10th పాస్ ఆర్ ఫెయిల్ అయ్యాక వెంటనే చెయ్యాల్సిన పనులేమిటి?

img

చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి,  పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుందాం.. అలాగే పదో తరగతి అయ్యాక ఎలాంటి చదువులు మనకు అందుబాటులో ఉన్నాయి? అదే విధంగా టెంత్ అయ్యాక జాబ్ చెయ్యాలనుకుంటే? అనే అంశాలు వివరంగా తెలుసుకుందాం..

10th క్లాస్ తప్పితే లైఫ్ లో గెలవలేరా...?

  జీవితంలో ఎదగాలి అని అంతా అనుకుంటుంటారు. బాగా సంపాధించాలి అని కొంతమంది, డబ్బుతో పాటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకొంతమంది భావిస్తుంటారు. అందుకే మన తల్లితండ్రులు మన చిన్నప్పటి నుంచి, చదువుకుంటేనే బాగుపడతారు అని చెబుతుంటారు.

మన తల్లిదండ్రులు మనకు చెప్పే మాట "డాక్టర్ కావాలి" అనో లేదంటే  "ఐ .ఐ .టీ" లో సీట్ సంపాధించాలి అనో వత్తిడి తెస్తుంటారు. మరి కొంత మంది 6 వ తరగతికే ఐ .ఐ .టీ ఓరియెంటెడ్ అని ఏవేవో పేర్లు పెట్టి పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు.

అందరు పిల్లలూ ఒకలా ఉండరు, కొందరు చెప్పకపోయినా చదువుకుంటారు. కొందరు ఎంత చెప్పినా చదవరు.. ఎవరి శక్తి వాళ్లకి ఉంటుంది. అయితే కొంత వరకైనా చదువుకుంటే మంచిది. అసలు డిగ్రీ అనేది లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి పెద్ద అర్హత కూడా కాదు.. కనీసం డిగ్రీ ఉంటే మంచిది. పి.జి లు చేసి టైం వేస్ట్ చేసుకోవడం వృధా అంటారు నిపుణులు.

99 శాతం మంది డిగ్రీల మీద ప్రేమ ఉన్న వాళ్లు చదువుకుంటుంటారు. వాళ్లకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేయనీయాలి. అప్పుడు వాళ్లు అనుకొన్నది సాధిస్తారు. లేదంటే ఎటూ కాకుండా పోతారు. అమెరికన్ సొసైటీ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాళ్లంతా డిగ్రీ లేని వాళ్లే. ఇంకా అమెరికా లో ఐతే 99 శాతం సెలెబ్రెటీలకు డిగ్రీలు లేవు.

జీవితంలో పైకి రావాలి అంటే చదువు మాత్రమే ముఖ్యం కాదు.. కాలేజీలో మనం నేర్చుకునేది జనరల్ సబ్జెక్టు మాత్రమే. ప్రాక్టికల్ గా అదంతా మనకు ఉపయోగపడనిదే. కానీ ఏదన్నా జాబ్ చేయాలంటే దిగ్రీ సర్టిఫికేట్లు అడుగుతుంటారు.. అలాంటి సందర్భాల్లో మాత్రం ఆయా డిగ్రీ లు ఉపయోగపడతాయి... పై చదువులు చేయాలి అంటే ఆ సబ్జెక్టులో పట్టు ఉండాలి. డిగ్రీలలో నేర్చుకునేది బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రమే.

డిగ్రీ ఉండడం వలన మార్కులు వస్తాయి.. కొన్ని అంశాలపైన అవగాహన వస్తుంది.. అంత మాత్రానికి డిగ్రీ సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డిగ్రీ ఉపయోగపడుతుంది, కానీ ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచి అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. చదువు అనేది ఇక్కడ ఒక అర్హత మాత్రమే.

