సోనూసూద్ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రాం, తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఏపీ లో నిరుద్యోగులకు తాజా అలర్ట్, ఏపీ లో యువతకి సరికొత్త స్కిల్ development ప్రోగ్రాం మొదలైన ఆశక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సోనూసూద్ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రాం:
కరోనా కష్ట కాలంలో సినీనటుడు సోనూసూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. ఆయన సేవల్ని యావత్ ప్రపంచం కొనియాడింది. ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తూ.. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నాడు. రీల్ విలన్ కాస్త రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. అయితే తాజాగా పేద విద్యార్ధుల కోసం తన దివంగత తల్లి సరోజ్ సూద్ పేరు మీద ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రాంను రూపొందించాడు.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అణగారిన వర్గాల చెందిన నిరుపేద విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని సోనూ సూద్ ప్రకటించాడు. వార్షికాదాయం రూ. 2 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు చెంది ఉండి.. మెరుగైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులు.. 10 రోజుల్లో తమ వివరాలను scholarships@sonusood.me మెయిల్‌కు పంపాలని సోనూసూద్ పేర్కొన్నాడు.
ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. గడిచిన కొద్దినెలల్లో నిరుపేద కుటుంబాలు తమ పిల్లల చదువు కోసం ఎలా కష్టపడుతున్నారో నేను చూశాను. కొంతమందికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఫోన్లు లేవు, మరికొందరికి ఫీజు చెల్లించడానికి డబ్బు లేదు. కాబట్టి, నా తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరుతో స్కాలర్‌షిప్‌లను అందించడానికి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. మోగా (పంజాబ్) లో ఆమె ఎంతోమంది పిల్లలకు ఉచితంగా పాఠాలు బోధించేవారు. ఆ ప్రేరణతోనే.. ఆమె చేసిన మంచి పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఇదే మంచి సమయం అని సోనూసూద్ తెలిపారు.
----------
తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల:
దసరాకి 3.. సంక్రాతికి 2 రోజులే సెలవులు..!
రాష్ట్ర ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు నేడు విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులుగా ఖరారు చేసింది. దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే గా 2021 ఏప్రిల్ 16ను ఖరారు చేసింది.
రాష్ట్ర ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. జూనియర్ కాలేజీల అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు నేడు విడుదల చేసింది. విద్యాసంవత్సరం మొత్తం పనిదినాలు 182 రోజులుగా ఖరారు చేసింది. దసరాకు 3 రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే గా 2021 ఏప్రిల్ 16ను ఖరారు చేసింది.
ఇక ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ ప్రవేశాల విషయంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పరీక్ష రాయని ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేయాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉన్నట్లు సమాచారం. మార్చిలో వార్షిక పరీక్షలు రాసేందుకు పరీక్ష ఫీజులు చెల్లించి.. హాజరుకాలేకపోయిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులనూ పాస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ఇంటర్ బోర్డు సంబంధిత ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. త్వరలోనే ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
------------
ఏపీ లో నిరుద్యోగులకు తాజా అలర్ట్:
నిరుద్యోగులందరూ వెంటనే www.apcos.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి.. ఖాళీలను బట్టి మీకు అవకాశం కల్పిస్తారు..!
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గొప్ప వరాన్ని ప్రకటించింది. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (ఆప్కాస్) కార్పొరేషన్‌ను ప్రారంభించి నిరుద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పాలిట వరంలా మారింది. దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. పూర్తి వివరాలకు www.apcos.ap.gov.in వెబ్‌సైట్ సందర్శించవచ్చు. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ.
పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం దీని అసలు ఉద్దేశ్యం...
వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) తో పాటు ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ప్రక్రియకు సంబంధించి వన్–స్టాప్–షాప్ గా ఆప్కాస్ పని చేస్తుంది.
ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్ పరిధిలోకి చేరుస్తారు.
ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ మాత్రమే ప్లేస్‌మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
ఇప్పుడు ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్ కోడ్ ఇస్తారు.
రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.
కార్పొరేషన్ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు.
కార్పొరేషన్ పరిధిలోకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.
ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి.
కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి.
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్ ప్రకటించింది. ఈఏడాది అక్టోబరు 6 నుంచి ఈ ప్రక్రియ మొదలై నవంబరు 7వ తేదీతో ఆరు విడతల సీట్ల కేటాయింపు ముగుస్తుంది. పూర్తి వివరాలు www.josaa.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
తగ్గిపోనున్న ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ సంస్థలు, దళారుల బెడద:
అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు జరుగుతాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి.
ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెలా పూర్తి వేతనాలు అందుతాయి.
ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలుంటాయి.
లంచాలు, వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ కార్పొరేషన్ ద్వారానే చెల్లిస్తారు.
--------------
ఏపీ లో యువతకి సరికొత్త స్కిల్ development ప్రోగ్రాం:
ఏపీ యువత వెంటనే www.apssdc.in వెబ్‌సైట్‌లో పేరు ఎన్‌రోల్ చేసుకోవచ్చు..
యువతను ఉద్యోగార్హులుగా తీర్చిదిద్దడం కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
నైపుణ్యాల లేమితో బాధపడుతున్న విద్యార్థులకు, కొత్త అంశాలను నేర్చుకోవాలి అనుకుంటున్న ఔత్సాహిక విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ((APSSDC) గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.
ఔత్సాహిక విద్యార్థులకు పలు అంశాల్లో ఆన్‌లైన్ స్కిల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 10,000 మంది విద్యార్థులు, 9000 మంది అధ్యాపకులకు శిక్షణ ఇచ్చింది.
శిక్షణ ఇచ్చే అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఈ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం, గూగుల్, ఫేస్‌బుక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆసక్తి ఉన్న విద్యార్థులు www.apssdc.in వెబ్‌సైట్‌లో ఈ కోర్సులకు సంబంధించి ఎన్‌రోల్ చేసుకోవచ్చు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈ-సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. ఈ కోర్సులు, సర్టిఫికెట్ ఉద్యోగ అవకాశాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు ఏవో తెలుసా?
డిజిటల్ ఫౌండేషన్, గోల్, జూనియర్ వెబ్ డెవలపర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఆటోమేటీవ్ డిజైన్స్, వెబ్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ మోడలింగ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్, ఏఆర్/వీఆర్/ఎంఆర్, డ్రోన్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సుల కాల వ్యవధి 60 నుంచి 80 గంటలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు, గిరిజనులు, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ విద్యార్థులు, నర్సులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఈ సంస్థ ద్వారా భవిష్యత్తులోనూ మరెన్నో అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
సో చూశారుగా సోనూసూద్ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రాం, తెలంగాణా ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఏపీ లో యువతకి సరికొత్త స్కిల్ డెవెలప్ మెంట్ ప్రోగ్రాం మొదలైన విషయాలు తెలుసుకున్నారుగా.. ఈ అంశాలు మీతో పాటూ మీ ఫ్రెండ్స్ కి, అవసరమైన వారికి కూడా షేర్ చెయ్యండి..
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగావకాశాలు.. రైల్వేలో వరుస నోటిఫికేషన్లు... ఏ ఉద్యోగం బెటర్? ఎలాంటి క్యాటెగిరీ జాబులు అందుబాటులో ఉన్నాయి? రాబోయే రెండేళ్ళలో లక్షకు పైగా ఉద్యోగులు రైల్వే నుండి రిటైర...
చాలా మంది 10th క్లాస్ లో పాస్ అయ్యి, పై చదువులకు వెళుతూ ఉంటారు.. అయితే కొంతమంది 10th ఫెయిల్ అయ్యి డీలాపడిపోతుంటారు.. ఈ రోజు మనం అసలు చదువు అనేది జీవితంలో భాగమా లేక చదువే జీవితమా? అనేది తెల్సుకుం...
0 Comments