బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు..
అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్..
నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య?
చైనా అధికారికంగా ప్రకటన?
భారత్ తీసుకోబోయే చర్యలేంటి?
ఈ ఆశక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రహ్మపుత్రా నది చైనా నుండి భారత్ లోకి ప్రవహించి బంగాళాఖాతం లో కలుస్తుంది.. అయితే గత మంగళవారం చైనా నీటి వ్యవస్థ సంభంధిత శాఖ అధినేత యాన్ జియాంగ్, బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యాం నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేసినట్టు, పనులు త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్టు వెళ్ళడించారు.. దీంతో వెంటనే అలెర్ట్ అయిన భారత సంభంధిత అధికారి టీ యస్ మెహరా, ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశం పై చర్చించారు.. ఈ డ్యాం వలన భారత్ కు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.. ఈ డ్యాం ను "నది ప్రవాహం" లో భాగంగా ఒక ప్రమాదకర మలుపుకు చేరుకున్న ప్రాంతం లో నిర్మించాలని చైనా తలపెట్టింది.. ఆ ప్రాంతం లో డ్యాం గనక నిర్మిస్తే అది ప్రక్రుతికి విరుద్దమని, అది కాలక్రమం లో నది యొక్క ప్రవాహ తీరు తెన్నులను ప్రభావితం చేసి భౌగోళిక పరిస్థితులపై ప్రభావితం చూపుతుందని అన్నారు.. పైగా నది యొక్క మనుగడకే ఈ డ్యాం ప్రశ్నార్ధకం కాగలదని ఆందోళన వ్యక్తం చేశారు..
మరొ పక్క చైనా ఈ డ్యాం నిర్మాణం పూర్తయ్యాక ఉద్దేశ్యపూర్వకంగా ఒకేసారి నీటిని ఈ డ్యాం ద్వారా విడుదల చేస్తే గనక దిగువనున్న అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ముంపు ప్రమాదం ఏర్పడగలదని చెబుతున్నారు.. అదే సమయం లో నీరు అస్సలు దిగువకు విడుదల చెయ్యకుండా అడ్డుపడితే మాత్రం అనావ్రుష్టి సమస్యలు తలెత్తవచ్చని తెలుస్తోంది.. ఇన్ని సమస్యలకు కారణం కానున్న ఈ చైనా డ్యాం ను అడ్డుకోవాలా? లేదంటే చర్చించి పరిష్కరించుకోవాలా అనే సందిగ్ధం లో భారత్ ఉంది.. మరో పక్క ఇప్పటికే బోర్డర్ టెన్షన్ లతో అట్టుడుకుతున్న చైనా, భారత్ లకు ఇది మరో సమస్య గా పరిణమించే అవకాశం లేకపోలేదు.. ఎందుకంటే ఈ డ్యాం చైనా, భారత్ సరిహద్దు లో అతి సమీపం లో నిర్మించ తలపెట్టారు..
బంగ్లాడేశ్ కు చెందిన షేక్ రొకోన్ అనే పర్యావరణ వేత్త కూడా ఈ అంశం పై ఆందోళన లో ఉన్నారు.. ఏది ఏమైనా ఈ డ్యాం కు ప్రత్యామ్న్యాయంగా భారత్ కూడా యుద్ధ ప్రాతిపదికన భారత్ భూభాగం లో మరో అతి పెద్ద డ్యాం ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. బ్రహ్మపుత్ర నీటిని అతి జాగ్రత్తగా వాడుకునే విధంగా ఈ డ్యాం ఉండబోతున్నట్టు తెలుస్తోంది..
ఇప్పటికే భారత్ బోర్డర్ వెంట అనేక హైవే లు, రైల్వే నిర్మాణాలు ఏర్పాటు చేయడం తో పాటూ అనేక ఆర్మీ ఫోర్స్ లను భారత భూభాగం లోకి చొచ్చుకు వచ్చేశాయి.. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత ప్రభుత్వం, రోజు రోజుకీ చైనా అవినీతి, అహంకార పూరిత వ్యవహారాలను చూసి మరింత అసహనానికి గురవుతోంది.. చైనా ను యుద్ద మైదానం లో ఢీకొట్టి విజయం సాధించాలనే కసి భారత ఆర్మీకీ, ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఎదుగుతున్న భారత దేశానికి యుద్ధ నష్టం పెద్ద అడ్డంకి కాగలదని ఒక అభిప్రాయం ఉంది.. అందుకే డిప్లొమాటిక్ గా వివిధ ఆగ్ర దేశాల మద్దతు కూడ గడుతూ చైనా దుశ్చర్యలను ప్రపంచ వ్యాప్తంగా ఎండగడుతున్నా చైనా కు ఏమాత్రం సిగ్గు రావడం.. తన వేషాలు తాను వేస్తూనే వుంది.. పైగా భారత్ ఈ విషయం పై ప్రపంచానికి చెప్పినప్పుడు చైనా ను విమర్శించి మళ్ళీ మిన్నకుండడం వల్ల ఆ పద్దతికూడా అంత ప్రయోజనకరంగా లేకుండా పోతోంది..
ఇంతకీ చైనాకు చెక్ పెట్టడానికి మేలైన మార్గం ఏమిటని మీరు అనుకుంటున్నారు?
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
మొదట చైనా పప్పెట్, తర్వాత మిలిటరీకి సరెండర్, ఇప్పుడు అతివాదులకు సలాం.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి చివరకి పట్టబోయే గతేంటి? తాజా పరిణామాల నేపధ్యం లో పాకిస్తాన్ ఏం కాబోతోంది? ఈ వీడియోలో...
0 Comments