మార్కుల కోసం మాత్రమే కాలేజీలలో చదువుతుంటే అది ఏమీ ఉపయోగం ఉండదు.. మన టీచర్స్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్జెక్ట్ తెలుసుకుని పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవచ్చు. అందుకే కాలేజీ చదువులు మార్కుల కోసం, సర్టిఫికెట్ ల కోసం అని గ్రహించాలి. ఐతే కాలేజీకి పోకపోతే జీవితంలో ఎటువెల్లాలో, ప్రపంచంలో ఏం జరుగుతున్దో తెలుసుకోవచ్చు.. అలాగే పరీక్షలో ఫెయిల్ ఐతే ఏమీ చేయలేము అని అర్థం కాదు.

సొంత తెలివితేటల ముందర డిగ్రీ అనేది ఈరోజుల్లో అసలు లెక్కలోకి కూడా రాదు.. మారుతున్న సబ్జెక్టును ప్రాక్టికల్ గా నేర్చుకుంటేనే సక్సెస్ కాగలరు. మన ఊహలకి చదువుకి సంబంధం లేదు. 10th క్లాస్, ఇంటర్ నుండే మనకు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ కళలకు చదువుకు సంబంధం లేదు. మీ శక్తి సామర్ధ్యాలకి డిగ్రీతో సంబంధం లేదు.

మీ ఇమాజినేషన్ కు సర్టిఫికెట్ అనేది ఒక పేపర్ మాత్రమే. మీకున్న ప్యాషన్ ను అమలు చేయాలి అంటే కష్టపడాలి. ఓటమి ఎదురైనా ముందుకు సాగితే విజయం మీదే. మీకున్న ఇంటరెస్ట్ కి కాస్త కష్టపడితే చాలు, విజయం మీ వెనకే వస్తుంది.

ఇక ప్రస్తుత ప్రపంచం మారిపోతోంది, ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేదు, కానీ 90 లో ఉన్న వాళ్లే ప్రపంచంలో వస్తున్న కొత్త మార్పులకి కారణం. వాళ్లే సోషల్ మీడియా మార్పులకి ముందుకి తీసుకెళ్తున్నారు. ఫేసుబుల్ ,వాట్సాప్ తప్ప మిగతావి అన్నీ పాత తరానికి సంబంధించినవే. ఐతే కొత్త తరం సాయం తో అవన్నీ పరిగెత్తుతున్నాయి.

మీకు చదువు మీద ఇంటరెస్ట్ లేకపోతే బాధపడకండి, ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో అసలు మార్కులకు విలువ లేదు. బుర్రలో తెలివితేటలుంటే చాలు.. మనకున్న ఇంటరెస్ట్ లో మనం ఎక్సపెర్ట్ ఐతే చదువుకున్న వారికే మనం ఉద్యోగం ఇవ్వచ్చు. జీవితంలో నీకు ఏది కావాలన్నా కష్టపడాలి.. చమట చుక్క కార్చాలి. ఆలోచనకి రూపం ఇవ్వాలి. జీవితాన్ని గెలవాలి అంటే బయట ప్రపంచాన్ని చదవాలి. అంతా ఒక ఐడియా తో ముందుకు వెళ్తుంటే దానికన్నా బెటర్ ఐడియా మనం ఆలోచించాలి. అప్పుడే మనం జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మనం వెంక పడిపోతాం..

అమెరికా లాంటి దేశంలో చదువు అంటే భయం.. కానీ భారతదేశం లో డిగ్రీ అంటే కామన్.. ఇక్కడ పీజీలు చేసిన రోడ్ల మీద ఉంటారు, కాబట్టి కాలేజీలో ఉండగానే మనం ఎటువైపు వెళ్ళాలో ఆలోచించు కోవాలి. ఒకవేళ ఏం చేయలేకపోతే కనీసం మార్కులు ఐనా తెచ్చుకోవాలి అంటారు నిపుణులు.

కాబట్టి మీ ఇంటరెస్ట్ ఏమిటో మీరే తేల్చుకోండి. ఒకసారి పెద్ద వాళ్లని అడగండి, వాళ్ల అనుభవాలని తెలుసుకోండి. చదువు లేకుండా ఎవరన్నా గొప్ప వాళ్ళు అయ్యారా? చదువుకొని ఎవరన్నా వారికంటే తక్కువ జీతం తీసుకుంటున్నారా? అనేది తెలుసుకోండి.

