నో షేవ్ నవంబర్ అంటే ఏంటి?

img

నో షేవ్ నవంబర్ అంటే ఏంటి?

దీని రూపకర్తలు ఎవరు?

ఆశక్తి కలిగించే నో షేవ్ నవంబర్ అసలు కధ తెలుసుకుందాం రండి..

నో షేవ్ నవంబర్ అంటే ప్రతి ఏటా నవంబర్ నెల మొత్తం ప్రపంచ వ్యాప్తంగా గడ్డం గీసుకోకూడదు.. అంటే ఒక నెలలో షేవింగ్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు లెక్కకట్టి ఆ మొత్తాన్ని నోషేవ్ డాట్ ఓఅర్జీ అనే స్వచ్చంధ సంస్థకి డొనేట్ చెయ్యాలి.. అయితే ఈ డబ్బు ఎవరికి వెళుతుంది? ఈ డబ్బు ఎందుకోసం ఖర్చు చేస్తారు ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అమెరికాలో మ్యాథ్యూ హిల్ అనే వ్యక్తి 2007 న క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.. అతని కుమారులను ఈ సంఘటణ బాగా కలచివేసింది.. క్యాన్సర్ తో మరణించడం ఏంటి? ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ వ్యాధిబారిన పడి మరణిస్తున్నారు.. ఈ వ్యాధి సోకిన వారు మరనించకుండా ఏం చెయ్యలేమా? ఈ అంశం పై ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు.. క్యాన్సర్ వ్యాధిపై పరిశోధన చేసే సంస్థలకు డబ్బు ఇవ్వాలనుకున్నారు.. అయితే తామొక్కరే ఎంత సాయం చెయ్యగలరు? అందుకే ప్రపంచం లో తమలాగే ఆలోచించే వారందరితో ఒక కార్యక్రమం ద్వారా డబ్బులు పోగేసి క్యాన్సర్ పై పోరాడే సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.. ఈ ఆలోచననుండి పుట్టిందే నో షేవ్ డాట్ ఓఅర్జీ..  ఈ వెబ్ సైట్ లో ఒక నెల పాటూ షేవింగ్ కి అయ్యే ఖర్చు మొత్తాన్నీ దాచి డొనేట్ చెయ్యాల్సి ఉంటుంది.. ఇది నవంబర్ నెల కాబట్టి ఇప్పటికే ఈ కార్యక్రమం 2020 కి గానూ మొదలైంది.. ప్రపంచ వ్యాప్తంగా యువకులు గడ్డం గీసుకోకుండా పెంచేసుకుంటున్నారు.. మరో వైపు అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమం పై ఆశక్తి చూపుతున్నారు.. వారికి గడ్డం ఉండదు కాబట్టి చేతులకు, కాళ్ళకు పెరిగే జుట్టుని పార్లర్ కి వెళ్ళి తీయించుకునేందుకు ఒక నెలలో అయ్యే ఖర్చును దాచి ఈ సంస్థకు డొనేట్ చేస్తున్నారు..

యువకులకు ఏదైనా కొత్తగా ఒక ఆలోచన వస్తే చాలు దాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి దాన్ని విజయవంతం చెయ్యడం సాధారణం అయిపోయింది.. సరదాలకే కాదు ఇలాంటి మంచి పనులకు కూడా యువత స్పందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.. 

సో, అర్ధమయ్యిందిగా మీరు కూడా ఆశక్తి ఉంటే వెంటనే  ఈ కార్యక్రమం లో పాల్గొని గడ్డం, మీసం పెంచేసి లేదా బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం మానేసి డబ్బుని వారికి దానం చేయండి, క్యాన్సర్ పై పోరాటానికి మీ వంతు సాయం అందించండి.. 

మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఇలాంటి నయం కాని వ్యాధులతో పాటూ వాతావరణ పరిరక్షణ వంటి అనేక ప్రపంచ వ్యాప్త సమస్యలకు పెద్ద పెద్ద నాయకులందరూ ఒకటిగా చేరి పరిష్కారాలకు నడుం బిగిస్తే ఇలాంటి సమస్యలన్నీ సులభంగా తొలగిపోతాయి.. ప్రపంచ జనాభా అందరూ తమ తమ ప్రభుత్వాలకు కడుతున్న పన్నుల డబ్బుని సక్రమంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో వినియోగిస్తే మనిషికి లొంగని ఏ సమస్యలూ భూమ్మీద ఉండవు..  మరి అలాంటి నాయకత్వం ఇప్పుడు లేకనే కదా ఈ బాధంతా.. యుద్ధ సామాగ్రి తయారు చేయడానికి మాత్రం బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారుగానీ సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ మానవాళిని కబళించే సమస్యలకు అందరూ ఒక్కటై పోరాడడానికి మాత్రం ముందుకు రారు.. అందుకే ప్రపంచం లో ఉన్న అన్ని ప్రజాస్వామ్య దేశాలలోని ప్రజలు మంచి నాయకులకు పట్టం కడితే పరిస్థితుల్లో మార్పు వస్తుంది అని మా అభిప్రాయం.. ఏమంటారు?  

మరిన్ని

Comments

0 Comments

అంతర్జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()