యువత తలచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించే సంఘటణలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకరు మెడికల్ టెస్ట్ లు చిటికెలో చేసుకునే యాప్ తయారు చేస్తే మరొకరు తన బ్రుందం సహాయం తో గ్రోసరీస్ ని అత్యంత సులువుగా కస్టమర్లకు చేరవేసేందుకు పరిష్కారం చూపారు..ఇంకొకరు గుర్రపుడెక్క సహాయం తో అనేకమందికి ఉపాధి కల్పించడంతో పాటూ ప్రక్రుతిని కాపాడుతున్నారు....
ఇక వివరాల్లోకి వెళితే అన్ని రకాల మెడికల్ టెస్టులకు ఒకే మొబైల్ యాప్.. స్టార్టప్ దశలోనే కొనుగోలు చేసిన గూగుల్:
వైద్య రంగంలో రోజుకో ఆవిష్కరణ జరుగుతోంది. టెక్నాలజీ పుణ్యమాని హెల్త్ సెక్టార్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఆ కోవలోనే మరో ఆవిష్కరణ జరిగింది. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ శ్వేతక్ పటేల్ సియాటిల్ బేస్డ్ హెల్త్ మానిటరింగ్ డివైజ్ ఆవిష్కరించారు. అది స్టార్టప్ దశలో ఉండగానే నిమిషం ఆలస్యం చేయకుండా దాన్ని గూగుల్ కొనుగోలు చేసింది.
సోనోసిస్ హెల్త్ అనే ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన మెడికల్ డివైజ్ గా పనిచేస్తుంది. ఆరోగ్య సంబంధమైన అనేక గణాంకాలను పక్కాగా సేకరిస్తుంది. ఫోన్లోని యాక్సిలెరోమీటర్, మైక్రోఫోన్, ఫ్లాష్, కెమెరాల సాయంతో అనేక రకాల పరీక్షలు నిమిషాల్లో చేసేస్తుంది. సెనోసిస్ అనే యాప్ ద్వారా ఊపిరితిత్తుల పనితీరు, హిమోగ్లోబిన్ శాతం వగైరా లెక్కగట్టి చెప్తుంది. ఉదాహరణకు హిమోగ్లోబిన్ పర్సంటేజీ చూడాలంటే వేలిమీద ఒక ఫ్లాష్ ఇస్తే చాలు.. రక్తం సంగతి క్షణాల్లో చెప్పేస్తుంది. అదొక్కటే కాదు.. ఫోన్లో ఉన్న సెన్సార్ల సాయంతో రకరకాల వైద్య పరీక్షలన్నీ రెప్పపాటులో చేయొచ్చు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్వేతక్ నలుగురి సాయంతో ఈ డివైజ్ మీద వర్కవుట్ చేశాడు. అతను "జెన్సీ ఇన్ కార్పొరేషన్" అనే సంస్థను అంతకు ముందే స్థాపించాడు. లో పవర్ వైర్ లెస్ సెన్సార్ ప్లాట్ ఫాం కంపెనీకి "కో ఫౌండర్" గా కూడా వ్యవహరిస్తున్నాడు. భారత సంతతికి చెందిన శ్వేతక్ తయారు చేసిన ఈ హెల్త్ మానిటరింగ్ డివైజ్ "స్టార్టప్" దశలో ఉండగానే గూగుల్ దాన్ని కొనుగోలు చేసింది.
ఈ-టెయిలింగ్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్న 21 ఏళ్ల కుర్రాడు.. ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్లో పట్టుబిగిస్తున్న ఢిల్లీ స్టార్టప్ :
గ్రూఫెర్స్: ఓ పెద్ద కిరాణా ఈ-టెయిలింగ్ కంపెనీ. ఇటీవల పలు నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసింది.
లోకల్ బన్యా: కిరాణా ఈ-టెయింలింగ్ లో ఓ సంచలనం లాంటిది. కానీ ఇప్పటికే ఇది మూతపడింది.
పెప్పర్ ట్యాప్: నిత్యావసర వస్తువుల ఆన్ లైన్ మార్కెట్ లో ట్రెండ్ సెట్టర్. కానీ ఈ ఏడాదే వ్యాపారాన్ని క్లోజ్ చేసింది..
ఇది ప్రస్తుతం కిరాణా ఈ-టెయిలింగ్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి. ఆన్ లైన్ వ్యాపారం క్రేజ్ తారాస్థాయికి చేరినప్పుడు.. అన్నింటిలో లాగే నిత్యావసర సరుకుల కోసం కూడా పెద్ద ఎత్తున ఆన్ లైన్ బజార్లు పుట్టుకొచ్చాయి. వినూత్నమైన పోకడలు, వింత మార్కెట్ పద్దతులతో ఖర్చులు, ఆదాయంపై అవగాహన లేకుండా చాలా కంపెనీలు పరుగులు ప్రారంభించడంతో మొదటికే మోసం రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఓ రకంగా ఇప్పుడు కిరాణా "ఈ-టెయిలింగ్" మార్కెట్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముందస్తు వ్యూహం, ఆదాయమార్గాలు, ఖర్చుల నియంత్రణ లాంటివాటిపై స్పష్టమైన అవగాహనతో ప్రారంభిస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టాడు 21 ఏళ్ల షెరుంజ్ జలాన్. ఢిల్లీకి చెందిన ఈ కుర్రాడు పెద్ద పెద్ద సంస్థలు చేతులెత్తేసిన స్పేస్ లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పటికే షెరుంజ్ ఆలోచనలు అతని ప్రయాణం సరైన దిశలోనే సాగుతోందని అనిపించేలా చేస్తున్నాయి. 19 ఏళ్లకే అంట్రపెన్యూర్ ఆలోచనలు అతడి సొంతం..
ఢిల్లీకి చెందిన షెరుంజ్ రెండేళ్ల కిందటే సీఏ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆన్ లైన్ గ్రోసరీ ఫ్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను తల్లిదండ్రులతో కూడా పంచుకున్నాడు. వాళ్లూ ప్రోత్సాహించారు. తన పాకెట్ మనీ రూ.30 వేలతో కొంత పని కూడా పూర్తి చేశాడు. తల్లిదండ్రుల వద్ద నుంచి మరికొంత సాయం పొందాడు. అయితే వ్యాపారం ప్రారంభించినా.. చదువు కూడా కొనసాగించాలని షెరుంజ్ కు తల్లిదండ్రులు షరతు పెట్టారు. పేరెంట్స్ ఆర్థిక సాయంతో ఆక్టోబర్ 2014 లో "బజార్ క్రాఫ్ట్ ఈ-టెయిలింగ్ ఫ్లాట్ ఫామ్" ను ప్రారంభించాడు జలాన్. ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ లలో మొదటగా కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పట్లో ఈ-టెయిలింగ్ మార్కెట్లో ఉన్న పరిస్థితులతో "జస్ట్ ఇన్ టైమ్" మోడల్ ను వినియోగదారులకు ఆఫర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత గంటలోపే డెలివరీ ఇవ్వడం బజార్ క్రాఫ్ట్ ప్రత్యేకత. ఇందు కోసం కొన్ని కీలకమైన ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా షాపు యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులకే జలాన్ కి అసలు కష్టం అంటే ఏమిటో తెలిసొచ్చింది. వ్యాపారాన్ని చురుగ్గా చేయాలంటే మరింత సిబ్బంది అవసరమని గుర్తించారు. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం. ఆర్డర్స్ డెలివరీ చేయడం కూడా తలనొప్పిగా మారిపోయింది. పైగా లాభాలను ఏ పద్దతిలో సాధించాలో జలాన్ కు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సమస్యలపై సమరం...
