మొదట చైనా పప్పెట్, తర్వాత మిలిటరీకి సరెండర్

img

మొదట చైనా పప్పెట్,

తర్వాత మిలిటరీకి సరెండర్,

ఇప్పుడు అతివాదులకు సలాం..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి చివరకి పట్టబోయే గతేంటి? 

తాజా పరిణామాల నేపధ్యం లో పాకిస్తాన్ ఏం కాబోతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం..

క్రికెటర్ నుండి పొలిటిషియన్ గా మారి, 2018 లో ప్రధానిగా భాద్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రజలకు ఎన్నికల సంధర్భంగా అనేక వాగ్దానాలు చేశారు. వాటిలో ముఖ్యంగా 

  1. మీరు సరికొత్త పాకిస్తాన్ ను చూడబోతున్నారు..
  2. 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపిస్తాను..
  3. ఆర్ధికాభివ్రుద్ధి..
  4. ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ కి వచ్చిన చెడ్డపేరును రూపుమాపుతాను..
  5. ఇస్లాం కమ్యూనిటీకి సరికొత్త నిర్వచనం ఇస్తాను..

ఇవీ ఇమ్రాన్ ఖాన్ తన ప్రజలకు చూపించిన ఆశలు.. అయితే నేడు ఈ అంశాలలో ఏవక్కటీ నెరవేర్చకపోగా ప్రజల జీవనప్రమాణాలను మరింత దిగజార్చి పాకిస్తాన్ చరిత్రలోనే మరో పనికిమాలిన ప్రధానిగా పేరు తెచ్చుకున్నాడు.. అందుకు ఇమ్రాన్ ఖాన్ చేసిన నిర్వాకాలు ఒకసారి చూద్దాం..

మొదట పాకిస్తాన్ మిలిటరీ కి దాసోహం అయ్యాడు.. వారు చెప్పినట్టు వింటూ తలాడించాడు.. ఆ తర్వాత చైనా పప్పెట్ లా మారిపోయాడు..

దీనికి కొనసాగింపుగా దేశంలోని అతివాదులకు కూడా వత్తాసుపలుకుతూ వారికి కూడా సరెండర్ అయిపోయాడు..

2018 లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చూద్దాం.. ఆసియా బీబీ అనే క్రిష్టియన్ మహిళ మతపరమైన విమర్శలు చేయడం వల్ల పాకిస్తాన్ సుప్రీం కోర్టు 2009 లో ఆమెకు మరణ శిక్ష విధించింది.. అయితే 2018 లో సరైన ఆధారాలేవీ లేవంటూ విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.. దీంతో పాకిస్తాన్ వీఢుల్లో అల్లర్లు చెలరేగాయి.. 3 రోజులపాటూ పాకిస్తాన్ స్థంభించింది..  ఆ తర్వాత ఏడాదిలో ఆమె కెనడాకు చేరుకుని తన ఫ్యామిలీని కలుసుకోగలిగింది..

2020 లో మల్లీ ఇలాంటి సంఘటనపై పాకిస్తాన్ లో అలజడి మొదలైంది.. ఇస్లాం ను కించపరుస్తూ ఫ్రాన్స్ లో ఒక కార్టూనిస్ట్ ఒక చిత్రాన్ని వేయడం పై ఖాదిం హుస్సేన్ అనే అతివాది నిరసన వ్యక్తం చేశాడు..  అతడి ఫాలోవర్స్ రావల్పిండి లో చర్చలు జరిపి ఇస్లామాబాద్ బోర్డర్ కి చేరుకున్నారు.. దీంతో చేసేది లేక ఇమ్రాన్ ఖాన్ వారితో చర్చలు జరిపి ఫ్రాన్స్ తో జరగాల్సిన అనేక అభివ్రుద్ది ఒప్పందాలను విరమించుకుంటున్నట్టు అతివాద నాయకులతో అగ్రిమెంట్ చేసుకున్నాడు.. ఫ్రాన్స్ రాయబారిని కూడా పాకిస్తాన్ నుండి పంపించివేయాల్సి వచ్చింది.. ఫ్రెంచ్ వస్తువులు బాయ్కాట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు.. ఫ్రాన్స్, పాకిస్తాన్ కు మిలిటరీ తో సహా అనేక అంశాలలో ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది..

మొదట చైనా కు తలవంచి, ఇప్పుడు అతివాదులకు తలవంచిన పాక్ ప్రధాని, చివరకు ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించుకున్న పాకిస్తాన్ ప్రజలకు పంగనామం పెట్టాడు ఇమ్రాన్ ఖాన్.. 

ఇప్పటికే పలు పాకిస్తాన్ ప్రధానులు పదవీ విరమణ తర్వాత అనేక కష్టాలను ఎదుర్కోవడం మనం చూశాం.. చూడాలి, ఇమ్రాన్ ఖాన్ కి ఏగతిపడుతుందో... 

మరిన్ని

Comments

0 Comments

అంతర్జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()