ఇక్కడ మేము చెప్పేది ఒకటే.. చదువుకోవద్దు, డిగ్రీ అసలు అవసరం లేదు అని కాదు. మీరు చదువుకోలేక పోయినా మీ టాలెంట్ మీద బ్రతికే అవకాశాలు ఇక్కడ చాలానే ఉన్నాయి అని మీరు గ్రహిస్తే చాలు..

టెన్త్ తర్వాత కెరీర్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సుల్ని ఎంచుకోవాలి. తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఒత్తిడితో కోర్సుల్ని ఎంచుకుంటే తర్వాత కెరీర్‌‌లో ఇబ్బంది పడాల్సింది మీరే.

అందరి జీవితంలో క్రాస్ రోడ్స్. కెరీర్‌లో ఎలా మలచుకోవాలో టెన్త్ తర్వాత తీసుకునే నిర్ణయమే కీలకం. టెన్త్ పాస్ కాగానే ఇక కెరీర్‌లో ఎటు వైపు అడుగులు వేయాలో అన్న డైలమా చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. టెన్త్ తర్వాత ఎంచుకునే కోర్సులే కెరీర్‌ను నిర్ణయిస్తాయి. అందుకే పదో తరగతి పాస్ కాగానే కోర్సుల్ని, కెరీర్‌ను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సుల్ని ఎంచుకుంటేనే కెరీర్ కూడా హ్యాపీగా సాగిపోతుంది. లేదంటే కెరీర్ గందరగోళంగా మారడం ఖాయం. మరి మీరు కూడా టెన్త్ తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి? కెరీర్ ఎలా తీర్చిదిద్దుకోవాలన్న డైలమాలో ఉంటారు కొంతమంది.. అలాంటి వారు ఈ కెరీర్ ఆప్షన్స్‌ని పరిశీలించండి.

టెన్త్ తర్వాత ఈ కోర్సులు ఎంచుకోవచ్చు:

సైన్స్: మీకు సైన్స్ అంటే ఇష్టమా? అయితే టెన్త్ తర్వాత సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్‌తో కోర్సులు చేయొచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్, వైద్య రంగం వైపు వెళ్లాలనుకునేవాళ్లు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్, నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందొచ్చు. మ్యాథ్స్, సైన్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు.

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనమిక్స్, కామర్స్, బయాలజీ మొదలైనవి కూడా భవిష్యత్తుకి బాగా ఉపయోగపడతాయి..

కామర్స్: మీకు బిజినెస్ అంటే ఇష్టమా? అయితే కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. ఇంటర్‌లోనే సీఈసీ కోర్సులుంటాయి. చార్టెర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకోవాలి. కామర్స్‌లో బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి.

కామర్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు:

సీ ఈ సీ - సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్

హెచ్ ఈ సీ - హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్ లేదా కామర్స్

ఆర్ట్స్: సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషియాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఎంచుకోవాలి. జర్నలిజమ్, లిటరేచర్, సోషల్ వర్క్, టీచింగ్ ఫీల్డ్స్‌లో కెరీర్ తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంగ్వేజెస్ కోర్సులు చేయొచ్చు.

ప్రొఫెషనల్: పదో తరగతి తర్వాతే ప్రొఫెషనల్ కోర్సుల్నీ ఎంచుకోవచ్చు. డిప్లొమా, వొకేషనల్, సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ కోర్సులు చేయొచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయొచ్చు. టెక్నికల్ కోర్సులు ఇవే...

డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , మెకానికల్ ఇంజనీరింగ్

, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ , గార్మెంట్ టెక్నాలజీ , హోమ్ సైన్స్ , అగ్రికల్చర్ , అగ్రికల్చర్ ఇంజనీరింగ్

బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ కోర్స్ , డిప్లొమా ఇన్ ఇన్స్యూరెన్స్ అండ్ మార్కెటింగ్, టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్, ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్, హోటల్ ఆపరేషన్స్ కోర్స్, డెంటల్ టెక్నీషియన్ కోర్స్ మొదలైనవి..

మీరు టెన్త్ తర్వాత కెరీర్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగానే కోర్సుల్ని ఎంచుకోవాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఒత్తిడితో కోర్సుల్ని ఎంచుకుంటే తర్వాత కెరీర్‌‌లో ఇబ్బంది పడాల్సింది మీరే. అందుకే మీ అభిరుచితో పాటు మంచి భవిష్యత్తు ఉండే కెరీర్ ఎంచుకోవడం మంచిది. ఏమాత్రం అయోమయం ఉన్నా కెరీర్ కౌన్సిలర్‌ను కలిసి సలహాలు తీసుకోవాలి.

టెన్త్ తర్వాత జాబ్ చేయాలని ఉందా? అయితే ఈ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి:

డిఫెన్స్, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ రంగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి.

ప్రతీ వ్యక్తి జీవితంలో పదవ తరగతి చాలా కీలకం. ఉన్నత చదువులైనా, ఉపాధి అవకాశాలైనా కెరీర్‌ మలుపు తిరిగేది టెన్త్ తర్వాతే. పదో తరగతి ఫలితాలు రాగానే విద్యార్థులకు అనేక అనుమానాలు, సందేహాలుంటాయి. ఏం చదవాలి? ఏ కోర్సు ఎంచుకోవాలి? చదువు కొనసాగించాలా? లేక ఉపాధి వైపు అడుగుపెట్టాలా? అన్న డైలమా కనిపిస్తుంది. టెన్త్ తర్వాత చదువు కొనసాగించడానికి అనేక మార్గాలున్నాయి. వేర్వేరు రంగాల్లో పదుల సంఖ్యలో కోర్సులున్నాయి. ఉన్నత చదువులు కాకుండా వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందాలంటే అనేక అవకాశాలున్నాయి. డిఫెన్స్, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ రంగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి.

 

పదో తరగతి తర్వాత డిఫెన్స్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. డిఫెన్స్‌లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ విభాగాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలుంటాయి. ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్లు జారీ అవుతుంటాయి. టెక్నికల్ కేడర్‌లో క్లర్క్, జనరల్ డ్యూటీ, నర్సింగ్ అసిస్టెంట్, టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో నాన్ టెక్నికల్ ట్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇండియన్ నేవీలో డాక్ యార్డ్ అప్రెంటీస్, సెయిలర్స్ మాట్రిక్ ఎంట్రీ, ఆర్టిఫైసర్ అప్రెంటీస్ పరీక్షలుంటాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలుంటాయి. ఇక రైల్వేలో 10వ తరగతి అర్హతతో గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాలు ఉంటాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పదో తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేస్తాయి. బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్‌బీ, ఎన్ఐఏ లాంటి ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఉద్యోగుల్ని నియమిస్తుంది ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వారికి కావాల్సిన శిక్షణను కూడా అందిస్తుంది. టెన్త్ పాసైనవారికి ఎక్కువగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్స్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి.

ఇవి కాకుండా రెండేళ్ల కోర్సులు చేసి ఉపాధి పొందొచ్చు. డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాల్లో చేరొచ్చు. ఆర్ట్ టీచర్, కమర్షియల్ ఆర్ట్, బ్యూటీ కల్చర్, గార్మెంట్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ల్యాబరేటరీ టెక్నీషియన్ లాంటి విభాగాల్లో డిప్లొమా కోర్సులుంటాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టులు ఉంటాయి. వీటితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు విభాగాల్లో 10వ తరగతి అర్హతతో ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తుంటాయి.

సో, చూశారుగా పదోతరగతి అయ్యాక ఏమేం చేయవచ్చో? చదువొక్కటే జీవితం లో ఎదగడానికి మార్గం కాదు.. చదువుకుంటే పుస్తకాల్లో ఉన్నది మాత్రమే తెలుస్తుంది.. అదే చదువుకోకపోతే ప్రపంచమంతా తెలుస్తుంది.. అందుకే చదువుల్లో మొదటి ర్యాంక్ రాలేదని, చదువబ్బలేదని అధైర్యపడవద్దు.. ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించుకుని ఈ పోటీ ప్రపంచం లో ముందుకు దూసుకెళ్ళండి.. ఆల్ ద బెస్ట్.. 

మరిన్ని

Comments

0 Comments

చదువు

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()