పిల్లలకు చదువులు, దాంతో పాటే తల్లిదండ్రులకు ఖర్చు భారమైన ఈ కాలం లో కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా, క్వాలిటీగా చదువు చెప్తే ఎలా ఉంటుంది? ఇలాంటి సదుపాయం ఎంతో మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుంది, ఇక్కడ మీరు తెలుసుకోబోయే వివరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాం.. ఇక్కడ ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు.. ఇక వివరాల్లోకి వెళితే.
ఎన్‌డీఎల్‌ఐ: ఈ ప్లాట్ ఫాం ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుకేషన్ వరకు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లందరికీ పూర్తి సమాచారాన్ని అందిస్తోంది.
ఇందులో ఉండబోయే ప్రధానాంశాలు:
- 47 లక్షల ఆర్టికల్స్.. 70 లక్షల పుస్తకాలు ఒకే చోట..
- పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లకి అన్నిరకాల పుస్తకాలు..
- ఒక్కసారి రిజిస్టరైతే ఎనీ టైమ్ చదువుకోవచ్చు..
విద్యకు సంబంధించిన పుస్తకాల కోసం యువత ఇక గ్రంథాలయాల చుట్టూ, బుక్‌షాప్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లోనే సమస్త సమాచారం తెలుసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) యాప్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది.
ఇందులో అత్యంత ప్రామాణిక కంటెంట్ ఉంటుంది. టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో నిష్ణాతులైన కంటెంట్ హోస్టులు, 100కి పైగా అభ్యసన సాధనాలు, 90 లక్షల మంది అందించిన 47 లక్షల ఆర్టికల్స్, దాదాపు 70 లక్షల పుస్తకాలు.. ఇవీ స్థూలంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్‌డీఎల్‌ఐ) ప్రత్యేకతలు. www.ndl.iitkgp.ac.in వెబ్‌సైట్‌లో ఈ అంశానికి సంభందించి పూర్తి వివరాలుంటాయి.
గత ప్రశ్నాపత్రాలు, వ్యవసాయం, చరిత్ర, టెక్నాలజీ, కంప్యూటర్, సైన్స్ ,సోషియలాజీ, ఆంత్రోపాలజీ, విద్య పరిశోధన, భౌతికశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర పుస్తకాలు ఈ యాప్ ఆధారంగా చదువుకోవచ్చు.
ఇంటర్నెట్ ఉంటే చాలు ఏదో ఒకచోట కూర్చొని అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. జాతీయ విద్యా మిషన్‌లో భాగంగా జాతీయ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది. అన్నిరకాల పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఇందులో అందుబాటులో ఉంచింది. వీడియో పాఠాలను సైతం ఉచితంగా అందిస్తోంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఇందులో ఉంచింది.
నేషనల్ డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు ఉచితంగా చదివేందుకు ముందుగా లాగిన్ కావాల్సి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఆన్‌లైన్‌లో ఎన్‌డీఎల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.
మెయిల్ ఐడీ ద్వారా కూడా రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఏయే పుస్తకాలు కావాలి. ఏ విద్యాసంస్థలో చదువుతున్నారు.. వంటి పూర్తి వివరాలు అందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒకసారి రిజిష్టర్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా చదువుకోవచ్చు. సో ఇప్పటికే ఎంతో మంది ఈ యాప్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా ఈ యాప్ గురించి తెలియకపోతే వెంటనే గూగిల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుని వెంటనే వినియోగించుకోండి..
------
నవంబర్ 1 2020 న గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షలు:
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ పరీక్ష తేదీని ప్రకటించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ పరీక్ష తేదీని కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఐదో తరగతి గురుకుల ప్రవేశపరీక్షను నవంబర్ 1న నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రవేశపరీక్షను నిర్వహిస్తామన్నారు.
అక్టోబర్ 15 నుంచి 31 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 48,240 సీట్ల కోసం 1,48,168 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. అభ్యర్థులు హాలిటికెట్లు, పూర్తి వివరాల కోసం www.tgcet.cgg.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి 2020-21కి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
--------
కొద్ది రోజుల్లో డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం:
రాష్ట్రంలో పరీక్షల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక కొద్ది రోజుల్లోనే డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు వారు చదివిన కాలేజీల్లోనే రాసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విన్నపం మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈ అనుమతి మంజూరు చేశారు. సెప్టెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు ప్రారంభమవుతుండగా మూడు రోజులు ముందుగా ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
యూజీసీ ఆదేశాల ప్రకారం యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. దీంతో యూనివర్సిటీలు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్స్ కూడా ప్రకటించాయి.
--------
సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్ విడుదల:
అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
నవంబర్ 7తో ఆరు విడతల కౌన్సెలింగ్:
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్ ప్రకటించింది. ఈఏడాది అక్టోబరు 6 నుంచి ఈ ప్రక్రియ మొదలై నవంబరు 7వ తేదీతో ఆరు విడతల సీట్ల కేటాయింపు ముగుస్తుంది. పూర్తి వివరాలు www.josaa.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దేశవ్యాప్తంగా 111 ప్రముఖ సంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ (ఎంటెక్‌లోని కంప్యూటర్ సైన్స్ సీట్లకు మాత్రమే), విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కర్నూలు, శ్రీసిటీలోని ట్రిపుల్‌ఐటీల్లో సీట్లను జోసా ద్వారా భర్తీ చేస్తారు.
రెండు సార్లు మాక్ కౌన్సెలింగ్:
మొదటి విడత సీట్ల కేటాయింపు కంటే ముందుగా రెండుసార్లు మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అప్పటికే వెబ్ ఆప్షన్లు (ఛాయిస్ ఫిల్లింగ్) ఇచ్చుకున్న వారికి ఎక్కడ సీట్లు రావచ్చో దీనివల్ల తెలుస్తుంది. అవసరమైతే విద్యార్థులు తమ ఆప్షన్లను మార్చుకొని మళ్లీ నమోదు చేసుకోడానికి ఇలా చేస్తారు. ఈసారి సీటు వచ్చాక స్వయంగా వెళ్లి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆరు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే వాటి భర్తీకి మరో రెండు విడతల కౌన్సెలింగ్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
అక్టోబరు 6: రిజిస్ట్రేషన్/ఛాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం
అక్టోబరు 12వ తేదీ: మొదటి నమూనా సీట్ల కేటాయింపు
అక్టోబరు 14వ తేదీ: రెండోసారి నమూనా సీట్ల కేటాయింపు
అక్టోబరు 16వ తేదీ: మొదటి విడత సీట్ల కేటాయింపు
అక్టోబరు 21వ తేదీ: 2వ విడత సీట్ల కేటాయింపు
అక్టోబరు 26వ తేదీ: 3వ విడత సీట్ల కేటాయింపు
అక్టోబరు 30వ తేదీ: 4వ విడత సీట్ల కేటాయింపు
నవంబరు 3వ తేదీ: 5వ విడత సీట్ల కేటాయింపు
నవంబరు 7వ తేదీ: 6వ విడత సీట్ల కేటాయింపు
ఇవీ విద్యార్ధులకు సంభందించిన తాజా విశేషాలు.. మరిన్ని అప్డేట్స్ మరొక వీడియోలో తెలియజేస్తాం..
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments