కరోనా వైరస్ ఆరోగ్యం తోనే కాకుండా విద్యార్థుల భవిత తో కూడా ఆడుకుంటోంది. కొన్ని తరగతులకు పరీక్షలు అయితే మరి కొందరికి పరీక్షలు కాకుండానే కరోనా సెలవలు వచ్చేసాయి. అయితే పరీక్షలతో విద్యార్ధులకి పెద్ద చిక్కే వచ్చిందని చెప్పాలి. పరిస్థితి ఇలానే ఉంటే చాల కష్టమే అనే చెప్పాలి. విద్యార్ధులకి ఎప్పుడు ఏ పరీక్షలు అవుతాయో అర్ధం కాకుండా చిక్కుల్లో పడ్డారు. పరీక్షలు వ్రాసేసిన ఫలితాలు ఇప్పట్లో రావని అర్ధం అయ్యిందే.
కామన్ ఎంట్రన్స్ టెస్టులకి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చెసేసారని ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలియజేసారు. ఈ మహమ్మారి వల్ల లాక్ డౌన్ పొడిగించారు. మళ్ళీ మరో సారి కనుక పొడిగిస్తే దాన్ని బట్టి వారు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఏడవ తేదీ తర్వాత మళ్ళీ మార్పులు ఏమైనా ఉన్నా నిర్ణయాలు ఏమైనా తీసుకున్నా తెలుపుతామని అయన చెప్పారు. మే నెల మొత్తం కూడా లాక్ డౌన్ ఉంటే కనుక జూన్ మూడో, నాలుగో వారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
డిగ్రీ అలానే ఆ పై స్థాయి లో జరగాల్సిన వాటిని నిర్వహిస్తాం కానీ పాస్, ఫెయిల్ ఉండదని డైరెక్ట్ గా ప్రమోట్ చేసేస్తారని ఆయన అంటున్నారు. ఇప్పటి దాక జరిగిన సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని అన్నారు. అలానే ఎంత సిలబస్ అయ్యింది అనే దాని పై విద్యాసంస్థల తో మాట్లాడనున్నారట. అంతే కాకుండా ఆన్ లైన్ తరగతులని కూడా నిర్వహిస్తాం అన్నారు. అలానే వచ్చే కొత్త విద్యా సంవత్సరం నెల లేదా రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందిట.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments