కరోనా పై అనేక వార్తలు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్నాయి. అనేక పుకార్లు షికార్లు కొడుతున్నాయి. లాక్ డౌన్ అని ఇళ్లల్లో ఉండమంటే జనం కుదురుగా ఉండక అనేక అబద్ధాలని నిజాలుగా మార్చేందుకు సోషల్ మీడియాని ప్లాట్ ఫారంగా చేసుకుని అనేక వార్తలని పంపిస్తున్నారు. తాజాగా మరో వాటా వైరల్ అయ్యింది.
అయితే ఇది ఎంత వరకు నిజం? ఈ ప్రశ్నకి సమాధానం WHO చెప్పింది... అయితే ప్రశ్న ఏమిటి అంటే క్యాబేజీ వల్ల వైరస్ వ్యాపిస్తుందా...? ఈ వార్తా సోషల్ మీడియా లో హల్ చల్ అవుతోంది. క్యాబేజీని ఎవరు తినొద్దని దాని వల్ల కరోనా సులువుగా వ్యాపిస్తుంది అని కూడా చెప్పుకొచ్చారు.
ఈ ప్రశ్న కి WHO ఏమి చెప్పిందంటే ఇది ఎంత మాత్రము నిజం కాదు. అలానే క్యాబేజీ కూడా అన్ని కూరల్లాగే తీసుకోవచ్చు అని స్పష్టం చేసింది. వేడి నీళ్ళల్లో ఏ కూరలు కడిగినా కూడా వాటి నుండి ఏ వైరస్ ఇంకా ఉండకుండా పోతుంది అని చెప్పారు. సగం ఉడికించిన వాటిని తినకుండా పూర్తిగా వండిన వాటినే సేవించాలని చెప్పారు.
అంతే కానీ ఇలా క్యాబేజీ ద్వారా ఈ వైరస్ వచ్చే ప్రమాదం వస్తుంది అనే వార్తా నిజం కాదని కూడా WHO చెప్పింది. అలానే బేకరీ ఫుడ్ తినడం మంచిది కాదు. దాని వల్ల కరోనా వస్తుంది అన్నది కూడా WHO ఎప్పుడు చెప్పలేదు. కానీ వీళ్ళు చెప్పారు అన్న వార్తా కూడా ఫేక్ అని తెలియ జేసింది WHO .
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments