ప్రపంచం లో ఆశక్తికర పది అంశాలు తెలుసుకుందామా?
ప్రపంచం అనేక వింతల మయం.. వాటిని తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.. అలాంటి ఆశక్తికరమైన పది విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- ఉత్తర కొరియా మరియు క్యూబా దేశాలలో కోకాకోలా ఎంతవెతికినా దొరకదు.. కారణం? ఈ దేశాలపై యు.ఎస్. వాణిజ్య ఆంక్షలు విధించిన కారణంగా అక్కడ ఆ రెండు కూల్ డ్రింక్స్ దొరకవు.. అయితే, బాగా ప్రయత్నిస్తే దొరుకుతుంది అని అక్కడ ఉన్న కొందరు చెప్తారు.. కానీ ఖరీదు మామూలుగా ఉండదు. వీరు దొంగచాటుగా పొరుగు దేశాలైన మెక్సికో లేదా చైనా నుండి ఈ డ్రింక్స్ ని దిగుమతి చేసుకుంటారు..
- ప్రపంచ జనాభా మొత్తం లాస్ ఏంజిల్స్ లో సరిపెట్టవచ్చు: ప్రపంచం మొత్తం జనాభా 7.5 బిలియన్లకు పైగా ఉంది. నేషనల్ జియోగ్రాఫిక్ లెక్క ప్రకారం, భూమిపైన ఉన్న అందరూ భుజం భుజం ఆనుకుని నిలబడితే, వారందరూ లాస్ ఏంజిల్స్ యొక్క 500 చదరపు మైళ్ళ పరిధిలో సరిపోతారని తేలింది..
- కవలలు చాలా అరుదుగా ఉంటారు అని మీరు అనుకోవచ్చు.. కానీ ఇప్పుడు ఇది సాధారణం అయిపోయింది.. "సుమారు 1915 నుండి, తీసిన గణాంకాల ప్రకారం, 1980 వరకు పుట్టిన ప్రతి 50 మంది శిశువులలో ఒకరు కవలలు, అంటే దాదాపు 2 శాతం చొప్పున ఉన్నారు" ఆ తర్వాత ఈ సంఖ్య పెరగడం ప్రారంభమైంది.. 1995 నాటికి ఇది 2.5 శాతంగా ఉంది. ఈ రేటు 2001 లో 3 శాతానికి మించి 2010 లో 3.3 శాతానికి చేరుకుంది. అంటే పుట్టిన ప్రతి 30 మంది శిశువులలో ఒకరు కవలలు.. ఒకానొక టై లో వృద్ధ మహిళలకు ఎక్కువ కవలలు ఉండటమే ఈ ధోరణికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ వంటి సంతానోత్పత్తి చికిత్సలు కూడా దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
- ప్రపంచంలో అత్యంత వేడి మిరపకాయ ఏమిటో తెలుసా? "నేను నా నాలుక కొనపై ప్రయత్నించాను, అంతే నాలుక కాలిపోయింది" అని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పాటు ఈ డ్రాగన్స్ బ్రీత్ ను కనుగొన్న మైక్ స్మిత్ కూడా అన్నారు. ఇంతకీ అటువంటి అసాధ్యమైన మిరపకాయ వంగడం ఎలా అందుబాటులోకి వచ్చింది? అంటే, కొన్నేళ్ళ క్రితం వైద్య చికిత్సలో భాగంగా మత్తు మందుగా ఉపయోగపడుతుందని దీన్ని పరిశోధన శాలలో అభివ్రుద్ది చేశారు.. ఇది చర్మాన్ని తిమ్మిరిగా ఉండేటట్టు చేస్తుంది... ఈ మిరపకాయ ఒక్కటి తింటే ప్రాణానికే ప్రమాదం..
- ఇతర దేశాల కంటే ఎక్కువ మంది ప్రజలు ఫ్రాన్స్‌ను సందర్శిస్తారు. ఎందుకు ? ఎందుకంటే ఫ్రాన్స్ ఒక అందమైన దేశం, రుచికరమైన వైన్లు, చిక్కని జున్ను మరియు శృంగార కార్యకలాపాలకు ఫ్రాన్స్ పెట్టింది పేరు.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ మంది ప్రజలు ఫ్రాన్స్‌ను సందర్శించడంలో ఆశ్చర్యం లేదు... 2017 లో ఈ యూరోపియన్ దేశం 86.9 మిలియన్ల టూరిస్టులను అక్కున చేర్చుకుంది. 81.8 మిలియన్ల సందర్శకులతో స్పెయిన్ రెండవ స్థానంలో ఉంది, తరువాత యునైటెడ్ స్టేట్స్ (76.9 మిలియన్లు), చైనా (60.7 మిలియన్లు) మరియు ఇటలీ (58.3 మిలియన్లు) టూరిస్ట్ స్పాట్స్ గా ప్రసిద్ది చెందాయి..
