కరోనా వైరస్ మొత్తం ప్రపంచమంతా విస్తరిస్తోంది. దీని వల్ల ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలానే భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ కనుక పిల్లలకి సోకితే కంగారు పడాల్సిందేమీ లేదంటున్నారు నిపుణులు. పిల్లల్లో వస్తే ఏ ఇబ్బంది రాదు అని వారు చెబుతున్నారు.
సరైన సపోర్టు కేర్ ఇందుకు తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇతర వయసు వారితో పోల్చుకుంటే పిల్లల్లో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలియజేశారు. చైనా సింగపూర్ కు చెందిన 1065 మంది కరోనా సోకిన పిల్లలు మీద జరిపిన అధ్యయనం లో వచ్చిన జర్నల్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురితమైంది.
సరైన సమయంలో ఇన్ఫెక్షన్ను గుర్తించి చికిత్స అందిస్తే వారు ఒకటి రెండు వారాల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే స్ట్రాంగ్ గా ఉండాలసింది ఆ సపోర్టివ్ కేర్ మాత్రమే. అంతే కానీ పిల్లల్లో ముంచేసే ప్రమాదం ఏమి ఉండదట. కాబట్టి పిల్లలకు కరోనా సోకినా అంతగా ఏమి కంగారు పడొద్దు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పావియాకి చెందిన అధ్యయనకారులు పరిశీలనలో సోకిన పిల్లల్లో జలుబు, దగ్గు వంటి ఈ లక్షణాలు బయట పడకుండా ఉండే వీలు ఉందని తేలింది.
వాంతులు విరోచనాలు లాంటి జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యల ద్వారా కూడా బయట పడతాయని అంటున్నారు. అంతే కాదట పరిస్థితి విషమించి నిమోనియా తో షాక్కు గురై మూత్ర పిండాల ఫెయిల్యూర్తో ఆస్పత్రిలో చేరి చికిత్స పూర్తిగా కోలుకునేలా డాక్టర్లు చేశారు అని చెప్పారు. ఒక్క చిన్నారి మరణం కూడా ఇప్పటి వరకు కూడా నమోదు కాలేదని తెలియజేశారు. కాబట్టి ఎటువంటి భయాందోళనలకు గురవ్వద్దని, పిల్లల తల్లిదండ్రులు కంగారు పడకుండా ఉండడం మంచిది అని వారి మాటల్లోనే స్పష్టం అవుతోంది.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments