అయితే కరోనా వైరస్ కారణంగా ఈసారి టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏకంగా ఒక సారి కాదు పలు సార్లు కూడా ఈ పరీక్షలు వాయిదా పడడం జరిగింది. అయితే దీంతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
అలానే పరీక్షలు రాయాలని సంసిద్ధతను కోల్పోతున్నారు. అయితే ఈ కరోనా నేపథ్యం లో ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎస్ఎస్సి వార్షిక పరీక్షలు రద్దు చేసి పై తరగతికి ప్రమోట్ చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రికగ్నైస్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపి రెడ్డి ప్రభుత్వాన్ని పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరారు.
అయితే పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి ఆన్లైన్లో అందజేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించిన పై తరగతులకు అనుమతించాలని ఆయన చెప్పారు.
ఆదివారం విలేకరుల తో సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా ఆయన మాట్లాడారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకుని పదో తరగతి విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేయాలని చెప్పారు
ఈ వేడుకల్లో భాగంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జలగం సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎస్ ఎన్ రెడ్డి కోశాధికారి శ్రీకాంత్ నాయకులు రామచంద్రా రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments