ఇప్పుడు మళ్ళీ చేరుకుంది.. ఇదే సమయం లో డైనోసార్స్ అంతరంచాయి..
- ఇప్పటివరకూ భూమిచుట్టూ తిరిగే స్యాటిలైట్స్ ని మాత్రమే ప్రయోగించాము.. మొదటిసారిగా వెబ్ టెలిస్కోప్ సూర్యుని చుట్టూ తిరిగేలా ప్రయోగించబోతున్నారు..
- మనం ఒక్క క్షణంలో కొన్ని లక్షల లైట్ ఇయర్స్ దూరం వెళ్ళి ఒక అతిపెద్ద టెలిస్కోప్ ద్వారా భూమిపైకి చూడగలిగితే డైనోసార్స్ యుగం ప్రత్యక్షంగా చూడవచ్చు.. అంటే గతించిన కాలం మనం చూడవచ్చు..
- అనంతమైన విశ్వం ఇంకా విస్తరిస్తూనే ఉంది..
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments