అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2020!

img

2019 అధికారిక లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 139 కోట్లు. ఇందులో మహిళల  సంఖ్యా 67 కోట్లు. అంటే దాదాపు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు, 930 మంది అమ్మాయిలు ఉన్నారు. గణాంకాలను పూర్తిగా విశ్లేషిస్తే  దేశంలో 48.2 % మహిళలు ఉన్నారు. ప్రపంచంలో స్థాయిలో మహిళా జనాభా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. “అంతర్జాతీయ మహిళా దినోత్సవంసంధర్భంగావేదికల మీద మన రాజకీయ  నాయకులు స్త్రీలు గురించి అసాధారణ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దేశంలో స్త్రీలు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు అని, మేము వారి అభ్యున్నతికి ఎన్నో  కార్యక్రమాలు చేస్తున్నాం అని గొప్పలు చెప్తూ ఉంటారు. మరీ వాళ్ళు చెప్పినట్టుగా దేశంలోని స్త్రీలందరు సంతోషంగా ఉన్నారా

మన దేశంలోమహిళా దినోత్సవ సంబరాలుపేపర్లు మరియు టీవీలలోని ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం దేశంలో మహిళలు తీవ్ర అణిచివేతకు గురి అవుతున్నారు, అన్నది నిజం. ఇండియాలో ప్రతి 10 మంది మహిళలో 6 గురు వేధింపులకు గురవుతున్నారు, అని గణాంకాలు తెలుపుతున్నాయి. లెక్కలను పక్కన పెట్టి, తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళల భద్రత గురించి ఒక సారి తెలుసుకుందాం

దేశంలోని మొత్తం సీసీ  కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షి టీమ్స్ ఏర్పాటు చేసింది. అటు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసందిశ పోలీస్  స్టేషన్స్ను ఏర్పాటు  చేసింది. ఇన్ని  చేసినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లోవెటర్నరీ డాక్టర్ దిశాపై జరిగిన అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. ఇంకా వెలుగులోనికి రాని కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పటికి  సమాజంలో స్త్రీలను తక్కువ స్థాయిలోనే చూస్తున్నారు

వాస్తవానికి మహిళలు ప్రతి రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారుప్రధమంగా క్రీడారంగంలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. 1951 నుంచి జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ మహిళలు మొత్తం 698 పతకాలు గెలిచారు. 2014, 2018లో జరిగిన  ఆసియా సమ్మర్ గేమ్స్ లో భారత మహిళలు 67 పతకాలు గెలిచారు. గణాంకాలను చూస్తేనే అర్ధం అవుతుంది, మహిళల శక్తి సామర్ధ్యాలు స్థాయిలు ఉన్నాయో అని. మార్చ్ 8 జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా క్రీడారంగంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు గురించి ఇప్పుడు  తెలుసుకుందాం.

23 ఏళ్లు వయసు ఉన్నద్యుతీ చంద్అథ్లెటిక్స్ లో భారతదేశ స్థాయిని అంతర్జాతీయ వేదికలు మీద సగర్వంగా నిలబెట్టిందిమహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడవ వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియాన్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. ఇది 1998 తర్వాత భారత్కు వచ్చిన తొలి అవార్డు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ద్యుతి... దేశంలో సమర్ధవంతమైన మహిళా క్రీడాకారిణిగా ఎదిగారు.

మానసి జోషి, పారా బ్యాడ్మింటన్ లో పేరుక సంచలనం 30 ఏళ్లు వయసు ఉన్నమానసి జోషి ప్రపంచంలోనే టాప్ ర్యాంక్ కలిగిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఒకరు.2018లో జకార్తాలో జరిగిన ఆసియాన్ పారా గేమ్స్లో కాంస్యం సాధించారు. తాజాగా స్విట్జర్లాండ్లోని బాజెల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లోమానసిబంగారు పతకం గెలుచుకున్నారు. చాలా  మందికి  తెలియని  విషయం ఏమిటంటే,  2011లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ఎడమ కాలును కోల్పోయారు. అయితే, ప్రపంచంలోనే ఉత్తమ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యేందుకు ఆమెకు వైకల్యం ఎప్పుడు  అడ్డురాలేదు.

ఆమె పంచ్  కొడితే ప్రత్యర్థి లేవడం అసాధ్యం. అదే రింగ్ లో నిలబడితే, అదొక రణరంగం. బాక్సింగ్ లో ఆమె ఒకబాద్ షా”. ఆమె మరివరో కాదుమేరీ కోమ్”  36 ఏళ్లు వయస్సు వున్న లేడీ బాక్సర్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎనిమిది ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు సాధించిన ఏకైక బాక్సర్ మేరీ కోమ్‌. ఆమె పాల్గొన్న ఏడు ఛాంపియన్షిప్స్లోనూ వరసగా పతకాలను కైవసం చేసుకుంది. ఆరుసార్లు ప్రపంచ, బాక్సింగ్లో ఒలింపిక్ పతకం గెలుచుకున్న ఏకైక మహిళ కూడా ఈమే. మేరీ కోమ్ రాజ్యసభకు నామినేటెడ్ సభ్యురాలు. ప్రపంచ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెను 'ఓలి' అనే బిరుదుతో సత్కరించింది

శాస్త్రసాంకేతిక రంగాలలో మహిళల  పాత్ర ఎప్పటికీ  మర్చిపోలేనిదిభారతదేశంలో మొట్టమొదటి వైద్య విద్యను అభ్యసించిన ఏకైక మహిళా ఆనంద్ భాయి జోషి. 1886 లో పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలోఆనంద్ భాయివైధ్య విద్యను అభ్యసించారు. ఆపై కొల్హాపూర్ లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్ లో వైద్యురాలిగా పనిచేస్తూ అనేక మంది రోగులకు సేవ చేసారు

భారతదేశ అమ్ములపొదలో ఉన్న అగ్ని సిరీస్ క్షిపణులను తయారు చేసింది ఒక మహిళ, అంటే మీరు నమ్మగలరా ? పురుషులకే సాధ్యం కానీ అగ్ని సిరీస్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించిన ఏకైక మహిళాటెస్సీ థామస్‌”. అగ్ని-వి క్షిపణి ప్రాజెక్ట్ కు టెస్సీ థామస్డైరెక్టర్. క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొట్ట మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త కూడా ఈమె. అందుకే టెస్సీ థామస్ను 'మిస్సైల్ లేడీ' అని పిలుస్తారు ఆమె లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు గ్రహీత కూడా

మరిన్ని

Comments

0 Comments

అంతర్జాతీయం

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()