- ప్రపంచంలో అత్యంత జనసాంద్రత కలిగిన ద్వీపం రెండు సాకర్ మైదానాల పరిమాణం కు సమానం: కొలంబియా తీరంలో శాన్ బెర్నార్డో ద్వీప సమూహంలోని శాంటా క్రజ్ డెల్ ఇస్లోట్ "రెండు సాకర్ మైదానాల పరిమాణం" మాత్రమే ఉంటుంది, కానీ ఈ కృత్రిమ ద్వీపంలో నాలుగు ప్రధాన వీధులు మరియు 10 పొరుగు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ద్వీపంలో సుమారు 155 ఇళ్లలో ఐదు వందల మంది నివసిస్తున్నారు. చాలా మంది ప్రజలు ఇంత చిన్న స్థలంలో నిండి ఉండటంతో, ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ద్వీపం అని "ది గార్డియన్" పత్రిక తాజాగా తెలియజేసింది..
- కానరీ ద్వీపాలకు పక్షుల పేర్లు కాకుండా కుక్కల పేర్లు ఎందుకు పెట్టారు? కానరీ ద్వీపాలకు కానరీ పక్షులు అక్కడ ఉండడం కారణంగానే ఆ పేరు పెట్టారని అనుకుంటారు చాలామంది.. కానీ ఈ ప్రదేశానికి కుక్కల పేరు పెట్టారు. ఇది వాయువ్య ఆఫ్రికా తీరంలో ఉన్నప్పటికీ, ఈ ద్వీప సమూహం వాస్తవానికి స్పెయిన్‌లో ఒక భాగం. స్పానిష్ భాషలో, ఈ ప్రాంతం పేరు "ఇస్లాస్ కానరియాస్".. ఈ "ఐలాండ్ ఆఫ్ డాగ్స్" పేరు లాటిన్ వొక్యాబులరీ లోని "కానరియా ఇన్సులే" నుండి వచ్చింది.
- ఇండోనేషియా ప్రపంచంలోని అతిచిన్న వ్యక్తులకు నిలయమా ? ప్రతిచోటా చిన్న వ్యక్తులు మరియు పొడవైన వ్యక్తులు ఉన్నప్పటికీ, ఇండోనేషియా ప్రపంచంలోని అతిచిన్న వ్యక్తులకు నిలయంగా ఉంది, 2017 లో టెలిగ్రాఫ్ సేకరించిన డేటా ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. అక్కడ స్త్రీ పురుషులను పరిగణ లోనికి తీసుకున్నప్పుడు, సగటు ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు. బొలీవియాలోని ప్రజలు ఎత్తుగా ఉండరు. ప్రపంచం లో ఎత్తైన ప్రజలు నెదర్లాండ్స్‌లో నివసిస్తున్నారు, ఇక్కడ సగటు ఎత్తు 6 అడుగులు.
- వాతావరణ మార్పులపై తయారు చేసిన "పారిస్ ఒప్పందం" పై ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో వివిధ దేశాలు సంతకాలు చేశాయి, ఎందుకు? న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (యుఎన్) ప్రధాన కార్యాలయంలో 2016 లో 174 మంది ప్రపంచ నాయకులు పారిస్ ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, ఒకే రోజున ఏదైనా సంతకం చేయడానికి కలిసి వచ్చిన దేశాలలో ఇది అత్యధిక సంఖ్య గా ఉందని యుఎన్ తెలిపింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి మరియు ప్రపంచ వాతావరణ ప్రయత్నాలను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు మరియు పెట్టుబడులను వేగవంతం చేయడం మరియు తీవ్రతరం చేయడం గురించి తయారు చేసిన ఈ ఒప్పందం అందరికీ ఆమోద యోగ్యమయ్యింది..
- ప్రపంచంలోని నిశ్శబ్ద గది వాషింగ్టన్ రాష్ట్రంలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉంది, ఎందుకో తెలుసా? వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఈ ప్రయోగశాల గది "మైనస్ 20.35 డిబిఎ" యొక్క శబ్దాన్ని కొలుస్తుంది, ఇది మానవ వినికిడి స్థాయి అయిన 20 డెసిబెల్ కంటే తక్కువగా ఉంటుంది.. "ఎవరైనా ఆ గదిలోకి ప్రవేశించిన వెంటనే, ఒక వింత మరియు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది" అని స్పీచ్ అండ్ హియరింగ్ సైంటిస్ట్ మరియు మైక్రోసాఫ్ట్‌లోని అనెకోయిక్ ఛాంబర్ ప్రిన్సిపల్ డిజైనర్ "హుంద్రాజ్ గోపాల్" సిఎన్‌ఎన్ తో అన్నారు. మీరు మీ తల తిప్పినప్పుడు, ఆ కదలికను మీరు వినవచ్చు. మీరు ఊపిరి పీల్చుకోవడం కూడా ఇక్కడ వినవచ్చు.."
మరిన్ని
0 Comments