చిన్న వయసులోనే అంట్రప్రెన్యూర్ షిప్ ప్రారంభించినా ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టినా జలాన్ వెనక్కి తగ్గలేదు. అసలు తన వ్యాపారం ఏమిటి..? తను ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి..? వాటిని పరిష్కరించుకునే మార్గాలేమిటి..? అని ఒక్కొక్కటిగా లెక్క వేసుకుని.. పరిష్కరించుకోవడం ప్రారంభించాడు. అందులో జలాన్ కు కనిపించిన మొదటి సమస్య వర్క్ ఫోర్స్. ఉద్యోగులు లేనిదే ఏ పనీ చేయలేమని గుర్తించాడు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చు అయ్యేలా అప్పుడే స్టడీస్ పూర్తి చేసుకున్నవారిని రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. అది సత్ఫలితాలను ఇచ్చింది. తక్కువ వేతనాలకు ప్రతిభావంతమైన ఉద్యోగులు లభించారు. రెండో సమస్య డెలివరీ... దీన్ని అధిగమించేందుకు కస్టమర్లకు మొదటగా ఆఫర్ చేసిన "జస్ట్ ఇన్ టైమ్" మోడల్ ను తీసేశాడు. ఇరవై నాలుగ్గంటల్లో డెలివరీ చేస్తామనే ప్రచారం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత తన బజార్ క్రాఫ్ట్ లో కొత్త కొత్త అంశాలను చేర్చాడు. పర్సనల్ కేర్, స్టేషనరీ కూడా అందుబాటులో ఉంచాడు. చివరిగా లాభాలను పెంచుకోవడానికి రీటైలర్లతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులకు డెలివరీ చేయడం ప్రారంభించాడు. దాంతో ఒక్కసారిగా చుట్టుముట్టిన సమస్యలు వరుసగా పరిష్కారం కావడం ప్రారంభమయ్యాయి. దాంతో జలాన్ కు ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. "బజార్ క్రాఫ్ట్ లో 43 మంది టీం ఉంది. వీరి సగటు వయసు 23 మాత్రమే. డెలివరీ మోడల్ ను మార్చడంతో మరింత సేవింగ్స్ పెంచుకున్నాం. నేరుగా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేయడం వల్ల కమిషన్ శాతం పెరిగింది. దీని వల్ల వినియోగదారులకు మేము డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేసి ఆకర్షించగలుగుతున్నాం" అని ష్రెనుజ్ జలాన్ వివరించాడు..
సక్సెస్ దారిలో మొదటి అడుగులు ఇప్పటికి బజార్ క్రాఫ్ట్ కు 45,000 మంది యూనిక్ కస్టమర్లున్నారు. ఇందులో నలభై శాతం మంది తమ ఇంటి అవసరాలకు పూర్తిగా బజార్ క్రాఫ్ట్ ఫ్లాట్ ఫామ్ నే వాడుకుంటున్నారు. రోజుకు రెండు వందల ఆర్డర్లు ఏడాదికి ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ప్రస్తుతం బజార్ క్రాఫ్ట్ నమోదు చేస్తోంది. " సొంత డెలివరీ టీమ్.. తక్కువ వేతనాలు తీసుకునే ఉద్యోగులు, కొత్త డెలివరీ మోడల్ తో వ్యయం బాగా తగ్గిపోయింది. ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు నెలకు రెండు లక్షలు మాత్రమే అధికంగా ఖర్చు అవుతుంది. అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించగలం అని ష్రెనుజ్ నమ్మకంగా చెబుతున్నాడు.. బజార్ క్రాఫ్ట్ ఫౌండర్ వెబ్ సైట్, యాప్ లను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు ఈ-వాలెట్, పర్సనలైజ్డ్ ఆఫర్లు ఇచ్చే సౌకర్యాలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు ప్రారంభించారు. మెడిసిన్స్ ను బజార్ క్రాఫ్ట్ లో యాడ్ చేయనున్నారు. బజార్ క్రాఫ్ట్ పేరుతో ఆఫ్ లైన్ స్టోర్లనూ ప్రారంభించే యోచనలో ఉన్నారు. అలా.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రంగాల్లో తనదైన ముద్రవేయాలని ష్రెనుజ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. వచ్చే రెండేళ్ల కాలంలో కనీసం పది మెట్రో, టైర్ టూ సిటీస్ లో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టున్నాడు ష్రెనుజ్.
మార్కెట్ పెద్దదే.. కానీ ఒడిసి పట్టుకోవాలి.. భారత ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ 2021 కల్లా 5 బిలియన్ల మార్క్ ను అందుకుంటుందని అంచనా. గణాంకాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఈ రంగంలో ఉన్న కంపెనీలు ఆ స్థాయిలో పనితీరు చూపించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. 2011 నుంచి గ్రూఫెర్స్, బిగ్ బాస్కెట్, జాప్ నౌ, పెప్పర్ ట్యాప్, లోకల్ బన్యా లాంటి సంస్థలు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. పెప్పర్ ట్యాప్, లోకల్ బన్యా భారీగా పెట్టుబడులను సాధించినప్పటికీ నిలబడలేకపోయాయి. కార్యకలాపాలు నిలిపివేశాయి. అయితే ఈ రంగంలో బజార్ క్రాఫ్ట్ లాంటి చిన్న సంస్థలు తమదైన ప్రత్యేకత చూపిస్తున్నాయి. ఇవి 5 బిలియన్ల ఆన్ లైన్ గ్రోసరీ మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ గా మారినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ష్రెనుజ్ లాంటి యువతరం అంట్రప్రెన్యూర్ల ఆలోచనలు ఈ దిశగానే సాగుతున్నాయి.
గుర్రపు డెక్కతో అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్న తెనాలి కుర్రాడు:
గుర్రపు డెక్క గురించి మీరు వినేవుంటారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, జలాలనూ కలుషితం చేసే ఒకరకమైన కలుపుమొక్క. వీటిని తొలగించడానికి ప్రభుత్వాలు ఇప్పటిదాకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుచేశాయి. విదేశీ టెక్నాలజీ ఉపయోగించినా సమస్య తీరలేదు. చెరువు మీద చిక్కగా పచ్చగా పారుతూ, కొంతకాలం తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తుంది. పర్యావరణం మీద ప్రభావం చూపించే అనేకానేక అంశాల్లో గుర్రపు డెక్క ఒకటి.
గుర్రపుడెక్క నిర్మూలన విషయాన్ని కాసేపు పక్కన పెడితే, వాటి కాడలతో అద్భుత కళాఖండాలు తయారు చేయిస్తూ, 70 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు అబ్దుల్ ముజీబ్. పనికిరాని గుర్రపు డెక్కను కుటీర పరిశ్రమకు ముడిసరుకుగా వాడి, నిరుపేద కుటుంబాల్లో ఆకలి లేకుండా చేస్తున్నాడు. గుర్రపు డెక్కతో అద్భుతాలు చేయడమే కాదు.. మనిషి మనుగడకు అవసరమైన నీటి వనరులను కలుపు మొక్కల బారినుంచి తనవంతు ప్రయత్నంగా కాపాడుతున్నాడు. మొదటగా గుర్రపు డెక్కను స్థానికంగా ఉండే చెరువు నుంచి సేకరించి ఎండబెడతాడు. ఒక్కో కాడను సన్నగా చీరి, మ్యాట్ తయారు చేస్తాడు. తొలుత చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అలా మొదలైంది అతడి ప్రయాణం. పరిశోధనలో భాగంగా ఒకసారి అస్సాంకి వెళ్లాడు. అక్కడ ఇలాంటి కలుపు మొక్కలతోనే అందమైన హాండిక్రాఫ్ట్స్ తయారు చేయడం గమనించాడు. అలా పదిరోజుల పాటు, అనేక ప్రాంతాలు తిరిగి, ఎన్నో రకాల కళాఖండాలను గమనించాడు.
