రైల్వే జాబ్స్ 2020 కంప్లీట్ ఇన్‌ఫర్మేషన్ ..

img

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర్ అవబోతున్నారా? .. రైల్వే జాబ్స్ గురించి ఇలాంటి  మరిన్ని వివరాలు కావాలంటే వీడియో చివరి వరకూ చూడండి..

నిరుద్యోగులకు రైల్వే వరాల జల్లు కురిపిస్తోంది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. కొంతకాలం క్రితం లక్షన్నరకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టింది రైల్వే. అంతేకాదు... రెండేళ్లలో మరో లక్ష మంది ఉద్యోగులు రైల్వే నుంచి రిటైరౌతారని అంచనా. ఈ లెక్కన రైల్వే నుంచి మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జారీ చేసిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ-ఎన్ టీ పీ సీ నోటిఫికేషన్‌లోనే 35 వేలకు పైగా పోస్టులున్నాయి. త్వరలో హాల్ టికెట్లు కూడా రిలీజ్ చేయనుంది ఆర్‌ఆర్‌బీ. ఎన్‌టీపీసీ కేటగిరీలో స్టేషన్ మాస్టర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ అప్రెంటీస్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, గూడ్స్ గార్డ్ లాంటి పోస్టులున్నాయి. మరి ఈ పోస్టుల్లో ఏ పోస్ట్ ఎంచుకుంటే మంచిది? ఏ పోస్టుకు జీతం ఎంత? చేయాల్సిన విధులేంటీ? ఏ పోస్ట్ ఎంపిక చేసుకుంటే మంచిది? తెలుసుకోండి.

స్టేషన్ మాస్టర్: తన డ్యూటీ స్టేషన్ పరిధిలో నడిచే రైళ్లకు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తారు. సిగ్నల్స్ ఆపరేట్ చేయడం, అన్ని పనులు నిబంధనల ప్రకారం సాగుతున్నాయో లేదో చూసుకోవడం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ విధి. డిగ్రీ పాసైన వాళ్లు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

గూడ్స్ గార్డ్: గూడ్స్ రైళ్లను మేనేజ్ చేయాల్సిన బాధ్యత గూడ్స్ గార్డుది. డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేయొచ్చు. ప్రిలిమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ అప్రెంటీస్: కమర్షియల్ అప్రెంటీస్ ఉద్యోగుల్నే మల్టీ టాస్కింగ్ సూపర్‌వైజర్స్ అంటారు. రెండేళ్లు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత చీఫ్ పార్శిల్, కమర్షియల్, గూడ్స్ క్లర్క్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్స్ పోస్టులకు ఎంపిక చేస్తారు. డిగ్రీ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఆఫీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. డిగ్రీ పాసైనవాళ్లను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ట్రాఫిక్ అప్రెంటీస్: ట్రాఫిక్ అప్రెంటీస్‌ను ఆపరేషన్స్ బ్రాంచ్‌లో మల్టీ టాస్క్‌డ్ సూపర్‌వైజర్‌గా నియమిస్తారు. రెండేళ్లు గార్డ్, స్టేషన్ మాస్టర్, సెక్షన్ కంట్రోలర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

సీనియర్ టైమ్ కీపర్: రైళ్ల రాకపోకల సమయాన్ని రికార్డ్ చేసి పెట్టడం సీనియర్ టైమ్ కీపర్ విధి. డిగ్రీ పాసైన వాళ్లను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్: ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ రిజర్వ్‌డ్ టికెట్స్ జారీ చేయడం ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ డ్యూటీ. కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

 

ఇవే కాక రైల్వేలో వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. అర్హతల్ని బట్టి ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చు.

ట్రాఫిక్ అసిస్టెంట్: సీనియర్లకు అసిస్టెంట్‌గా ఉంటారు. సిగ్నల్ లేదా ట్రాఫిక్ ఇంఛార్జ్‌గా శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: భారతీయ రైల్వేలో ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పనిచేయాల్సి ఉంటుంది. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ నేతృత్వంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టింగ్ లభిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇదిలా ఉంటే వివిధ విభాగాల్లో ఉన్న వేకెన్సీలు ఒకసారి చూద్దాం..

ఆర్ పీ ఎఫ్: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మొత్తం 8619 కానిస్టేబుళ్లు, 1120 ఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. అందులో 4216 కానిస్టేబుల్, 201 ఎస్సై పోస్టుల్ని మహిళల కోసం కేటాయించడం విశేషం.

భారతీయ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌- ఆర్ పీ ఎఫ్ విభాగంలో 9,000 ఖాళీలను భర్తీ చేస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అందులో 50 శాతం అంటే 4,500 పోస్టుల్లో మహిళా కానిస్టేబుళ్లను నియమించనున్నట్టు శుక్రవారం రాజ్యసభకు వివరించారు. ప్రస్తుతం ఆర్‌పీఎఫ్‌లో మహిళా కానిస్టేబుళ్లు 2.25 శాతం మాత్రమే ఉన్నారని, ఈ అంశంపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి ఆదేశించారని, అందుకే మొత్తం ఖాళీల్లో 50 శాతం అంటే 4,500 మంది లేడీ కానిస్టేబుళ్లను నియమించుకోబోతున్నామని పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భారతీయ రైల్వేలో భాగం. ఆర్‌‌పీఎఫ్‌లో భారీగా ఖాళీలున్నాయి. వాటి భర్తీ ప్రక్రియను గతేడాది చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మొత్తం 8619 కానిస్టేబుళ్లు, 1120 ఎస్సై పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. అందులో 4216 కానిస్టేబుల్, 201 ఎస్సై పోస్టుల్ని మహిళల కోసం కేటాయించడం విశేషం. ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, ఆ తర్వాత ఆర్‌పీఎఫ్‌లో లేడీ కానిస్టేబుల్, ఆఫీసర్ల సంఖ్య పెరుగుతుందని చెప్పారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్. ఇక మహిళా కానిస్టేబుళ్లకు వాకీటాకీ అందించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్-జీ ఆర్ పీ శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తే, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ - ఆర్‌‌పీఎఫ్ రైల్వే ఆస్తులకు రక్షణగా నిలుస్తాయన్నారు.

రైల్వేలో మొత్తం 2.32 లక్షల ఖాళీలున్నాయని, త్వరలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రెండేళ్లలో మరో లక్ష మంది ఉద్యోగులు రిటైరౌతారని ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు పీయూష్ గోయల్. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ భారతీయ రైల్వేలో లక్షన్నరకు పైగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. త్వరలో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రైల్వే ఉద్యోగం చేయాలనుకుంటే ఇప్పటినుంచే పరీక్షలకు సిద్ధమవడం మంచిది.

చూశారుగా, వివిధ రైల్వే ఉద్యోగాలు, రాబోయే రోజుల్లో ఖాళీ అవుతున్న ఉద్యోగాల సంఖ్య? ఇక మీదే ఆలస్యం.. ఎలాగూ మరో మోడేళ్ళలో లోక్సభ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ లోపల అనేక ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది.. all the best..

మరిన్ని

Comments

0 Comments

చదువు

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()