ప్రపంచం లో అరుదైన వింతలు పార్ట్ 2
ప్రపంచం అనేక వింతల మయం.. వాటిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.. అలాంటి ఆశక్తికరమైన పది విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- మెట్రిక్ విధానాన్ని ఉపయోగించని మూడు దేశాలు ఏవో తెలుసా? సరళత కొరకు, ప్రపంచంలోని 200 కంటే ఎక్కువ దేశాలలో పొడవు లేదా ద్రవ్యరాశి వంటి వాటిని వివరించేటప్పుడు మెట్రిక్ పద్దతిని ఉపయోగిస్తారు. ఏదేమైనా, లైబీరియా, మయన్మార్ మరియు యునైటెడ్ స్టేట్స్ అనే మూడు దేశాలు మాత్రం ఈ విధానాన్ని ఉపయోగించవు.. 2018 లో లైబీరియా వాణిజ్య, పరిశ్రమల మంత్రి విల్సన్ టార్పెహ్ మాట్లాడుతూ, వాణిజ్యంలో జవాబుదారీతనం మరియు పారదర్శకతను ప్రోత్సహించడానికి మెట్రిక్ విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. సో త్వరలో ఈ సంఖ్య రెండుకు చేరనుండి..
- భూ గ్రహం మీద ఒక స్థలం యొక్క "పొడవైన పేరు" మీకు తెలుసా? న్యూజిలాండ్‌లోని ఒక ప్రాంతం లో నివసిస్తున్న వారి చిరునామాను వ్రాసేటప్పుడు వారు పడే కష్టం అంతా ఇంతాకాదు.. 85 అక్షరాల పొడవుతో, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన స్థలం పేరు. మీరూ ఒకసారి ఆ పేరు ని చదవడానికి ట్రై చెయ్యండి.. *******
- ప్రపంచం లో ప్రతి సెకనుకు నలుగురు పిల్లలు పుడతున్నారా? ప్రతి నిమిషానికి సుమారు 250 జననాలు, ప్రతి గంటకు 15,000 మరియు ప్రతి రోజు 360,000 జననాలు ఉన్నాయని లెక్క తేలుతోంది. పూర్తిగా ఒక సంవత్సరంలో, భూమిపై 131.4 మిలియన్ల పిల్లలు పుడతారని ఎకాలజీ గ్లోబల్ నెట్‌వర్క్ తెలిపింది.
- మీరు చలి గాలి మరియు పొగమంచు గాలులకు అలవాటు పడ్డారని అనుకోవచ్చు, కాని సగటు లెక్క చూసుకుంటే చరిత్రలో ఒక రోజు ఇప్పటి వరకు అతి శీతలమైన రోజు "మైనస్ 144 డిగ్రీల ఫారెన్‌హీట్" గా నమోదైంది. 2004 మరియు 2016 మధ్య పరిశోధనల సమయంలో ఈ ఉష్ణోగ్రత అంటార్కిటికాలో నమోదైంది. ఆ ఉష్ణోగ్రత వద్ద మీ ఊపిరితిత్తులలో రక్తస్రావం అయ్యే అవకాశం ఉండడంతో పాటూ ప్రాణాలకే ప్రమాదం...
- భూమి యొక్క ఓజోన్ పొర పూర్తిస్థాయిలో కోలుకుంటుందా? కాలుష్యం కారణంగా, భూమి యొక్క ఓజోన్ పొర ఇప్పటికే చాలా నష్టపోయింది. పలుచనైన ఈ వాయువు పొర మన గ్రహాన్ని సూర్యుడి హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి మనలను కాపాడుతుంది. అదృష్టవశాత్తూ, ఐక్యరాజ్యసమితి నుండి విడుదలైన 2018 నివేదిక ప్రకారం, ఓజోన్ పొర కు జరిగిన డ్యామేజీ గత 50 సంవత్సరాలలో పూర్తిగా నయం కాబడుతుందని వాతావరణ మార్పుల పరిశోధనా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- "జపాన్" ప్రపంచంలో అత్యధిక భూకంపం సంభవించే దేశమా?.చిన్న ప్రకంపనల నుండి భారీ విధ్వంసానికి కారణమయ్యే భూకంపాలు మనం చూస్తూ ఉంటాం. కానీ చైనా, ఇండోనేషియా, ఇరాన్ మరియు టర్కీ వంటి దేశాలలో నివసించేవారికి ఇది సాధారణం. అయితే, యు.ఎస్. జియోలాజికల్ సర్వే ప్రకారం, "జపాన్" ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలను నమోదు చేసింది. ఇది సముద్రం లో ఏర్పడే భూకంపాలకు కూడా వణికిపోతూ ఉంటుంది..
- భూమిపై సుమారు 4 క్వాడ్రిలియన్ బ్యాక్టీరియాలు ఉన్నాయని మీకు తెలుసా? అయితే అన్ని బ్యాక్టీరియాలూ చెడ్డవి కావు. వాస్తవానికి, వీటిలో కొన్ని మనకు మంచి చేస్తాయి మరియు వివిధ పద్దతుల్లో ప్రపంచానికి సహాయపడతాయి.
- ప్రస్తుతం జీవించి ఉన్న ప్రజలు భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ నివసించిన మొత్తం జనాభాలో ఎంత శాతమో తెలుసా? పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో ప్రకారం, 50,000 సంవత్సరాల క్రితం హోమో సేపియన్స్ మొదటిసారిగా ఈ భూమిపై నివసించడం మొదలుపెట్టిన రోజు నుండి, వివిధ జాతుల రూపం లో 108 బిలియన్లకు పైగా జన్మించి మరణించారు. ఈ సంఖ్యలో అతి ఎక్కువ భాగం ప్రస్తుతం సజీవంగా ఉంది. ఈ రోజు జీవించి ఉన్న వారి సంఖ్య ఇప్పటివరకు నివసించిన మొత్తం మానవులలో ఏడు శాతం గా ఉందని తెలుస్తోంది..
- ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు "ముహమ్మద్" ఎందుకయ్యింది? జాన్, జేమ్స్, మేరీ మరియు జేన్, రాం, రాహుల్ ల పేర్లు తరచుగా వింటుంటాం.. కానీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు "ముహమ్మద్" అని ఒక సర్వేలో తేలింది. ఇండిపెండెంట్ పత్రిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల మంది పురుషులు మరియు బాలురు ఈ పేరును కలిగి ఉన్నారు. ఇస్లామిక్ ప్రవక్త భూమిపై నడయాడిన తర్వాత "ప్రతి ఒక్క తల్లిదండ్రులు మొదటి కుమారుడికి ఈ పేరు పెట్టడం ముస్లిం సంప్రదాయం".. అందుకే ఈ పేరు మొదటి స్థానాన్ని ఆక్రమించింది..
- కేవలం రెండు దేశాలు తమ జాతీయ జెండాలలో ఊదా రంగును ఉపయోగిస్తాయి. నికరాగువా దేశ జెండా మధ్యలో ఇంద్రధనస్సు కలిగి ఉంది, డొమినికా జెండా సిస్సెరో చిలుక, ఊదా రంగు ఈకలతో ఉన్న పక్షి యొక్క చిత్రాన్ని ఆ జెండా కలిగి ఉంది.
మరిన్ని
0 Comments