తిరిగి ఆంధ్రాకు వచ్చాక, గుర్రపు డెక్క తీవ్రంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో సర్వే చేశాడు. అలా 2014 అక్టోబర్ లో అల్లిక అనే సంస్థను స్థాపించాడు. మొదటగా ఆరుగు మహిళలకు శిక్షణ ఇచ్చాడు. ఒక్కో ఐటెం పెంచుకుంటూ మార్కెట్ మీద పట్టు సంపాదించాడు. రెండున్నరేళ్లలో ఊహించని విధంగా అల్లిక క్లిక్ అయింది. ప్రస్తుతం 70 మంది కళాకారులు తన సంస్థలో పని చేస్తున్నారు. హాండ్ బ్యాగులు, బుట్టలు, డైనింగ్ మ్యాట్స్, హోం డెకార్, లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, లాప్ టాప్ బ్యాగ్స్, కాన్ఫరెన్స్ బ్యాగులు, లాంప్ షేడ్స్ తదితర వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తాడు. గుర్రపు డెక్కను సేకరించడానికి కొందరిని నియమించుకున్నాడు. దాదాపు 30 మంది దానికోసమే పనిచేస్తారు. వాళ్లంతా చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లో గుర్రపు డెక్కను కోసి తీసుకొస్తారు. తెనాలి, పెద్రవూరు, అంగల్ కుదురు, జగడగుంటపాలెంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని చెరువులు, కుంటల నుంచి వాటిని సేకరిస్తారు. భారతదేశంలో హస్తకళా పరిశ్రమ ఇంకా కుటీర పరిశ్రమగానే వుంది. కొన్నేళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. ఏటా 20 శాతం ఆర్ధిక ప్రగతి సాధిస్తున్న ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రావల్సిన అవసరం ఉందంటాడు అబ్దుల్ ముజీబ్. మార్కెటింగ్ అంతా ఫేస్ బుక్ ద్వారానే చేసుకుంటాడు. ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ స్టాల్స్ పెడతాడు. అయితే, డిమాండ్ అనుకున్నంతగా లేదనేది ముజీబ్ అభిప్రాయం. దాన్నిబట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే భవిష్యత్తులో కొత్త ప్రాడక్ట్స్ తయారు చేయాలని భావిస్తున్నాడు.
ఫ్యూచర్ ప్లాన్స్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన అబ్దుల్ ముజీబ్ ఆలోచనంతా పర్యావరణ పరిరక్షణ మీదనే. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారుచేయడం మీదనే తన ఫోకస్ అంతా. ఇప్పుడు గుర్రపుడెక్క కాడల నుంచే ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాడు. భవిష్యత్తులో దాని ఆకులు, వేర్లను ఎండబెట్టి సేంద్రియ ఎరువు తయారు చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఈ మొక్కల నుంచి వచ్చే నార ద్వారా శానిటరీ ప్యాడ్స్ తయారు చేయాలన్నది "అల్లిక" మరో ప్రాజెక్ట్. ఏపీ, తెలంగాణలో ఎక్కడైతే గుర్రపు డెక్క అందుబాటులో వుంటుందో అక్కడ టీంని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. తద్వారా మహిళలకు ఆర్ధికంగా చేయూతనివ్వడమే కాకుండా, గుర్రపు డెక్క బారినుంచి చెరువులను తనవంతు సాయంగా కాపాడాలని చూస్తున్నాడు.
చూశారుగా యువత ఎంత ఉత్సాహంగా తమదైన అభిరుచులతో వివిధ రంగాల్లో వ్యాపార అవకాశాలను స్రుష్టించుకుని ఎదుగుతున్నారో? మీరు కూడా కేవళం ఉద్యోగం వస్తేనే చేస్తాం లేకుంటే ఖాలీగా ఉంటాం అని అనుకోకుండా వివిధ వ్యాపార అవకాశాలను తెలుసుకుంటూ మీకు బాగా అనుకూలమైన వ్యాపారాన్ని అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని న్యూస్ 6జి ఆశిస్తోంది..
ఈ విషయం పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలియజెయ్యండి..
పేటీఎమ్ రూపకర్త విజయ శేఖర్ శర్మ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా పేటీయం ను గూగిల్ ప్లేస్టోర్ నుండి తొలగించింది.. ఆ వివరాల్లోక్లి వెళ్ళేముందు ఒక...
వ్యాపారం అంటూ తమవద్ద రుణం తీసుకుని పథకం ప్రకారం మోసం చేయడం తో పాటు గ్యారెంటీగా పెట్టి ఆస్తులని ఉద్దేశపూర్వకంగా విక్రయించారని కరూర్ వైశ్య బ్యాంక్ అధికారులు నగర నేర పరిశోధన విభాగం లో ఫిర్యాదు చేశారు. అ...
0 Comments